S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/01/2017 - 00:35

సిడ్నీ, ఫిబ్రవరి 28: ఆస్ట్రేలియాలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసే బాధ్యతను మాజీ టెస్టు స్టార్లు మాథ్యూ ఇలియట్, ర్యాన్ హారిస్‌జకు అప్పగించారు. స్వదేశంలో శ్రీలంకతో ఏప్రిల్‌లో జరుగనున్న అండర్-19 సిరీస్‌తో వీరు ఈ పని ప్రారంభించనున్నారు.

02/28/2017 - 01:03

పుణె, ఫిబ్రవరి 27: మన దేశంలోని కొన్ని పిచ్‌లు క్రికెటర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అలాంటి వాటిలో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసిఎ) మైదానం ఒకటి. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్ 333 పరుగుల భారీ తేడాతో ఓడింది ఈ పిచ్‌పైనే. స్పిన్‌కు అనుకూలంగా రూపొందించిన పిచ్‌పై భారత స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు.

02/28/2017 - 01:01

పుణె, ఫిబ్రవరి 27: స్పిన్‌తో ఆస్ట్రేలియాను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో, పిచ్‌ను అందుకు అనుకూలంగా రూపొందించడం ద్వారా టీమిండియా పన్నిన వ్యూహం బెడిసికొట్టిందా? స్పిన్ ట్రాక్‌ను ఆస్ట్రేలియా స్పిన్నర్లు గొప్పగా ఉపయోగించుకుంటారని భారత జట్టు మేనేజ్‌మెంట్ ఊహించలేదా? స్పిన్‌తో ఆసీస్‌ను పడగొట్టాలనుకొని, అదే స్పిన్ ధాటికి ఉక్కిరిబిక్కిరై ఓటమిని కొనితెచ్చుకుందా?

02/28/2017 - 01:01

పుణె, ఫిబ్రవరి 27: ఎవరికి ఎంతటి పేరుప్రఖ్యాతులు ఉన్నాయన్నది ముఖ్యం కాదని, సరైన సూచనలిస్తూ అనుకున్న ఫలితాలను సాధించేందుకు కృషి చేయడమే కీలకమని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు స్పిన్ సలహాదారుగా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ శ్రీ్ధరన్ శ్రీరాం స్పష్టం చేశాడు. టీమిండియాకు కేవలం 8 వనే్డల్లో ప్రాతినిథ్యం వహించిన శ్రీరాంను దాదాపు అందరూ మరచిపోయారు. అతని సేవలు అవసరమన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు.

02/28/2017 - 00:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: అసాధారణ ప్రతిభావంతులుగా పేరు సంపాదించినప్పటికీ, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన స్పిన్నర్లు రాజీందర్ గోయల్, పద్మాకర్ శివాల్కర్‌ను బిసిసిఐ ఎట్టకేలకు గుర్తించింది. వీరిద్దరికీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కింద సికె నాయుడు పురస్కారాన్ని అందించనున్నట్టు ప్రకటించింది. మార్చి ఎనిమిదిన బెంగళూరులో జరిగే కార్యక్రమంలో వీరికి అవార్డును ప్రదానం చేస్తారు.

02/28/2017 - 00:57

న్యూఢిల్లీలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత షూటర్లు హీనా సిద్ధు, జీతూ రాయ్

02/28/2017 - 00:56

మాడ్రిడ్, ఫిబ్రవరి 27: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగా పోటీల్లో భాగంగా అట్లెటికో మాడ్రిత్‌తో తలపడిన బార్సిలోనా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ కీలక గోల్‌తో బార్సిలోనాను గెలిపించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు పూర్తి రక్షణాత్మక వ్యూహాన్ని అమలు చేయడంతో ప్రథమార్ధంలో గోల్స్ నమోదు కాలేదు. ద్వితీయార్ధంలోనూ కొంత సేపు అదే పరిస్థితి కొనసాగింది.

02/28/2017 - 00:55

సోఫియా (బల్గేరియా), ఫిబ్రవరి 27: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ చాంపియన్‌షిప్ 56 కిలోల బాంటన్‌వెయిట్ విభాగంలో భారత బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్‌కు రజతం లభించింది. ఉక్రెయిన్‌కు చెందిన మైకొలా బట్సెన్కొతో కడ వరకూ హోరాహోరీగా పోరాడినప్పటికీ హుసాముద్దీన్ 2-3 తేడాతో ఓటమిపాలై, ద్వితీయ స్థానంతో సంతృప్తి చెందాడు.

02/27/2017 - 00:39

చండీగఢ్‌లో ఆదివారం జరిగిన హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ఫైనల్‌లో దబాంగ్ ముంబయని ఓడించి, మొట్టమొదటిసారి టైటిల్ సాధించిన కళింగ లాన్సర్స్ జట్టు. తుది పోరులో కెప్టెన్ మోర్టిచ్ ఫర్ట్‌సే రెండు గోల్స్ చేసి కళింగ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్ జట్టు 5-4 తేడాతో ఢిల్లీ వేవ్ రైడర్స్‌పై విజయం సాధించింది.

02/27/2017 - 00:38

పుణే, ఫిబ్రవరి 26: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఓడడానికి కారణాలను విశే్లషకులు ఏకరువు పెడుతున్నారు. ఆస్ట్రేలియా గెలిచిందా లేక భారత్ ఓడిందా అన్న ప్రశ్నకు సమాధానం వెతకడంలో చాలా మంది నిమగ్నమయ్యారు. ఒకేలా వినిపిస్తున్నా, రెంటికీ తేడా ఉంది. ఆస్ట్రేలియా గెలవడమంటే, ఆ జట్టు ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ నిజమైన ఆధిపత్యాన్ని కనబరచడం.

Pages