S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/04/2017 - 00:52

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఫిన్లాండ్‌లోని టాంపెరేలో జరుగుతున్న ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు చెందిన మంజు కుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 59 కిలోల విభాగంలో పోటీ పడుతున్న ఆమె కాంస్య పతకం కోసం గురువారం రాత్రి జరిగిన బౌట్‌లో 2-0 తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన ఇలోనా ప్రొకొపెవ్‌నియుక్‌ను మట్టికరిపించింది.

08/04/2017 - 00:50

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఫిలిప్పీన్స్‌లోని పుయెర్టో ప్రినె్ససాలో జరుగుతున్న ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఆరుగురు భారతీయులు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

08/04/2017 - 00:50

వాషింగ్టన్, ఆగస్టు 3: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరుగుతున్న సిటీ ఓపెన్ ఎటిపి టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు యూకీ బాంబ్రీ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో సత్తా చాటుకున్నాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో మూడు సెట్ల పాటు హోరాహోరీగా పోరులో అతను డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆరో సీడ్ ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)పై సంచలన విజయం సాధించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు.

08/04/2017 - 00:48

ప్రిటోరియా, ఆగస్టు 3: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ట్రై సిరీస్ వన్‌డే టోర్నమెంట్‌లో భాగంగా గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్‌‘ఏ’ జట్టు దక్షిణాఫ్రికా ఎ జట్టుపై ఒక వికెట్ తేడాతో అద్భుత విజయం సాధించి ఫైనల్‌లో స్థానాన్ని దాదాపు ఖరారు చేసుకుంది. భారత జట్టు విజయంలో మనీశ్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది.

08/04/2017 - 00:48

ఆక్లాండ్, ఆగస్టు 3: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన నాలుగో సీడ్ ఆటగాడు హెచ్‌ఎస్.ప్రణయ్, నేషనల్ చాంపియన్ సౌరభ్ వర్మ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

08/03/2017 - 01:17

లండన్, ఆగస్టు 2: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ దగ్గరపడుతున్న కొద్దీ అందరి దృష్టీ ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌పై కేంద్రీకృతమైంది. 2015 మాదిరిగానే ఈసారి కూడా అతను పతకాల పంటను పండిస్తాడా? స్ప్రింట్‌తోపాటు 200 మీటర్ల పరుగు, రిలే విభాగాల్లోనూ సత్తా చాటుతాడా? అన్న ప్రశ్నలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ.

08/03/2017 - 00:24

కొలంబో, ఆగస్టు 2: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టుని 304 పరుగుల భారీ తేడాతో గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన టీమిండియా మరో విజయంపై కనే్నసింది. గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టును కూడా సాధిస్తే, సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవచ్చన్న ఉద్దేశంతో, సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది.

08/03/2017 - 00:24

కొలంబో: రెండో టెస్టులో ఓపెనర్ లోకేష్ రాహుల్‌కు చోటు లభిస్తుందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ప్రకటనతో అభినవ్ ముకుంద్ స్థానానికి ఎసరు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి లంక టూర్‌కు ముందు ఎంపిక చేసిన జట్టులో శిఖర్ ధావన్ లేడు. రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలగడంతో, ధావన్‌కు చోటు దక్కింది.

08/03/2017 - 00:23

లండన్: హోం సిటీ లండన్‌లో వేలాది మంది ప్రేక్షకుల మద్దతుతో బ్రిటిష్ అథ్లెట్ మో ఫరా మరోసారి సత్తా చాటే అవకాశం ఉంది. పురుషుల 5,000, 10,000 మీటర్ల పరుగులో అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే వరుసగా పది పర్యాయాలు టైటిళ్లను సాధించిన అతని ఖాతాలో, లండన్, రియో ఒలింపిక్స్ స్వర్ణాలు కూడా ఉన్నాయి. ఇటీవలే అతనులండన్ డైమండ్ లీగ్ 3,000 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని సాధించాడు.

08/03/2017 - 00:23

లండన్: అసాధారణ అథ్లెట్‌గా ఉసేన్ బోల్ట్ నుంచి ప్రశంసలు అందుకున్న దక్షిణాఫ్రికా రన్నర్ వేడ్ వాన్ నికెర్క్‌కు అరుదైన రికార్డును సమం చేయడం సాధ్యమా? కాదా? అన్నది ఉత్కంఠ రేపుతున్నది. 25 ఏళ్ల నికెర్క్ 200 మీటర్లు, 400 మీటర్ల ఈవెంట్స్‌లో పోటీపడనున్నాడు. 1996లో మైఖేల్ జాన్సన్ ఈరెండు ఈవెంట్స్‌లోనూ పాల్గొని, రెండింటిలోనూ విజేతగా నిలిచాడు. ఆ రికార్డును సమం చేసేందుకు నికెర్క్ ప్రయత్నిస్తాడు.

Pages