S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/17/2017 - 01:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారం ఎత్తిన తర్వాత వరుస విజయాలు సాధించడమేగాక, ఇటీవలే డబ్ల్యుబిఓ ఆసియా పసిఫిక్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత బాక్సర్ విజేందర్ సింగ్ తన తర్వాతి ఫైట్‌లో జుల్పికర్ మైమైతియాలీతో తలపడతాడు. ఏప్రిల్ 1న జరిగే ఈ ఫైట్‌లో విజయం తనదేనని విజేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

02/17/2017 - 01:35

ముంబయి, ఫిబ్రవరి 15: భారత్‌లో టీమిండియాను ఎదుర్కోవడం సులభసాధ్యం కాదని ఒకవైపు అంగీకరిస్తూనే మరోవైపు ప్రపంచ మేటి జట్టుగా వెలిగి, ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్న ఆస్ట్రేలియా తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమైంది. భారత్ ‘ఎ’తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మూడు రోజుల వామప్ మ్యాచ్‌ని తుది జట్టు కూర్పుపై నిర్ణయాలు తీసుకోవడానికి సరైన వేదికగా భావిస్తున్నది.

02/17/2017 - 01:33

కొలంబో, ఫిబ్రవరి 16: మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో ఆధిపత్యాన్ని కనబరుస్తూ, ఇప్పటి వరకూ ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకెళుతున్న భారత్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సూపర్ సిక్స్‌లో మొదటి మ్యాచ్‌ని దక్షిణాఫ్రికాపై 49 పరుగుల తేడాతో సొంతం చేసుకున్న భారత్, అదే ఉత్సాహంతో బంగ్లాదేశ్‌పై పంజా విసరడానికి సిద్ధంగా ఉంది.

02/17/2017 - 01:32

న్యూఢిల్లీలో జరుగుతున్న ఐటిటిఎఫ్ ఇండియన్ ఓపెన్ టీటీ చాంపియన్‌షిప్‌లో తన కంటే మెరుగైన స్థానంలో ఉన్న ట్రిస్టా ఫ్లోర్ (ఫ్రాన్స్)ను 11-4, 11-6, 11-9, 11-9, 7-11, 11-6 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు దూసుకేళ్లిన భారత ఆటగాడు హర్మీత్ దేశాయ్ ఆనందం. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ క్రీడాకారిణి మానికా బాత్రా 7-11, 11-8, 7-11, 4-11, 8-11 తేడాతో వౌసమీ పాల్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.

02/17/2017 - 01:31

దుబాయ్, ఫిబ్రవరి 16: అంపైర్ల నిర్ణయాలను సవాలు చేసే డిఆర్‌ఎస్‌ను అమలు చేయడం వల్ల వారు తీసుకుంటున్న నిర్ణయాలు మెరుగుపడ్డాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించింది. వివిధ మ్యాచ్‌లను పర్యవేక్షిస్తున్న ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్ ద్వారా వెల్లడవుతున్న నిర్ణయాల్లో సరైన ఫలితాల శాతం 94 నుంచి 98.5 శాతానికి పెరిగిందని వివరించింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు అవకాశం దక్కేలా చూస్తామని తెలిపింది.

02/17/2017 - 01:30

ముంబయి, ఫిబ్రవరి 15: ముస్తాక్ అలీ అంతర్ మండల టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌ల్లో వెస్ట్‌జోన్‌పై సౌత్‌జోన్, నార్త్‌జోన్‌పై ఈస్ట్‌జోన్ విజయాలు నమోదు చేశాయి. ఓపెనర్ మాయాంక్ అగర్వాల్ అర్ధ శతకంతో రాణించడంతో, వెస్ట్‌ను సౌత్ జోన్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.

02/17/2017 - 01:28

నాగపూర్, ఫిబ్రవరి 16: భారత్ అండర్-19, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య జరిగిన మొదటి యూత్ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగు రోజుల ఈ మ్యాచ్ మూడో రోజు ఇంగ్లాండ్ అండర్-19 ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది.

02/16/2017 - 01:20

అమెరికాలో ప్రత్యేక శిక్షణ పొందేందుకు, తన కుమారుడు సోరా, కుమార్తె సోకోతో కలిసి మియామీ చేరుకున్న ఇథియోపియా లాంగ్ జంపర్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత ఫెసా లిలెసా. స్కిల్స్ వీసాపై వచ్చిన అతను వచ్చే ఏడాది జనవరి వరకూ మియామీలోనే శిక్షణ పొందుతాడు

02/16/2017 - 01:18

మొనాకో, ఫిబ్రవరి 15: ‘స్ప్రింట్ వీరుడు’ ఉసేన్ బోల్ట్, ‘జిమ్నాస్టిక్స్ క్వీన్’ సిమోన్ బైల్స్ ప్రతిష్ఠాత్మక లారెస్ ప్రపంచ అవార్డులు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో ఈ అవార్డుకు ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, అమెరికా ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్ తదితరుల నుంచి బోల్ట్‌కు గట్టిపోటీ ఎదురైంది.

02/16/2017 - 01:15

నాగపూర్, ఫిబ్రవరి 15: అండర్-19 యూత్ క్రికెట్ టెస్టులో ఇంగ్లాండ్‌తో తలపడుతున్న భారత్‌ను డారిల్ ఫెరారియో అద్భుత శతకంతో ఆదుకున్నాడు. అతని కృషి ఫలితంగా ప్రత్యర్థికి భారత్ బలమైన సమాధానం ఇవ్వగలిగింది. టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 501 పరుగుల భారీ స్కోరువద్ద ఇంగ్లాండ్ డిక్లేర్ చేసింది.

Pages