S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/20/2017 - 01:10

న్యూఢిల్లీ, మార్చి 19: భారత పురుషుల బాక్సింగ్‌కు విదేశీ కోచ్‌గా స్వీడన్‌కు చెందిన సాంటియాగో నివాను నియమించారు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) కోచ్‌ల కమిషన్‌కు ఉపాధ్యక్షుడిగా సేవలు అందిస్తున్న నివాకు ‘స్టార్ త్రీ’ కోచ్ హోదా కూడా ఉంది. అతని పేరును ఎఐబిఎ ప్రతిపాదించగా, తాము ఖరారు చేసినట్టు భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ) అధ్యక్షుడు అజయ్ సింగ్ తెలిపాడు.

03/19/2017 - 04:33

చెన్నై, మార్చి 18: మోటార్ రేసర్ అశ్విన్ సుందర్ ఒక కారు ప్రమాదంలో సజీవ దహనమైన సంఘటనపై భారత మోటర్ స్పోర్ట్స్ సంఘాల సమాఖ్య (ఎంఎఫ్‌ఎస్‌సిఐ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సుందర్‌ను ప్రతిభావంతుడైన రేసర్‌గా అభివర్ణించిన సమాఖ్య అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ సంఘటనలో సుందర్ భార్య నివేదిత కూడా సజీవ దహనం కావడం అత్యంత విచారకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నామని ప్రకటించింది.

03/19/2017 - 01:11

రాంచీ, మార్చి 18: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్లకు 360 పరుగులు చేసింది. ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా అజేయ శతకంతో రాణించి, జట్టును ఆదుకున్నాడు. రెండో రోజు ఆటలో లోకేష్ రాహుల్ (67) వికెట్‌ను కోల్పోయి 120 పరుగులు చేసిన భారత్ శనివారం ఉదయం ఆటను కొనసాగించి, 193 పరుగుల వద్ద మురళీ విజయ్ వికెట్‌ను కోవల్పోయింది.

03/19/2017 - 01:08

రాంచీ: భారత్, క్రికెట్ ఆటగాళ్ల మధ్య ఘర్షణ పూర్వక వాతావరణానికి తెరపడలేదు. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ఓపెనర్ పీటర్ హ్యాండ్స్‌కోమ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ చిత్రమైన హావభావాలను ప్రదర్శించి వెక్కిరిస్తే, మ్యాచ్ మూడో రోజు ఆటలో ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్‌వెల్ ప్రతీకారం తీరుకునే రీతిలో వ్యవహరించాడు.

03/19/2017 - 01:07

రాంచీ: విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో బెంగాల్‌ను ఢీకొన్న జార్ఖండ్ ఓటమిపాలుకావడం ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని నిరాశకు గురి చేసివుండవచ్చుగానీ, అతని స్వస్థలమైన రాంచీలో మాత్రం హర్షం వ్యక్తమవుతున్నది.

03/19/2017 - 01:06

న్యూఢిల్లీ, మార్చి 18: విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని జార్ఖండ్‌పై బెంగాల్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరింది. ధోనీ బృందం బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో, శుక్రవారం జరిగిన ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ శనివారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే.

03/19/2017 - 01:02

ఇండియన్ వెల్స్, మార్చి 18: ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవాపై సంచలన విజయాన్ని సాధించిన ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవా ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం ఆమె 14వ ర్యాంకర్ ఎలెవెనా వెస్నినాను ఢీ కొంటుంది. మొదటి సెమీ ఫైనల్‌లో కుజ్నెత్సొవాకు ప్లిస్కోవా నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది.

03/19/2017 - 00:33

వెల్లింగ్టన్, మార్చి 18: మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ విజృంభణ న్యూజిలాండ్‌ను దారుణంగా దెబ్బసింది. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలిన కివీస్ ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొమ్మిది వికెట్లకు 349 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ మూడో రోజైన శనివారం ఉదయం ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా 359 పరుగుల వద్ద ఆలౌటైంది.

03/19/2017 - 00:29

బసెల్ (స్విట్జర్లాండ్), మార్చి 18: స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ ఓటమి పాలయ్యాడు. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన అతన్ని చైనా ఆటగాడు షి యుక్వి 21-19, 21-11 తేడాతో ఓడించాడు. నిరుడు ఆసియా టీం చాంపియన్‌షిప్స్‌లో షి యుకీని ఓడించిన ప్రణయ్.. ఈసారి మాత్రం రాణించలేకపోయాడు.

03/19/2017 - 00:29

కొలంబో, మార్చి 18: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లకు 268 పరుగులు చేసింది. వికెట్ నష్టం లేకుండా 54 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఉదయం ఆటను కొనసాగించిన లంక 57 పరుగుల వద్ద ఉపుల్ తరంగ (26) వికెట్‌ను కల్పోయింది.

Pages