S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/17/2017 - 02:07

ముంబయి, ఏప్రిల్ 16: పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ముంబయి ఇండియన్స్ దూసుకెళుతున్నది. గుజరాత్ లయన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో గెల్చుకొని, పాయింట్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. యువ బ్యాట్స్‌మన్ నితీష్ రాణా, కెప్టెన్ రోహిత్ శర్మ సమయోచిత బ్యాటింగ్ ముంబయిని గెలిపించింది.

04/17/2017 - 02:02

సింగపూర్: మహిళల సింగిల్స్‌లో భారత ఆశాకిరణం పివి సింధును ఓడించిన ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలినా మారిన్‌కు ఫైనల్‌లో చుక్కెదురైంది. ప్రస్తుతం నాలుగో ర్యాంక్‌లో ఉన్న ఈమె ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్ చేతిలో 15-21, 15-21 తేడాతో వరుస సెట్లలో పరాజయాన్ని ఎదుర్కొంది. మహిళల డబుల్స్ విభాగంలో కమిల్లా రైటర్ జూ, క్రిస్టినా పెడెర్సన్ జోడీ టైటిల్ అందుకుంది.

04/17/2017 - 02:08

ఒక బాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో ఇద్దరు భారతీయులు పురుషుల సింగిల్స్ ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి. భారత బాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన ప్రణీత్, శ్రీకాంత్ ఇద్దరూ గోపీచంద్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న వారు కావడంతో, దాదాపుగా రోజూ కలిసే ప్రాక్టీస్ చేస్తారు. ఒకరి ఆట గురించి మరొకరికి బాగా తెలుసు. ఒకరి వ్యూహాలపై మరొకరికి స్పష్టత ఉంది.

04/17/2017 - 01:57

ముంబయి: ఎలాంటి అవకాశాలకూ నోచుకోని ముంబయిలోని 18 వేల మంది పేద పిల్లలు ఆదివారం పండుగ జరుపుకొన్నారు. గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌ని ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం పేద పిల్లల కోసం కేటాయించింది. దీనితో స్టాండ్స్ మొత్తం నీలం రంగుతో నిండిపోయాయి. పిల్లలంతా ముంబయి ఇండియన్స్ జెర్సీలు ధరించడంతో అరేబియా సముద్రం వాంఖడే స్టేడియానికి తరలివచ్చిందా అన్నంతగా నీలం రంగును సంతరించుకుంది.

04/17/2017 - 01:56

కాన్సాస్ సిటీలో జరిగిన యుఎఫ్‌సి టైటిల్ పోరులో చాలెంజర్ విల్సన్ రీస్‌ను ఓడించిన డిఫెండింగ్ చాంపియన్ డిమెట్రియస్ ‘మైటీ వౌస్’ జాన్సన్ ఆనందం. అతను మొత్తం 10 పర్యాయాలు యుఎఫ్‌సి టైటిల్‌ను నిలబెట్టుకొని, ఆండర్సన్ సిల్వ గతంలో నెలకొల్పిన రికార్డును సమం చేశాడు

04/17/2017 - 01:55

బెంగళూరు, ఏప్రిల్ 16: పాయంట్ల పట్టికలో అ డుగున ఉన్న రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్ చేతి లోనూ ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అ భిమానులను నిరాశకు గురి చేసింది. విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న బెంగళూరుకు ఐదు మ్యా చ్‌ల్లో ఇది నాలుగో పరాజయం. పుణే నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని కూడా సాధించలేకపోయ న కోహ్లీ సేన 27 పరుగుల తేడాతో ఓటమిపాలై, పాయంట్ల పట్టికలో అట్టడుగు స్థానికి పడింది.

04/17/2017 - 01:52

జకార్తా, ఏప్రిల్ 16: భారత జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి కూడా క్రీడాకారిణిగా రాణిస్తున్నది. పెంబంగనాన్ జయ రయా జూనియర్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్‌లో ఆమె సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. బాలికల అండర్-15 విభాగం ఫైనల్‌లో ఆమె తన డబుల్స్ భాగస్వామి సమియా ఫరూఖీని 21-11, 18-21, 21-16 తేడాతో ఓడించింది.

04/16/2017 - 09:03

కోల్‌కతా, ఏప్రిల్ 15: ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శనివారం జరిగిన పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ 14వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. హోం గ్రౌండ్‌లో ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్‌లో, ఆతర్వాత బౌలింగ్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించింది.

04/16/2017 - 09:00

సింగపూర్, ఏప్రిల్ 15: భారత ఆటగాళ్లు సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న సింగపూర్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ టోర్నమెంట్‌లో బరిలోకి దిగిన ప్రణీత్ సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియా ఆటగాడు లీ డాంగ్ కెయున్‌ను 21-6, 21-8 తేడాతో చిత్తు చేసి, సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో తొలిసారి ఫైనల్ చేరాడు.

04/16/2017 - 08:59

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఐపిఎల్‌లో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 51 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది.

Pages