S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/10/2016 - 04:05

న్యూఢిల్లీ, జూలై 9: క్రికెట్ అంటేనే కాదు.. బైకులన్నా, సైనిక దుస్తులన్నా ధోనీకి చాలా ఇష్టం. అయితే, ధోనీ ఫ్లూటు వాయిస్తాడని చాలా మందికి తెలియదు. ఈ విషయం అతని సన్నిహితుడు, టీమిండియా సభ్యుడు సురేష్ రైనా ద్వారా ప్రపంచానికి తెలిసింది. ధోనీ ఫ్లూటు వాయిస్తున్న ఫొటోను రైనా ట్వీట్ చేశాడు. ఇటీవలే 35వ జన్మదినోత్సవాన్ని జరుపుకొన్న ధోనీని ఫ్లూటిస్టుగా పరిచయం చేశాడు.

07/10/2016 - 04:03

న్యూఢిల్లీ, జూలై 9: భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రితూ రాణిపై వేటు పడింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్టులో సెలక్టర్లు ఆమెకు స్థానం కల్పించలేదు. భారత మహిళలు 36 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత రితూ నాయకత్వంలోనే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. జట్టుకు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకాన్నిచ్చిన రితూను జట్టు నుంచి తొలగిస్తారని ఎవరూ ఊహించలేదు.

07/10/2016 - 04:01

లండన్, జూలై 9: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో మిలోస్ రవోనిక్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన సీనియర్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ వచ్చే ఏడాది ఈటోర్నీకి మళ్లీ వస్తానని, టైటిల్‌ను సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వచ్చే ఏడాది కూడా సెంటర్ కోర్టులో మ్యాచ్ ఆడాలన్నదే తన లక్ష్యమని అన్నాడు.

07/09/2016 - 08:25

భారత్ పోరాటానికి తెర

07/09/2016 - 08:23

సెయింట్ కిట్స్, జూలై 8: వెస్టిండీస్‌లో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లిన భారత క్రికెటర్లు అక్కడ బీచ్ వాలీబాల్‌లో తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. ఆటవిడుపుగా వారంతా బీచ్ వాలీబాల్ ఆడారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో ఉత్సాహంగా కనిపించగా, మిగతా వారు కూడా అతనితో జత కలిశారు. కరేబియాలోని అత్యంత సుందరమైన దీవుల్లో సెయింట్ కీట్స్ ఒకటి. దీనిని ‘సుగర్ సిటీ’గా పిలుస్తారు.

07/09/2016 - 08:22

సెయింట్ కిట్స్, జూలై 8: భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే తన క్రికెట్ సరంజామా (కిట్) లేకుండానే సెయింట్ కిట్స్‌కు చేరాడు. టీమిండియా సభ్యులతో కలిసి అతను ఇక్కడి విమానాశ్రయంలో దిగి, హోటల్ గదికి బయలుదేరినప్పుడు చూసుకుంటే కిట్ లేదన్న విషయం తెలిసింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ దానిని గాట్విక్‌లోనే వదిలివేసిందని సమాచారం అందింది.

07/09/2016 - 08:22

లండన్, జూలై 8: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్‌పై బిబిసి చేసిన అనుచిత వ్యాఖ్య వివాదం రేపుతున్నది. ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లినప్పుడే, అప్పటి కెప్టెన్ సల్మాన్ బట్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్‌తో కలిసి అమీర్ కూడా ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. తన నేరాన్ని అంగీకరించిన అమీర్ ఇంగ్లాండ్‌లోనే జైలు శిక్షను అనుభవించాడు.

07/09/2016 - 08:22

బసెటెర్ (సెయింట్ కీట్స్), జూలై 8: టీమిండియాకు కోచ్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుంబ్లే శనివారం నుంచి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో ఆరంభం కానున్న రెండు రోజుల వామప్ మ్యాచ్‌తో అధికారికంగా తన తొలి టూర్‌ను ఆరంభించనున్నాడు. బౌలింగ్ విభాగంపై దృష్టి కేంద్రీకరిస్తానని ఇది వరకే చెప్పిన అతను ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్‌పై శ్రద్ధ పెట్టాడు.

07/09/2016 - 08:21

మార్సెల్లే, జూలై 8: ఆంటోనీ గ్రీజ్మన్ రెండు గోల్స్‌తో రాణించి, పోర్చుగల్‌తో జరిగిన యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో ఫ్రాన్స్‌ను ఫైనల్ చేర్చాడు. అంతేగాక, ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఎక్కువ గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అతని ఖాతాలో ఆరు గోల్స్ ఉన్నాయి.

,
07/08/2016 - 02:12

లండన్, జూలై 7: అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అక్కాచెల్లెళ్ల పోరు వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఉండడం లేదు. ‘నల్ల కలువలు’ సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ సెమీస్ చేరడంతో, వీరిద్దరూ సులభంగానే ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ చేరతారని అంతా ఊహించారు. అక్కాచెలెళ్ల మధ్య పోరు అలరిస్తుందని ఆశించారు.

Pages