S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/26/2017 - 01:06

చెన్నై, ఫిబ్రవరి 25: విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ ‘సి’లో శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను ముంబయి 98 పరుగుల తేడాతో ఓడించింది. కెప్టెన్ ఆదిత్య తారే (83), సిద్దేష్ లాడ్ (64) అర్ధ శతకాలతో రాణించడంతో, ముంబయి 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 273 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రంజీ ట్రోఫీ చాంపియన్ గుజరాత్ 41.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది.

02/26/2017 - 01:06

కరాచీ, ఫిబ్రవరి 25: పాకిస్తాన్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా కొనసాగాలా లేదన్న విషయంలో మిస్బా ఉల్ హక్ ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడంతో, అతని స్థానంలో పగ్గాలను స్వీకరించాలని సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ ఆరాటపడుతున్నాడు. అతను రేసులో ఉన్నాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడపు షహర్యార్ ఖాన్ ప్రకటించడం విశేషం.

02/25/2017 - 00:36

పుణే, ఫిబ్రవరి 24: ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ దెబ్బకు టీమిండియా కుప్పకూలింది. తిరుగులేని బ్యాటింగ్ బలంతో గత 19 టెస్టుల్లో ఒక్క ఓటమిని కూడా చవిచూడకుండా దూసుకెళుతున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌటైంది. స్టీవ్ ఒకీఫ్ ఆరు వికెట్లు పడగొట్టి, భారత్‌ను దారుణంగా దెబ్బతీశాడు.

02/25/2017 - 00:33

పుణే: ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 37 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డును తిరగరాశాడు. ఒక దేశవాళీ సీజన్‌లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. రెండో రోజు ఆట మొదటి ఓవర్‌లోనే మిచెల్ స్టార్క్‌ను అవుట్ చేసిన అతను, హోమ్ సీజన్‌లో 63 వికెట్లతో కపిల్ సృష్టించిన రికార్డును అధిగమించాడు.

02/25/2017 - 00:31

న్యూఢిల్లీలో శుక్రవారం ఆరంభమైన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్ చాంపియన్‌షిప్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించిన పూజా ఘట్కర్

02/24/2017 - 02:27

ఉమేష్ యాదవ్ మొదటి రోజు ఆటలో 32 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అతను నాలుగు వికెట్లు సాధించడం ఇది రెండోసారి. వెస్టిండీస్‌తో 2011 నవంబర్‌లో కోల్‌కతాలో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను 80 పరుగులకు 4 వికెట్లు సాధించాడు. ఆ మ్యాచ్‌ని భారత్ ఇన్నింగ్స్ 15 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఆతర్వాత ఉమేష్ ఒక ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చడం ఇదే మొదటిసారి.

02/24/2017 - 01:18

పుణే: ఆస్ట్రేలియా యువ ఓపెనర్ మాట్ రెన్‌షా అంతర్జాతీయ క్రికెట్‌లో తన కంటే ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లకు కూడా పాఠాలు నేర్పే విధంగా పోరాట పటిమను ప్రదర్శించాడు. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అతను 36 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రిటైరయ్యాడు. ఉదర సంబంధమైన సమస్యతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయిన 20 ఏళ్ల రెన్‌షా ఆతర్వాత జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు.

02/24/2017 - 01:17

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: మాట్ రెన్‌షా సి మురళీ విజయ్ బి అశ్విన్ 68, డేవిడ్ వార్నర్ బి ఉమేష్ యాదవ్ 38, స్టీవెన్ స్మిత్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 27, షాన్ మార్ష్ సి కోహ్లీ బి జయంత్ యాదవ్ 16, పీటర్ హ్యాండ్స్‌కోమ్ ఎల్‌బి రవీంద్ర జడేజా 22, మిచెల్ మార్ష్ ఎల్‌బి రవీంద్ర జడేజా 4, మాథ్యూ వేడ్ ఎల్‌బి ఉమేష్ యాదవ్ 8, మిచెల్ స్టార్క్ 57 నాటౌట్, స్టీవ్ ఓకీఫ్ సి వృద్ధిమాన్ సాహా బి ఉమేష్ యాదవ్ 0, నాథన్

02/24/2017 - 01:16

పుణే: ఆస్ట్రేలియా ఓపెనర్ మాట్ రెన్‌షా అనారో గ్యంతో రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగే సమయంలో చా లా సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. తన సమ స్యను అంపైర్ దృష్టికి తీసుకెళ్లిన రెన్‌షా తాను మై దానాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితిని వివరించాడు. అ యతే, ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ నుంచి అతనికి వెంటనే సమాధానం లభించలేదు.

02/24/2017 - 01:13

చండీగఢ్, ఫిబ్రవరి 23: బెల్జియం కెప్టెన్, ఒలింపిక్ రజత పతక విజేత జాన్-జాన్ డొమెన్, నెదర్లాండ్స్ క్రీడాకారిణి నవోమీ వాన్ ఆస్‌లకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అవార్డులు లభించాయి. 2016 ఏడాదికిగాను, పురుషుల విభాగంలో డోమెన్, మహిళల విభాగంలో నవోమీలకు ఈ అవార్డులు దక్కాయి.

Pages