S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/03/2017 - 00:38

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పేర్లు లేకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. సెలక్టర్ల తీరును తప్పుపడుతున్నారు. ఆశిష్ నెహ్రా వంటి వెటరన్ ఫాస్ట్ బౌలర్‌కు అవకాశమిచ్చి, అశ్విన్, జడేజాను విస్మరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

10/03/2017 - 00:36

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: నాగపూర్‌లో ఆదివారం జరిగిన ఐదవ, చివరి వనే్డలో ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో చిత్తుచేసి, సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. రాబోయే మూడు టి-20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌లోనూ ఇదే స్థాయిలో చెలరేగి, విజయాలను నమోదు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత క్రికెటర్లకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.

10/03/2017 - 00:35

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఆస్ట్రేలియాతో జరిగే టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో తాను అద్భుతంగా రాణిస్తే అది వార్త అవుతుందని, ఒకవేళ విఫలమైతే మరింత పెద్ద వార్తగా మారుతుందని భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించాడు. మొత్తం మీద ఏదైనా ఒక వార్తగానే మిగిలిపోతుందని అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నాడు.

10/03/2017 - 00:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: నంబర్ వన్ జట్టుగా కొనసాగాలంటే, ప్రత్యర్థి జట్లపై కనికరం ఉండకూడదని భారత క్రికెట్ కోచ్ రవి శాస్ర్తీ వ్యాఖ్యానించాడు. ప్రతి మ్యాచ్‌లోనూ దాడికి దిగడం, సర్వశక్తులు ఒడ్డి పోరాడడం అత్యవసరమని, అప్పుడే ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతామని జట్టు సభ్యులకు సూచించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వనే్డలో టీమిండియా ఆడిన తీరు ప్రశంసనీయమని చెప్పాడు.

10/03/2017 - 00:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: భారత టాప్ ఆర్డర్‌లోని ముగ్గురు బ్యాట్స్‌మెన్ అంటే ప్రత్యర్థులంగా అసూయ చెందుతున్నారని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్య రహానేను అసాధారణ ప్రతిభావంతులుగా పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ అభివర్ణించాడు.

10/03/2017 - 00:32

మెల్బోర్న్, అక్టోబర్ 2: ‘చైనామన్’ బంతులతో అదరగొడుతున్న భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భవిష్యత్తులో ప్రపంచ మేటి బౌలర్‌గా ఎదుగుతాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ జోస్యం చెప్పాడు. కుల్దీప్ అద్భుతంగా బౌల్ చేస్తున్నాడని, తరచు వైవిధ్యాన్ని తెస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్న్ తెలిపాడు.

10/03/2017 - 00:31

పోచెఫ్‌స్ట్రూమ్, అక్టోబర్ 2: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 333 పరుగుల తేడాతో చిత్తయింది. దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ మొదటి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు చొప్పున వికెట్లు పడగొట్టి, తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

10/03/2017 - 00:29

ముంబయి, అక్టోబర్ 2: సెలక్టర్ల నిర్ణయం తనకు శిరోధార్యమని ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో చోటు దక్కని భారత బ్యాట్స్‌మన్ అజింక్య రహానే స్పష్టం చేశాడు. సోమవారం స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న రహానే విలేఖరులతో మాట్లాడుతూ అవిశ్రాంతంగా మ్యాచ్‌లు ఆడుతున్నామని చెప్పాడు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు టి-20 సిరీస్‌కు జట్టును ప్రకటించి ఉంటారని అన్నాడు.

10/03/2017 - 00:27

అబూదబీ, అక్టోబర్ 2: రంగన హెరాత్ స్పిన్ మాయ పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టులో శ్రీలంకకు 21 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని అందించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు చొప్పున మొత్తం 11 వికెట్లు పడగొట్టిన హెరాత్ టెస్టుల్లో 400 వికెట్ల బౌలర్ల జాబితాలో చేరడం విశేషం. ఈ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 154.5 ఓవర్లలో 419 పరుగుల భారీ స్కోరు సాధించింది.

10/03/2017 - 00:26

విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 2: భారత్ ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల రెండో అనధికార టెస్టులో న్యూజిలాండ్ ‘ఎ’ ఎదురీదుతున్నది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 104 పరుగులు చేసింది. భారత్ ‘ఎ’ కంటే ఇంకా 132 పరుగులు వెనుకంజలో నిలిచిన ఈ జట్టు చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. చివరి రోజు ఆటలో భారత్ ‘ఎ’ బౌలింగ్‌ను కివీస్ ‘ఎ’ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.

Pages