S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/16/2017 - 08:58

బెంగళూరు, ఏప్రిల్ 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ విజృంభణకు కారణమా? ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న అతను శుక్రవారం నాటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 47 బంతుల్లో 70 పరుగులు సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడానికీ, మంజ్రేకర్ విమర్శలకూ సంబంధం ఉందా?

04/15/2017 - 00:42

బెంగళూరు, ఏప్రిల్ 14: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అర్ధ శతకంతో రాణించి ఆదుకోవడంతో, ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొన్న ముంబయి ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.

04/15/2017 - 00:40

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో శుక్రవారం ఒకేరోజు రెండు హ్యట్రిక్స్ నమో దయ్యాయ. తొలుత, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న వెస్టిండీస్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ ఐపిఎల్‌లో 15వ హ్యాట్రిక్‌ను నమోదు చేయగా, ఆతర్వాత గుజరాత్ లయన్స్ మీడియం పేసర్ ఆండ్రూ టై కూడా హ్యాట్రిక్ సాధించాడు. మొత్తం మీద హ్యాట్రిక్ చేసిన బౌలర్లలో బద్రీ 12 బౌలర్‌కాగా ఆండ్రూ టై 13వ బౌలర్.

04/15/2017 - 00:37

సింగపూర్, ఏప్రిల్ 14: సింగపూర్ ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు ఓటమిపాలైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్‌ను ఢీకొన్న ఆమె 11-21, 15-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు పడిపోయి, రెండు నుంచి ఐదుకు చేరిన సింధు ఇటీవలే భారత్‌లో జరిగిన ఇండియన్ ఓపెన్ ఫైనల్‌లో మారిన్‌ను చిత్తుచేసింది.

04/15/2017 - 00:37

ముంబయి, ఏప్రిల్ 14: క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ జీవితం ఆధారంగా నిర్మించిన ‘సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్’ చిత్రం ఆసక్తి రేపుతున్నది. 1989 నుంచి 2013 వరకు అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించిన సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచ మేటి క్రికెటర్లలో ఒకడిగా చరిత్ర సృష్టించాడు. తన బయోపిక్ వచ్చేనెల 26న విడుదలవుతుందని సచిన్ స్వయంగా ప్రకటించడంతో ఇప్పటి నుంచి అభిమానుల సందడి మొదలైంది.

04/15/2017 - 00:35

కోల్‌కతా, ఏప్రిల్ 14: ‘మిస్టీరియస్ స్పిన్నర్’ సునీల్ నారైన్‌ను ఓపెనర్‌గా ఎవరైనా ఊహించగలుగుతారా? ఐపిఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్‌కు మాత్రమే నారైన్‌లో ఒక బ్యాట్స్‌మన్ కనిపించాడు. క్రిస్ లిన్ గాయం కారణంగా దూరంకావడంతో, అతని స్థానంలో హార్డ్ హిట్టర్‌ను ఓపెనర్‌గా దించాల్సిన అవసరం ఏర్పడింది.

04/15/2017 - 00:34

రాజ్‌కోట్, ఏప్రిల్ 14: ఐపిఎల్‌లో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్‌పై గుజ రాత్ లయన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పుణే నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18 ఓ వర్లలోనే చేరుకుంది. కెప్టెన్ సురేష్ రైనా, ఆరోన్ ఫించ్ గు జరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

04/14/2017 - 04:38

చిత్రాలు..రాష్టప్రతి భవన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు స్వీకరిస్తున్న
వికాస్ గౌడ (డిస్కస్‌త్రో), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), సాక్షి మాలిక్ (రెజ్లింగ్)

04/14/2017 - 00:56

బెంగళూరు, ఏప్రిల్ 13: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాయల్ చారెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్న విరాట్ కోహ్లీ భుజం గాయం నుంచి కోలుకున్నాడు. ముంబయి ఇండియన్స్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో పాల్గొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు కోహ్లీ గాయపడిన విషయం తెలిసిందే.

04/14/2017 - 00:54

కోల్‌కతా, ఏప్రిల్ 13: బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్, బ్యాటింగ్‌లో కెప్టెన్ గౌతం గంభీర్ రాణించడంతో, గురువారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సులభంగా గెలిచింది. ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఎవరూ ఊహిం చని రీతిలో విజయాలను నమోదు చేసిన పంజాబ్ దూకుడుకు నైట్ రైడర్స్ కళ్లెం వేసింది.

Pages