S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/01/2017 - 02:43

పారిస్, మే 31: ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. రెండో రౌండ్‌లో ఆమె జపాన్‌కు చెందిన కురుమీ నరాను 6-3, 6-1 తేడాతో చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే బలమైన సర్వీసులతో విరుచుకుపడిన వీనస్ చివరి వరకూ అదే స్థాయిలో ఆటను కొనసాగించి, విజయాన్ని నమోదు చేసింది.

06/01/2017 - 02:39

ది ఓవల్ (లండన్), మే 31: ఈసారి చాంపియన్స్ ట్రోఫీలో అద్వితీయ ప్రతిభ కనబరిచే కొంత మంది బ్యాట్స్‌మెన్, బౌలర్లను విశే్లషకులు ప్రస్తావిస్తుండగా, మరి కొంత మందిని కూడా సమర్థులుగానే అభిమానులు పేర్కొంటున్నారు. వివిధ జట్లలో ఉన్న పలువురు యువ, సీనియర్ ఆటగాళ్లు ఈ టోర్నీలో సవాళ్లు విసరడానికి సిద్ధంగా ఉన్నారని వారి అభిప్రాయం.

06/01/2017 - 02:39

లండన్, మే 31: నలుగురు ఫాస్ట్ బౌలర్లను చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రధాన అస్త్రాలుగా ఉపయోగించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. ‘బిగ్ ఫోర్’గా పిలిచే పాట్ కమిన్స్, జొష్ హాజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్, జేమ్స్ పాటిన్సన్ ఇంగ్లాండ్ వాతావరణాన్ని, పిచ్‌ల స్వభావాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

05/31/2017 - 08:01

లండన్, మే 30: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత జట్టు మరోసారి తన సత్తా చాటుకుంది. ఈ టోర్నీకి సన్నాహకంగా ఇంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు తాజాగా మంగళవారం 240 పరుగుల తేడాతో పసికూన బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.

05/31/2017 - 07:59

జైపూర్, మే 30: వివాదాస్పద రాజస్థాన్ క్రికెట్ సంఘ (ఆర్‌సిఎ) ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఈ ఎన్నికలు సోమవారమే ముగిసినప్పటికీ హైకోర్టు ఉత్తర్వు రావలసి ఉన్నందున బ్యాలెట్ పెట్టెలను ప్రభుత్వ ట్రెజరీలో భద్రపరిచారు.

05/31/2017 - 07:58

న్యూఢిల్లీ, మే 30: పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు ప్రభుత్వ అనుమతిపై ఆధారపడి ఉంటాయన్న విషయం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధికారులకు తెలుసని, కనుక పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులతో భేటీ కావలసిన అవసరం బిసిసిఐ అధికారులకు లేదని కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ మంగళవారం పునరుద్ఘాటించారు.

05/31/2017 - 07:58

పారిస్, మే 30: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తైవాన్ క్రీడాకారిణి హియె సు-వెయి (31) సంచలనం సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 109వ స్థానంలో కొనసాగుతున్న ఆమె మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో బ్రిటన్‌కు చెందిన ఏడో సీడ్ క్రీడాకారిణి జొహన్నా కోంటాకు చెక్‌పెట్టి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.

05/31/2017 - 07:57

లండన్, మే 30: చాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టుకు టైటిల్‌ను నిలబెట్టుకునే సామర్ధ్యం ఉందని శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కర మంగళవారం స్పష్టం చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ‘నిజమైన పదును’ను కలిగివున్న భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్న మిగిలిన జట్ల కంటే ఎంతో సమతూకంగా ఉందని సంగక్కర పేర్కొన్నాడు.

05/30/2017 - 08:29

లండన్, మే 29: మినీ ప్రపంచ కప్‌గా ప్రసిద్ధి చెందిన ప్రతిష్ఠాత్మక ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ (సిటి)లో ఈసారి ‘పంచ రత్నాలు’గా పిలవదగ్గ ఐదుగురు బ్యాటింగ్ స్టార్లపై అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది. వారిలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరి కంటే ముందున్నాడు. 2013 తర్వాత, సుమారు నాలుగేళ్లకు ఈ టోర్నమెంట్ మళ్లీ జరుగుతుండగా, డిఫెండింగ్ చాంపియన్‌గా టీమిండియా బరిలోకి దగనుంది.

05/30/2017 - 08:27

పారిస్, మే 29: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్, రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. మొదటి రౌండ్‌లో అతను మార్సెల్ గ్రానొలర్స్‌పై 6-3, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. అద్భుతమైన ప్లేసింగ్స్, బలమైన సర్వీసులతో విరుచుకుపడిన జొకోవిచ్‌కు గ్రానొలర్స్ గట్టిపోటీనిచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ, ప్రపంచ మేటి ఆటగాడి ముందు అతని ప్రయత్నాలు ఫలించలేదు.

Pages