S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/14/2017 - 01:21

ముంబయి, ఫిబ్రవరి 13: ముస్తాక్ అలీ ట్రోఫీ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం నార్త్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించిన పార్థీవ్ పటేల్ వెస్ట్‌జోన్‌ను గెలిపించాడు. నార్త్ స్టార్ బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్ హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నార్త్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగలు చేసింది.

02/14/2017 - 01:19

లండన్, ఫిబ్రవరి 13: ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు జో రూట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సుమారు నాలుగేళ్లు సారథ్యం వహించిన అలస్టర్ కుక్ ఆ బాధ్యతల నుంచి వైదొలగడంతో, రూట్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ప్రకటించింది. 25 ఏళ్ల రూట్ 2015 నుంచి ఇంగ్లాండ్ టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కుక్ వారసుడిగా అతను ఇది వరకే ముద్రపడ్డాడు.

02/14/2017 - 01:18

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్‌ను ఎంచుకోవడం విజేందర్ సింగ్‌తో మొదలై, నిరాటంకంగా కొనసాగుతున్నది. భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ) మద్దతుతో తాను కూడా ప్రొఫెషనల్‌గా మారాలని ఆలోచిస్తున్నట్టు ఆసియా క్రీడల మాజీ స్వర్ణ పతక విజేత, రెండు పర్యాయాలు ఒలింపిక్స్‌లో పోటీపడిన వికాస్ కిషన్ ప్రకటించాడు.

02/13/2017 - 01:09

బెంగళూరులో ఆదివారం జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసి,
అంధుల టి-20 ప్రపంచ కప్‌ను సాధించిన భారత జట్టు

02/13/2017 - 00:49

అంధుల క్రికెట్‌లో భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. 2012లో జరిగిన మొదటి టి-20 వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ సాధించిన భారత్ మరోసారి విజేతగా నిలిచింది. బెంగళూరులో ఆదివారం జరిగిన ఫైనల్‌లో పాక్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. బ్యాటింగ్ బలంతోనే అన్ని మ్యాచ్‌లను తన ఖాతాలో వేసుకుంటూ వచ్చిన భారత్ ఫైనల్‌లోనూ తన ఆధిపత్యాన్ని నిరూపించింది.

02/13/2017 - 00:47

ముంబయి, ఫిబ్రవరి 12: గౌతం గంభీర్ విజృంభణకు శిఖర్ ధావన్ మద్దతు తోడు కావడంతో, ముస్తాక్ అలీ టి-20 అంతర్ మండల క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం సౌత్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌ని నార్త్‌జోన్ ఎనిమిది వికెట్ల తేడాతో గెల్చుకుంది. టాస్ గెలిచిన నార్త్‌జోన్ ఛేజింగ్‌కే మొగ్గు చూపింది. దీనితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 173 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది.

02/13/2017 - 00:45

దుబాయ్, ఫిబ్రవరి 12: ఎస్‌జి బంతులతో స్వింగ్ సులభమేనని, భారత్ పర్యటనలో తనకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది తలత్తెదని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌల్ మిచెల్ స్టార్క్ ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయన్న వార్తలను అతను ప్రస్తావిస్తూ, బంతిని స్వింగ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చని ఇక్కడి ఐసిసి గ్లోబల్ అకాడెమీలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొన్న స్టార్క్ అన్నాడు.

02/13/2017 - 00:45

తెహ్రాన్, ఫిబ్రవరి 12: మహిళల చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో సీడ్‌గా అడుగుపెట్టిన భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మొదటి గేమ్‌ను డ్రా చేసుకుంది. ర్యాంకింగ్‌లో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న బంగ్లాదేశ్‌కు చెందిన షమీమా లిజాతో తలపడిన ఆమె పెద్దగా పోరాడకుండానే రాజీకి అంగీకరించింది.

02/13/2017 - 01:52

హైదరాబాద్, ఫిబ్రవరి 12: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో విజయానికి టీమిండియా ఏడు వికెట్ల దూరంలో నిలిచింది. మరోవైపు చివరి రోజు ఆలౌట్ కాకుండా నిలబడి, మ్యాచ్‌ని డ్రా చేసుకోవడమే లక్ష్యంగా బంగ్లాదేశ్ పోరాటాన్ని కొనసాగించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ చివరి రోజైన సోమవారం ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి.

02/13/2017 - 00:42

హైదరాబాద్, ఫిబ్రవరి 12: టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 250 వికెట్ల మైలురాయిని చేరిన బౌలర్‌గా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. కెరీర్‌లో 45వ టెస్టు ఆడుతున్న అతను బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్ ఆదివారం నాటి ఆటలో ముష్ఫికర్ రహీంను అవుట్ చేశాడు. ఇది అతనికి 250 వికెట్.

Pages