S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/01/2017 - 00:08

హైదరాబాద్, జనవరి 31: జస్టిస్ ఆర్ ఎం లోథా కమిటీ సిఫార్సులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేయన్ (హెచ్‌సిఎల్) అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసును బుధవారం కోర్టు విచారణ జాబితాలో పెట్టారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్‌లతో కూడిన బెంచ్ విచారిస్తుంది.

02/01/2017 - 00:07

ముంబయి, జనవరి 31: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) పర్యవేక్షణకోసం సుప్రీంకోర్టు సోమవారం నలుగురు ప్రముఖులతో కూడిన పాలక వర్గాన్ని నియమించిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం ఈ కమిటీలోని ముగ్గురు సభ్యులు దక్షిణ ముంబయిలోని బిసిసిఐ ప్రదాన కార్యాలయానికి దూరంగా తొలిసారిగా సమావేశమైనారు.

02/01/2017 - 00:06

బెంగళూరు, జనవరి 31: నాగపూర్‌లో జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో అంపైరింగ్‌పై ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని టీమిండియా యువ పేస్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తేలిగ్గా కొట్టివేసాడు. క్రికెట్‌లో అంపైర్ల నిర్ణయాలు ఎప్పుడూ ఒకే పక్షానికి అనుకూలంగా ఉండవని అతను అంటూ, ఇరుపక్షాలు కూడా దాన్ని మరిచిపోయి ముందుకు సాగాలని అభిప్రాయ పడ్డాడు.

02/01/2017 - 00:05

సిడ్నీ, జనవరి 31: తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్‌కు దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలో స్థానం లభించింది. బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో తలపడేందుకు 16 మంది సభ్యులతో ఎంపిక చేసిన భారత జట్టులో బ్యాకప్ ఓపెనర్‌గా అతనికి చోటు కల్పించారు. మంగళవారం న్యూఢిల్లీలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ తీవ్రమైన హైడ్రామా నడుమ ఈ జట్టును ఎంపిక చేసింది.

02/01/2017 - 00:03

ముంబయి, జనవరి 31: టీమిండియా మాజీ పేస్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2017 ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో తమ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రకటించింది. గత ఏడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన బాలాజీ ఆ తర్వాత తమిళనాడు జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు.

02/01/2017 - 00:02

వెల్లింగ్టన్, జనవరి 31: ఆస్ట్రేలియాతో రెండో వనే్డ క్రికెట్ మ్యాచ్‌లో తలపడబోతున్న న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ దూరమయ్యాడు. చీలమండ గాయంతో అతను ఇబ్బందులు పడుతుండటమే ఇందుకు కారణమని న్యూజిలాండ్ జట్టు అధికారులు తెలిపారు.

02/01/2017 - 00:02

సిడ్నీ, జనవరి 31: శ్రీలంకతో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో తలపడే ఆస్ట్రేలియా జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ సారథ్యం వహించనున్నాడు. సోమవారం న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ వనే్డ క్రికెట్ మ్యాచ్‌లో తలపడిన ఆస్ట్రేలియా జట్టుకు ఫించ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం విదితమే.

01/31/2017 - 01:10

బిసిసిఐ పాలక మండలి సభ్యుడిగా సుప్రీం కోర్టు అప్పగించిన బాధ్యతను ఆనందంగా స్వీకరిస్తాను. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే, ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడలేను. బోర్డు పాలనా వ్యవహారాలు, ఇతర అంశాలను గురించి స్పష్టమైన అవగాహన లేకుండా మాట్లాడడం సబబు కాదు. కాబట్టి నాకు అప్పగించిన బాధ్యతపై నేను ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను.

01/31/2017 - 01:09

న్యూఢిల్లీ, జనవరి 30: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి కొత్త పాలక మండలి ఏర్పడింది. మాజీ కంప్‌ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అధ్యక్షత వహించే నలుగురు సభ్యుల కమిటీ ఇకపై బిసిసిఐ పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని సుప్రీం కోర్టు సోమవారం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది.

01/31/2017 - 01:08

క్రికెటర్ల సంఘంపై ప్రధానంగా దృష్టి సారిస్తాం. అదే విధంగా దేశంలో మహిళా క్రికెట్ పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటాను. బిసిసిఐలో చోటు చేసుకునే మార్పుల్లో నా పాత్ర కూడా ఉంటుందని ఇది వరకే ఊహించాను. కొత్త సవాల్‌ను స్వీకరించి, దానిని విజయవంతం చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. గోపాల సుబ్రహ్మణ్యం నాకు ఫోన్ చేసి, బోర్డు పునర్ నిర్మాణంలో భాగస్వామిగా ఉండేందుకు ఇష్టమేనా అని అడిగారు.

Pages