S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/30/2017 - 00:49

కోల్‌కతా, జనవరి 29: ఫిట్నెస్ ఉంటేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయని భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ఆదివారం జరిగిన కోల్‌కతా మారథాన్ రన్‌కు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన సచిన్ మాట్లాడుతూ, వణిస్తున్న చలిలో, తెల్లవారు జాము నుంచే భారీ సంఖ్యలో ప్రజలు మారథాన్ కోసం రావడం ఎంతో ఆనందాన్నిస్తున్నదని అన్నాడు. ఉత్తమ జీవన విధానాన్ని అలవరచుకోవడానికి ఇలాంటి ఈవెంట్లు ఉపయోగపడతాయని చెప్పాడు.

01/29/2017 - 01:27

మెల్బోర్న్, జనవరి 28: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్ సెరెనా విలియమ్స్ కైవసం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఆమె ఈ విజయంతో మళ్లీ నంబర్ వన్‌గా ఎదిగింది. సోమవారం అధికారికంగా ప్రకటించే ర్యాంకింగ్స్‌లో ఆమె తన స్థానాన్ని తిరిగి సంపాదిస్తుంది.

01/29/2017 - 01:14

లక్నో, జనవరి 28: సయ్యద్ మోదీ స్మారక బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పివి సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో ఆమె 21-11, 21-19 తేడాతో ఫిట్రియానీని ఓడించి, జార్జియా మరిస్కాతో టైటిల్ పోరును ఖాయం చేసుకుంది. మరో సెమీ ఫైనల్‌లో మరిస్కా 21-19, 21-14 స్కోరుతో హన్నా రమాదినీపై విజయం సాధించి ఫైనల్ చేరింది.

01/29/2017 - 01:14

మెల్బోర్న్, జనవరి 28: పాతకాపులు మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చిరకాల శత్రువులు మరోసారి ఆధిపత్య పోరాటానికి సిద్ధమయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే ఓటమిపాలై నిష్క్రమించడంతో, ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్ వన్‌లు రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ టైటిల్ రేసులో ముందుకొచ్చారు.

01/29/2017 - 01:13

నాగపూర్, జనవరి 28: ఇంగ్లాండ్‌తో అత్యంత కీలకమైన రెండో టి-20 ఆదివారం జరగనుండగా, తుది జట్టు కూర్పు ఎలా ఉండాలనే అంశంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మల్లగుల్లాలు పడుతున్నాడు. ఫార్మాట్ ఎదైనా, ఇప్పటి వరకూ ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోని కెప్టెన్‌గా గుర్తింపు పొందిన కోహ్లీ ఇప్పుడు ఆ రికార్డును కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు.

01/28/2017 - 04:02

మెల్బోర్న్, జనవరి 27: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో మొదటి నుంచి దూకుడుగా అడుతున్న అతను అదే ఒరవడిని కొనసాగించి, సుమారు ఐదు గంటలు శ్రమించి, సెమీ ఫైనల్‌లో గ్రిగర్ దిమిత్రోవ్‌ను 6-3, 5-7, 7-6, 6-7, 6-4 తేడాతో ఓడించి ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు.

01/28/2017 - 04:00

మెల్బోర్న్, జనవరి 27: సోదరి వీనస్ విలియమ్స్‌పై ఫేవరిట్‌గా శనివారం జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో సెరెనా విలియమ్స్ బరిలోకి దిగనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె రెండో స్థానంలో ఉండగా, వీనస్‌ది 17వ స్థానం. అంతేగాక, ఇప్పటి వరకూ ఇద్దరూ పరస్పరం 27 పర్యాయాలు ఢీ కొంటే, సెరెనా 16 విజయాలు సాధించింది. వీనస్ 11 మ్యాచ్‌ల్లో గెలిచింది.

01/28/2017 - 03:57

చిత్రం..మహిళల డబుల్స్ ఫైనల్‌లో ఆండ్రియా హ్లవకొవా, పెంగ్ షుయ్ జోడీని 6-7, 6-3, 6-3 తేడాతో ఓడించి టైటిల్ సాధించిన బెథానీ మాటెక్ సాండ్స్, లూసీ సఫరోవా జోడీ

01/28/2017 - 03:56

మెల్బోర్న్, జనవరి 27: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్‌లో ఏడో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌కు కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడింగ్‌తో కలిసి ఆడుతున్న సానియా ఫైనల్‌కు దూసుకెళ్లింది.

01/28/2017 - 03:53

కాన్పూర్, జనవరి 27: భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తండ్రి తౌసిఫ్ అలీ గుండె పోటుతో మృతి చెందాడు. దీనితో మోకాలి గాయానికి ఇక్కడ చికిత్స పొందుతున్న షమీ హుటాహుటిన తన స్వస్థలం ఆమ్రోహాకు వెళ్లిపోయాడు. ఇంగ్లాండ్‌తో మొదటి టి-20 మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు షమీ కాలికి గాయమైంది. ఈనెల 5వ తేదీన మొదటిసారి గుండె పోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన తౌసిఫ్ అక్కడ చికిత్స పొందుతున్నాడు.

Pages