S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/03/2017 - 01:09

ఐగ్లే (స్విట్జర్లాండ్), మార్చి 2: ఇరాన్‌కు చెందిన మూడో శ్రేణి సైక్లింగ్ జట్టు పిష్గమన్ సైక్లింగ్‌పై వేటు పడింది. ఆ జట్టులోని ఇద్దరు సభ్యులు నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడినట్లు డోపింగ్ పరీక్షల్లో స్పష్టమవడంతో రేసుల నుంచి ఆ జట్టు మొత్తాన్ని 30 రోజుల పాటు సస్పెండ్ చేశారు.

03/02/2017 - 07:21

న్యూఢిల్లీ, మార్చి 1: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యాన న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నమెంట్ పురుషుల 50 మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లో భారత షూటర్ జీతూ రాయ్ మరోసారి అద్భుతంగా విజృంభించి పసిడి పతకంతో సత్తా చాటుకున్నాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకం.

03/02/2017 - 07:20

రోమ్, మార్చి 1: అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌లో ఐదు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి, రష్యా అందాల భామ మరియా షరపోవాకు ఈ ఏడాది మే నెలలో జరుగనున్న ఇటాలియన్ ఓపెన్ టోర్నమెంట్‌లో వైల్డ్‌కార్డు లభించింది. ఈ టోర్నీ నిర్వాహకులు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

03/02/2017 - 07:19

హామిల్టన్, మార్చి 1: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఐదు వనే్డల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా బుధవారం హామిల్టన్‌లోని సెడాన్ పార్కులో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అజేయంగా 180 పరుగుల రికార్డు స్థాయి వ్యక్తిగత స్కోరుతో రెచ్చిపోయాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి 2-2తో సిరీస్‌ను సమం చేసింది.

03/02/2017 - 07:18

కరాచీ, మార్చి 1: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలంలో భారీ ధర పలికిన తైమల్ మిల్స్ సహా విదేశాలకు చెందిన పలువురు టి-20 స్పెషలిస్టులు లాహోర్‌లో జరుగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్) ట్వంటీ-20 టోర్నమెంట్ ఫైనల్‌లో ఆడేందుకు నిరాకరించారు. భద్రతా పరమైన ఆందోళనలే ఇందుకు కారణం.

03/02/2017 - 07:18

మల్హెయిమ్ ఆండెర్ రర్ (జర్మనీ), మార్చి 1: జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత టాప్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తన పోరాటాన్ని అద్భుత రీతిలో ప్రారంభించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో అతను వరుస గేముల తేడాతో స్లొవేకియాకు చెందిన అలెన్ రోజ్‌ను మట్టికరిపించి శుభారంభాన్ని సాధించాడు.

03/01/2017 - 00:45

ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులు సాధించడంలో విఫలమైనప్పటికీ ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడన్న విషయం స్పష్టమవుతోంది. ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ మాటలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయ.

03/01/2017 - 00:39

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: లోధా కమిటీ సిఫారసులపై అంగీకార నివేదిక సమర్పించేందుకు నిర్ధేశించిన గడువును మార్చి 27వ తేదీ వరకు పొడిగించాలని వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) పాలక కమిటీ (సిఓఎ)కి విజ్ఞప్తి చేశాయి.

03/01/2017 - 00:38

లండన్, ఫిబ్రవరి 28: గాయం కారణంగా ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు దూరమైన ఒపెనర్ అలెక్స్ హాలెస్‌కు నెల రోజుల తర్వాత మళ్లీ ఆ జట్టులో చోటు లభించింది. మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్ పర్యటన ప్రారంభించనున్న ఇంగ్లాండ్ జట్టు నుంచి అతనికి పిలుపు వచ్చింది.

03/01/2017 - 00:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యాన న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో వర్థమాన షూటర్ జీతూ రాయ్ మంగళవారం 10 మీటర్ల ఎయిర్ పిస్తోలు ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఈ పోటీల్లో భారత్‌కు నాలుగో పతకం లభించినట్టయింది. ఎనిమిది మంది పాల్గొన్న ఈ ఈవెంట్ ఫైనల్‌లో జీతూ రాయ్ మొత్తం 216.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.

Pages