S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/27/2017 - 00:36

కోల్‌కతా, ఫిబ్రవరి 26: జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సెంచరీతో కదం తొక్కడంతో, విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ ‘డి’లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 78 పరుగుల తేడాతో చత్తీస్‌గఢ్‌ను చిత్తుచేయగలిగింది. ఓపెనర్ ఆనంద్ సింగ్ తప్ప టాప్ ఆర్డర్‌లో అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితంకాగా, జార్ఖండ్ ఒకానొక దశలో 57 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

02/27/2017 - 00:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: తన దృష్టిలో టోర్నీలన్నీ ఒకటేనని, ప్రత్యేకత అంటూ ఏమీ ఉండదని బాడ్మింటన్ స్టార్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు స్పష్టం చేసింది.

02/27/2017 - 00:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఆస్ట్రేలియాపై భారత జట్టు ఎదురుదాడి చేస్తుందని ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ ధీమా వ్యక్తం చేశాడు. శుక్రవారం ఢిల్లీ మారథాన్‌ను జెండా ఊపి ఆరంభించిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ పోటీకి దిగిన తర్వాత జయాపజయాలు సాధారణమని వ్యాఖ్యానించాడు. ఒక మ్యాచ్‌లో ఓడినంత మాత్రానే సిరీస్ చేజారిపోయిందని అనుకోకూడదని అన్నాడు.

02/27/2017 - 00:32

కైరో, ఫిబ్రవరి 26: ప్రాణాంతక వ్యాధి హెపటైటిల్ ‘సి’ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ పిలుపునిచ్చాడు. రక్త సంబంధమైన ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఈజిప్టులో చాలా ఎక్కువ.

02/27/2017 - 00:31

కరాచీ, ఫిబ్రవరి 26: ఇటీవల లాహోర్‌లో పర్యటించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) భద్రతాధికారుల బృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ తమ ఆటగాళ్లు పాకిస్తాన్ పర్యటనకు వెళితే, అక్కడి భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయా లేదా అన్నది ఈ బృందం పరిశీలించింది. అంతేగాక, అక్కడి సర్కారు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేపడుతుందనే విషయాన్ని కూడా అధ్యయనం చేసింది.

02/27/2017 - 00:30

బెర్లిన్, ఫిబ్రవరి 26: జర్మనీకి ఫుట్‌బాల్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను సాధించిపెట్టిన ఫిలిప్ లామ్ రిటైర్మెంట్ దాదాపు ఖాయమైంది. స్పోర్ట్స్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తానంటూ బయెర్స్ మ్యూనిచ్‌కి దరఖాస్తు చేసుకున్న లామ్ అభ్యర్థనపై అధికారులు సానుకూలంగా స్పందించలేదు. బయెర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న లామ్ ఈ పరిణామంతో కంగుతున్నాడు.

02/26/2017 - 01:12

ఓటమి లేకుండా 19 టెస్టులను పూర్తి చేసిన టీమిండియా దూకుడుకు ఆస్ట్రేలియా కళ్లెం వేసింది. మొదటి టెస్టును 333 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. కాగా, భారత జట్టుకు స్వదేశంలో ఇది రెండో అతిపెద్ద పరాజయం. 2004లో ఆస్ట్రేలియాతోనే నాగపూర్‌లో జరిగిన టెస్టులో భారత్ 342 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతర్వాత ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న సందర్భం ఇదే.

02/26/2017 - 01:10

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 94.5 ఓవర్లలో 256 ఆలౌట్ (మాట్ రెన్‌షా 68, డేవిడ్ వార్నర్ 38, మిచెల్ స్టార్క్ 61, అశ్విన్ 3/63, జయంత్ యాదవ్ 1/58, రవీంద్ర జడేజా 2/74, ఉమేష్ యాదవ్ 4/32.
భారత్ మొదటి ఇన్నింగ్స్: 40.1 ఓవర్లలో 105 ఆలౌట్ (లోకేష్ రాహుల్ 64, ఆజింక్య రహానే 13, స్టీవ్ ఒకీఫ్ 6/35, మిచెల్ స్టార్క్ 2/38).

02/26/2017 - 01:09

పుణే, ఫిబ్రవరి 25: తాము ఇంత దారుణంగా విఫలం కావడం సుమారు రెండేళ్ల కాలంలో ఇదే మొదటిసారని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆ స్ట్రేలియాతో మొదటి టెస్టు ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిందని ప్రశంసిం చాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 13 పరుగులు చేశాడు.

02/26/2017 - 01:08

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 25: వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 9,000 పరుగుల మైలురాయిని అధిగమించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎబి డివిలియర్స్‌కు చోటు లభించింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మూడో వనే్డలో 85 పరుగులు చేసిన అతను, దక్షిణాఫ్రికా 159 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించడంలో కీలక పాత్ర పోషించాడు.

Pages