S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/06/2017 - 01:32

దుబాయ్, ఫిబ్రవరి 5: అఫ్గానిస్థాన్‌కు ఫస్ట్‌క్లాస్ హోదా లభించింది. టెస్టు హోదా కోసం అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి) చాలాకాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశంలో ఎసిబి డిమాండ్‌పై చర్చ జరిగింది. టెస్టు హోదాను ఇవ్వడానికి సభ్య దేశాలు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే, ఫస్ట్‌క్లాస్ హోదాను కల్పించాలని తీర్మానించాయి.

02/06/2017 - 01:30

చిత్రం...రాజ్‌కోట్ మారథాన్‌లో పాల్గొన్న భారత క్రికెటర్ చటేశ్వర్ పుజారా

02/06/2017 - 01:28

పుణే, ఫిబ్రవరి 5: డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా ఓషియానియా గ్రూప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించింది. రామనాథన్ రాంకుమార్ ఆదివారం జరిగిన కీలకమైన రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఫిన్ టియర్నీని 7-5, 6-1, 6-0 తేడాతో చిత్తుచేసి భారత్‌కు తిరుగులేని రీతిలో 3-1 ఆధిక్యాన్ని అందించాడు. అంతకు ముందు సింగిల్స్‌లో అతను జొస్ స్ట్థామ్‌ను 6-3, 6-4, 6-3 ఆధిక్యంతో ఓడించిన విషయం తెలిసిందే.

02/06/2017 - 01:26

నర్సరావుపేట, ఫిబ్రవరి 5: ఖేలో ఇండియా జాతీయ స్థాయి క్రీడాపోటీలు ఆదివారం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

02/06/2017 - 01:25

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 5: అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో భారత జట్టు విజయకేతనం ఎగురవేసింది. పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీలకు ఆతిథ్యమిస్తున్న భారత జట్టు అత్యధికంగా 220 పాయింట్లు సాధించి ప్రథమస్థానంలో నిలువగా, 76 పాయింట్లతో శ్రీలంక జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది.

02/06/2017 - 01:23

హైదరాబాద్, ఫిబ్రవరి 5: భారత్ ‘ఎ’ ఎడమచేతి వాటం మీడియం పేసర్ అనికేత్ చౌదరి అద్భుతంగా రాణించి, 26 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టడంతో, పరుగుల కోసం నానా ఇబ్బందులు పడిన బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్లకు 224 పరుగుల స్కోరువద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

02/06/2017 - 01:22

జొహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 5: కాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత చాలా రోజులకు మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎబి డివిలియర్స్ విజృంభణ శ్రీలంకపై ఆ జట్టుకు మూడో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని, 3-0 ఆధిక్యంతో సిరీస్‌ను అందించింది.

02/06/2017 - 01:20

హాంకాంగ్, ఫిబ్రవరి 5: ఆసియా జూనియర్ స్క్వాష్ బాలుర డబుల్స్ విభాగంలో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. టీం ఈవెంట్ ఫైనల్‌లో భారత్ 2-0 తేడాతో మలేసియాను చిత్తుచేసింది. 2011లో కొలంబో జరిగిన ఆసియా జూనియర్ స్క్వాష్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన భారత్ బాలుర డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని అందుకోగా, సుమారు ఆరేళ్ల తర్వాత మరోసారి విజేతగా నిలిచింది.

02/06/2017 - 01:19

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని అతను చిన్నతనంలో ఆడిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడెమీ ఆదివారం ఘనంగా సత్కరించింది. అతనికి క్రికెట్‌లో ఓనమాలు దిద్దించిన రాజ్‌కుమార్ శర్మ, భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోహ్లీ సోదరుడు వికాస్, తల్లి సరోజ్ కూడా సన్మాన సభ్యకు హాజరయ్యారు.

02/06/2017 - 01:19

హామిల్టన్, ఫిబ్రవరి 5: బ్యాటింగ్‌లో రాస్ టేలర్, బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ విజృంభించడంతో, ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వనే్డను 24 పరుగుల తేడాతో గెల్చుకున్న న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. టేలర్ సెంచరీతో కదం తొక్కితే, బౌల్ట్ 33 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి, కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Pages