S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/09/2017 - 00:53

కోల్‌కతా: వివేకానంద యువ భారతి క్రీడాంగణ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో చిలీపై ఇంగ్లాండ్ 4-0 తేడాతో గెలిచింది. జాడన్ సాంచో రెండు గోల్స్ చేసి, ఈ విజయంలో కీలక భూమిక పోషించాడు. మొదటి నుంచి చివరి వరకూ ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఇంగ్లాండ్‌కు ఐదో నిమిషంలో కల్లం హడ్సన్ ఒడోయ్ మొదటి గోల్‌ను సాధించిపెట్టాడు. సాంచో 51, 60 నిమిషాల్లో గోల్స్ చేయగా, 81వ నిమిషంలో ఏంజెల్ గోమ్స్ గోల్ నమోదు చేశాడు.

10/09/2017 - 00:52

గౌహతి, అక్టోబర్ 8: అమిన్ గియిరి రెండు గోల్స్‌తో రాణించగా, ప్రత్యర్థి ఆటగాళ్లు ఇద్దరు ఓన్ గోల్స్ చేయడంతో, న్యూ కలెడోనియాను అండర్-17 వరల్డ్ కప్‌లో ఆదివారం ఢీకొన్న ఫ్రాన్స్ 7-1 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ ఐదో నిమిషంలోనే కలెడోనియా ఆటగాడు బెర్నార్డ్ ఇవా ఓన్ గోల్ చేసి, ఫ్రాన్స్ ఖాతాను తెరిచాడు. 19వ నిమిషంలో గియిరి తన మొదటి గోల్‌ను నమోదు చేశాడు.

10/09/2017 - 00:52

సుజుకా: జపనీస్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ ట్రోఫీతో విజేత లూయస్ హామిల్టన్ (మెర్సిడిజ్). రెడ్‌బుల్ డ్రైవర్లు మాక్స్ వెర్‌స్టాపెన్, డానియల్ రిసియార్డో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించారు

10/09/2017 - 00:50

జైపూర్, అక్టోబర్ 8: ప్రో కబడ్డీ లీగ్‌లో ఆదివారం గుజరాత్ ఫార్ట్యూన్‌జెయింట్స్‌ను ఢీకొన్న పాట్నా పైరేట్స్ నాలుగు పాయింట్ల తేడాతో పరాజయంపాలైంది. గుజరాత్ 33 పాయింట్లు చేయగా, పాట్నా 29 పాయింట్లకు పరిమితమైంది. మహేంద్ర రాజ్‌పుత్ 6, ఫజల్ అత్రాచలి, సచిన్ చెరి ఐదు చొప్పున పాయింట్లు సాధించి గుజరాత్ విజయానికి దోహదపడ్డారు. పాట్నా తరఫున మోనూ గోయత్, విజయ్ చెరి ఆరేసి పాయింట్లు చేశారు.

10/09/2017 - 00:50

బీజింగ్‌లో జరిగిన చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ట్రోఫీని గెల్చుకున్న ఫ్రాన్స్ క్రీడాకారిణి కరోలిన్ గార్సియా. ఆదివారం నాటి ఫైనల్‌లో ఆమె సిమోనా హాలెప్ (రుమేనియా)ను 6-4, 7-6 తేడాతో ఓడించింది. కాగా, పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు. తుది పోరులో అతను నిక్ కిర్గియోస్‌పై 6-2, 6-1 ఆధిక్యంతో సునాయాసంగా గెలిచాడు

10/09/2017 - 00:49

బ్లూంఫొంటైన్, అక్టోబర్ 8: ఫాస్ట్ బౌలర్ కాగిసో రబదా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో మరో ఐదు చొప్పున మొత్తం పది వికెట్లు పడగొట్టడంతో, శ్రీలంకతో జరిగిన రెండవ, చివరి టెస్టును దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 254 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌ను దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లకు 573 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసింది.

10/08/2017 - 00:26

కొచ్చి, అక్టోబర్ 7: అండర్-17 సాకర్ వరల్డ్ కప్ ఫేవరిట్స్‌లో ఒకటైన బ్రెజిల్ బోణీ చేసింది. ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో పటిష్టమైన స్పెయిన్‌ను 2-1 తేడాతో ఓడించి సత్తా చాటింది. పాలిన్హో కీలక గోల్ చేసి, బ్రెజిల్ విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. మ్యాచ్ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే బ్రెజిల్ ఆటగాడు వెస్లీ పొరపాటు ఓన్ గోల్ చేయడంతో, స్పెయిన్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

10/08/2017 - 00:20

రాంచీ, అక్టోబర్ 7: భారత్‌తో టి-20 సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ దూరమయ్యాడు. అతని స్థానంలో వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పగ్గాలు చేపట్టాడు. శనివారం మొదటి టి-20 ప్రారంభానికి ముందు ఆసీస్ మేనేజ్‌మెంట్ అధికారికంగా స్మిత్ గాయాన్ని గురించి ప్రకటించింది.

10/08/2017 - 00:19

జైపూర్, అక్టోబర్ 7: ప్రో కబడ్డీ లీగ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ చివరి వరకూ పోరాడినప్పటికీ హర్యానా స్టీలర్స్ చేతిలో రెండు పాయింట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. వజీర్ సింగ్ 14 పాయింట్లతో రాణించగా, దీపక్ కుమార్ దహియా 5, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లు చేయడంతో హర్యానా 32 పాయింట్లు తన ఖాతాలో వేసుకోగలిగింది.

10/08/2017 - 00:19

రాంచీ, అక్టోబర్ 7: వర్షం కారణంగా అంతరాయం ఏర్పడి, చివరికి డక్‌వర్త్ లూయస్ విధానం ద్వారా లక్ష్యాన్ని సవరించాల్సి వచ్చిన తొలి టి-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్ 9 వికెట్ల తేడాతో ఓడించింది. లక్ష్యాన్ని 6 ఓవర్లలో 48 పరుగులుగా నిర్థారించగా, మరో మూడు బంతులు మిగిలి ఉండగానే, ఒక వికెట్ కోల్పోయ, గమ్యాన్ని చేరింది.

Pages