S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/07/2017 - 00:27

జైపూర్, అక్టోబర్ 6: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చ్యూన్‌జెయంట్స్, బెంగాల్ వారియర్స్ జట్లు తమతమ ప్రత్యర్థులపై విజయాలను నమోదు చేశాయ. జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఎదుర్కొన్న గుజరాత్ 29-23 ఆధిక్యంతో గెలిచింది. ఇరు జట్లు చివరి వరకూ తీవ్ర పోరాటాన్ని సాగించాయ. కాగా, మరో మ్యాచ్‌లో బెంగాల్ 25-19 పాయంట్ల తేడాతో పునేరీ పల్టన్‌ను ఓడించింది.

10/07/2017 - 00:41

రాంచీ: వర్షం కారణంగా అవుట్‌ఫీల్డ్ బురదమయం కావడంతో, శుక్రవారం ఉదయం నాటి టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. ఇన్‌డోర్స్‌లోనూ భారత జట్టు ప్రాక్టీస్ చేయలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరికొంత మంది ఆటగాళ్లు చాలాసేపు స్టాండ్స్‌లో నిలబడి, ఆటకు అనువైన పరిస్థితులు ఏర్పతాయేమోనని ఎదురుచూశారు. కానీ, అలాంటి అవకాశం లేకపోవడంతో ప్రాక్టీస్ రద్దయినట్టు జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది.

10/06/2017 - 02:49

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: రంజీ ట్రోఫీ క్రికెట్‌కు మళ్లీ స్టార్ల కళ వచ్చేసింది. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన చాలా మంది క్రికెటర్లు రంజీలో ఆడడాన్ని చిన్నతంగా భావించేవారు. దీనితో ద్వితీయ శ్రేణి క్రికెటర్లు లేదా జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాళ్లకు మాత్రమే రంజీ పరిమయ్యేది. కానీ, కాంట్రాక్టులో ఉన్న వారంతా విధిగా రంజీ ట్రోఫీలో ఆడాలని ఇటీవలే బిసిసిఐ ఆదేశాలు జారీ చేసింది.

10/06/2017 - 02:49

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను నిర్వహించే హక్కులను పొందడం ద్వారా ఈ టోర్నీని భారత్ ఇప్పటికే గెల్చుకుందని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) సహాయ కార్యదర్శి, క్రొయేషియా సాకర్ లెజెండ్ వొనిమిర్ బొబన్ వ్యాఖ్యానించాడు.

10/06/2017 - 01:44

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద కనువిందు చేస్తున్న ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మస్కట్ ‘ఖేలో’. ఈ టోర్నమెంట్ నేడు ప్రారంభం కానుంది. ఆతిథ్యమిస్తున్న కారణంగా భారత్ క్వాలిఫయర్స్‌తో సంబంధం లేకుండా ఈ టోర్నీకి అర్హత సంపాదించింది. తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడడం ద్వారా భారత్ తన ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది.

10/06/2017 - 01:32

అండర్-17 వరల్డ్ కప్ టైటిల్ సాధించిన వారిలో ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లోరెంట్ సినమా పొన్గొలే మాత్రమే గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ అవార్డులను గెల్చుకున్నాడు. ఎక్కువ సంఖ్యలో గోల్డెన్ బాల్ అవార్డులను పొందిన దేశం నైజీరియా. ఆ దేశానికి చెందిన కెలెచీ నాకలి (2015), కెలెచి ఇహినాచో (2013), సనీ ఎమాన్యుయెల్ (2009), ఫిలిప్ ఒసండో (1987) గోల్డెన్ బాల్ అవార్డుకు ఎంపికయ్యారు.

10/06/2017 - 01:30

అండర్-17 వరల్డ్ కప్ (2003)లో ఫ్రెడ్డీ అడూ హ్యాట్రిక్ నమోదు చేసినప్పుడు అతని వయసు 14 సంవత్సరాలు. మరో నాలుగేళ్లలో, 2007లో అతను అండర్-20 వరల్డ్ కప్‌లో అతను మళ్లీ హ్యాట్రిక్ సాధించాడు. రెండు ఫిఫా వరల్డ్ కప్ టోర్నీల్లో హ్యాట్రిక్ చేసిన ఏకైక క్రీడాకారుడిగా అడూ రికార్డు ఇప్పటికీ పదలంగా ఉంది.

10/06/2017 - 01:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: అండర్-17 సాకర్ ప్రపంచ కప్‌రికార్డుల విషయానికి వస్తే, టోర్నమెంట్‌ను ఎక్కువ పర్యాయాలు సాధించిన ఘనత నైజీరియాకు దక్కుతుంది. ఆ జట్టు ఐదుసార్లు (1985, 1993, 2007, 2013, 2015) ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అంతేగాక 1987, 2001, 2009 సంవత్సరాల్లో రన్నరప్ ట్రోఫీని అందుకుంది. ఇంత ఘన చరిత్ర ఉన్న నైజీరియా ఈసారి భారత్‌లో జరిగే ఈవెంట్‌కు అర్హత సంపాదించలేకపోవడం దురదృష్టకరం.

10/06/2017 - 01:26

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: యువ సాకర్ ప్రపంచ యుద్ధానికి భారత్ వేదిక కానుంది. శుక్రవారం నుంచి మొదలయ్యే అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో పోటీ పడేందుకు 24 జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఆతిథ్య దేశం భారత్ తొలి మ్యాచ్‌లో అమెరికాను ఢీ కొంటుంది. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.

10/06/2017 - 01:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌లో ఎంతో మంది సమర్థులు పోటీపడుతున్నప్పటికీ, అభిమానుల దృష్టి కొద్ది మందిపైనే కేంద్రీకృతమైంది. రాబోయే కాలంలో మేటి అంతర్జాతీయ స్టార్లుగా ఎదిగే సత్తావున్న క్రీడాకారులకు దీనిని సరైన వేదికగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. మన దేశానికి చెందిన అంకిత్ జాధవ్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు.

Pages