S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/14/2017 - 00:52

న్యూఢిల్లీ: పదో ఐపిఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న వీక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో 18.57 కోట్లకు చేరింది. మ్యాచ్‌ని సగటున 72 నిమిషాలు చూసిన వారిని లెక్కించారు. నిరుడు ఐపిఎల్‌లో ఈ సగటు 46 నిమిషాలుకాగా, 16.07 కోట్ల మంది మ్యాచ్‌లను చూశారు. ఈసారి పది మ్యాచ్‌లకే ఈ సంఖ్య 18 కోట్లు దాటింది.

04/14/2017 - 00:51

గయానా, ఏప్రిల్ 13: వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో పాకిస్తాన్‌ను గెలిపించిన స్టార్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను తన భార్య, భారత టెస్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు అంకితం చేశాడు. ఏడో పెళ్లిరోజు సందర్భంగా ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి ఇదేనని అతను ట్వీట్ చేశాడు.

04/14/2017 - 00:49

రాజ్‌కోట్, ఏప్రిల్ 13: గాయం బారిన పడడంతో ఐపిఎల్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రవీంద్ర జడేజా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆడతాడు. విరాట్ కోహ్లీ చేరికతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బలోపేతమైనట్టే, జడేజా రాకతో గుజరాత్ లయన్స్ ఆట తీరు మెరుగుపడే అవకాశాలున్నాయి.

04/14/2017 - 00:47

సింగపూర్, ఏప్రిల్ 13: సింగపూర్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఇండోనేషియాకు చెందిన ఫినేత్రి ఫినేత్రిని ఆమె 19-21, 21-17, 21-8 తేడాతో ఓడించి ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ కూడా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. అతను చైనాకు చెందిన క్వియావో బిన్‌ను 21-15, 21-23, 21-16 ఆధిక్యంతో ఓడించాడు.

04/14/2017 - 00:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కాశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమేనని, ఇందులో మరో వాదనకు తావులేదని భారత క్రికెటర్ గౌతం గంభీర్ తన ట్విటర్ అక్కౌంట్‌లో పోస్టు చేశాడు. పాకిస్తాన్ మద్దతుదారులు కొంత మంది శ్రీనగర్‌లో ఒక సిఆర్‌పిఎఫ్ జవానును చుట్టుముట్టు, రాళ్లతో కొట్టిన సంఘటనపై గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ఆ జవానుకు తగిలిన ఒక్కో దెబ్బకు వంద మంది జిహాదీలను హతమార్చి ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చాడు.

04/13/2017 - 08:38

ముంబయి, ఏప్రిల్ 12: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో బుధవారం ఉత్కంఠ భరితంగా సాగిన పదో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి, మొదటి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా రాయ ల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లను ఓ డించిన సన్‌రైజర్స్ మూడో విజయంతో హ్యాట్రిక్ సాధి స్తుందని అభిమానులు ఆశించారు.

04/13/2017 - 08:36

ట్యూరిన్ (ఇటలీ), ఏప్రిల్ 12: చాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్ మొదటి లెగ్ పోటీలో పటిష్టమైన బార్సిలోనాకు జవెంటాస్ షాకిచ్చింది. ఫార్వర్డ్ ఆటగాడు పాబ్లో డైబలా రెండు గోల్స్ చేయడంతో, జువెంటాస్ 3-0 తేడాతో బార్సిలోనాపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. లియోనెల్ మెస్సీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న బార్సిలోనాను మ్యాచ్ ఆరంభం నుంచే ఆత్మరక్షణలో పడేసిన జువెంటాస్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది.

04/13/2017 - 08:35

బీజింగ్, ఏప్రిల్ 12: చైనా బాడ్మింటన్ జాతీయ హెడ్ కోచ్‌గా 24 సంవత్సరాలు సుదీర్ఘ సేవలు అందించిన లీ యాంగ్‌బో పదవీ విరమణను ప్రకటించాడు. అతని మార్గదర్శకంలోనే చైనా పలువురు స్టార్లను బాడ్మింటన్ ప్రపంచానికి అందించింది. రియో ఒలింపిక్స్‌లో చైనా బాడ్మింటన్‌లో కేవలం రెండు స్వర్ణాలతో సరిపుచ్చుకుంది. 2000 తర్వాత చైనా ఇంత దారుణంగా విఫలం కావడం అదే మొదటిసారి. దీనితో యాంగ్‌బోపై విమర్శలు వెల్లువెత్తాయి.

04/13/2017 - 08:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారత్ బలమే తమ బలమనీ, ఒక రకంగా భారత్‌తో కలిసి తాము ముందుకు నడుస్తున్నామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పపోన్ స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంత బలంగా ఉంటే తాము అంతగా బలోపేతమవుతామని బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పడు.

04/13/2017 - 08:34

గయానా, ఏప్రిల్ 12: వెస్టిండీస్‌తో జరిగిన చివరి, మూడో వనే్డ ఇంటర్నేషనల్‌ను ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న పాకిస్తాన్ ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 234 పరుగుల లక్ష్యాన్ని పాక్ సులభంగా ఛేదించడంలో సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ కీలక పాత్ర పోషించాడు. అతను సెంచరీ చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది.

Pages