S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/14/2017 - 23:20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: భారత మహిళా బాక్సింగ్ తొలి విదేశీ కోచ్ స్ట్ఫోన్ కొటాలార్డా తన పదవికి రాజీనామా చేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన 41 ఏళ్ల అతను భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)కి రాసిన తన రాజీనామా లేఖలో తీవ్ర పదజాలాన్ని ఉపయోగించాడు. తనకు ఇచ్చిన హామీలను బిఎఫ్‌ఐ నెరవేర్చలేదని, ఈ పరిస్థితుల్లో భారత బృందానికి సేవలు అందించడం సాధ్యం కాదని ఒక స్పష్టం చేశాడు. 3నాకు చాలా ఓపిక ఉంది.

09/14/2017 - 23:19

చిత్రం.. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గురువారం నెట్స్‌కు హాజరైన ఆస్ట్రేలియా వైస్-కెప్టెన్ డేవిడ్ వార్నర్, కెప్టెన్ స్టీవ్ స్మిత్

09/14/2017 - 23:16

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన టీమిండియాలో స్థానం సంపాదించిన శిఖర్ ధావన్‌కు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సెలవు మంజూరు చేసింది. తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా, ఈ మూడు మ్యాచ్‌ల నుంచి తనను తప్పించాలని ధావన్ చేసిన విజ్ఞప్తిపై బిసిసిఐ సానుకూలంగా స్పందించింది.

09/14/2017 - 23:15

మాడ్రిడ్, సెప్టెంబర్ 14: రియల్ మాడ్రిడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేశాడు. ఆఫ్ సీజన్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో మళ్లీ మైదానంలోకి దిగిన అతను అపోయెల్ నికొసియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి, రియల్ మాడ్రిడ్‌కు 3-0 తేడాతో విజయాన్ని అందించాడు.

09/14/2017 - 23:14

ఎడ్మాంటన్, సెప్టెంబర్ 14: కెనడాతో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ పోటీల్లో యుకీ భంబ్రీ, రాంకుమార్ రామనాథన్‌పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. ఈ పోటీలకు ఎంపిక చేసిన జట్టులో వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌కు చొటు దక్కని విషయం తెలిసిందే.

09/14/2017 - 00:59

లాహోర్, సెప్టెంబర్ 13: పాకిస్తాన్‌తో ఇక్కడి గడాఫీ స్టేడియంలో బుధవారం జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవెన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఈ జట్టుకు ఓపెనర్ హషీం అమ్లా అజేయ అర్ధ శతకంతో అండగా నిలిచాడు.

09/14/2017 - 00:58

బార్సిలోనా, సెప్టెంబర్ 13: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా జువెంటాస్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా స్టార్ లియోనెల్ మెస్సీ రెండు గోల్స్ చేసి, తన జట్టు 3-0 తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు.

09/14/2017 - 00:58

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 13: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు బిసిసిఐ రెండు ప్రతిష్ఠాత్మకమైన సిరీస్‌ల నిర్వహణకు అనుమతి ఇచ్చినట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు.

09/14/2017 - 00:58

సోనేపట్, సెప్టెంబర్ 13: అజయ్ ఠాకూర్ చివరి క్షణాల్లో చేసిన రైడ్ ద్వారా ఫుల్ పాయింట్లు లభించడంతో, యుపి యోద్ధతో చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో తమిళ తలైవాస్ విజయం సాధించింది. నితిన్ తోమర్ (14 పాయింట్లు), రిషాంక్ దేవాడిగ (8 పాయింట్లు), నితేష్ కుమార్ (5 పాయింట్లు) రాణించడంతో యుపి యోద్ధ ప్రారంభం నుంచి గట్టిపోటీనిచ్చింది.

09/14/2017 - 00:57

వస్కాదువా, సెప్టెంబర్ 13: శ్రీలంకలోని వస్కాదువాలో జరిగిన పశ్చిమాసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో ముంబయికి చెందిన రిషభ్ షా రెండు కాంస్య పతకాలు సాధించాడు. దక్షిణ ముంబయి చెస్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న రిషభ్ అండర్-14 ర్యాపిడ్, బ్లిజ్ విభాగాల్లో తృతీయ స్థానాల్లో నిలిచాడు. ర్యాపిడ్ చెస్‌లో శ్రీలంక గ్రాండ్ మాస్టర్ అభ్యర్థి హెచ్. తిలకరత్న స్వర్ణ పతకం సాధించగా, మహమ్మద్ ఫహాద్ రహ్మాన్‌కు రజతం లభించింది.

Pages