S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/17/2016 - 06:02

ముంబయి, ఏప్రిల్ 16: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న గుజరాత్ లయన్స్ మరోసారి సత్తా చాటుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించిన ఆ జట్టు శనివారం జరిగిన ఉత్కంఠ భరిత పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను వారి సొంత గ్రౌండ్‌లోనే మట్టికరిపించి హ్యాట్రిక్ సాధించింది.

04/17/2016 - 05:54

రాజ్‌కోట్, ఏప్రిల్ 16: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో గుజరాత్ లయన్స్ జట్టుకు సేవలు అందిస్తున్న టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆదివారం రాజ్‌కోట్‌లో తన ప్రియురాలు రివా సోలంకీకి మూడుముళ్లు వేయనున్నాడు. దీంతో అతను శనివారం ముంబయి ఇండియన్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు దూరమయ్యాడు.

04/17/2016 - 05:53

ఇఫో (మలేసియా), ఏప్రిల్ 16: ప్రతిష్టాత్మకమైన సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించాలన్న భారత జట్టు ఆశలపైప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా నీళ్లుచల్లింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 4-0 గోల్స్ తేడాతో నారత్‌ను చిత్తు చేసి టైటిల్‌ను దక్కించుకోగా, భారత్ రజత పతకంతో సంతృప్తి చెందింది. అయితే ఈ టోర్నమెంట్‌లో భారత్ ఆరేళ్ల తర్వాత రజత పతకం సాధించడం ఇదే తొలిసారి.

04/17/2016 - 05:52

మాంటే కార్లో, ఏప్రిల్ 16: మాంటే-కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్, ఫ్రాన్స్ ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఈ టోర్నీలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన నాదల్ శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో బ్రిటన్‌కు చెందిన రెండో సీడ్ ఆటగాడు ఆండీ ముర్రేకి చెక్ పెట్టాడు.

04/17/2016 - 05:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ తన ప్రియురాలు అలీసా హీలేని పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టుకు స్టార్క్ ఫాస్ట్ బౌలర్‌గా సేవలు అందిస్తుండగా, హీలే ఆస్ట్రేలియా మహిళా జట్టుకు వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తోంది. మడమ గాయంతో ఇబ్బందులు పడుతున్న స్టార్క్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు.

04/17/2016 - 05:49

హాంకాంగ్, ఏప్రిల్ 16: భారత వర్థమాన టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్‌తో పాటు వౌమా దాస్ రియో ఒలింపిక్స్‌కు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. హాంకాంగ్‌లో శనివారం వీరు స్టేజ్-2 ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ ఫైనల్ రౌండ్లలో తమతమ ప్రత్యర్థులపై విజయం సాధించడంతో ఒలింపిక్ బెర్తులు ఖరారయ్యాయి.

04/17/2016 - 05:48

రియో డీ జెనిరో, ఏప్రిల్ 16: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) వరల్డ్ కప్ టోర్నీలో భారత ట్రాప్ షూటర్లు మానవ్‌జీత్ సింగ్ సంధూ, కినాన్ చెనాయ్ తొలి రోజు శుభారంభాన్ని సాధించారు.

04/16/2016 - 07:11

ఇపో (మలేసియా), ఏప్రిల్ 15: ప్రతిష్టాత్మకమైన సుల్తాన్ అజ్లన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు టైటిల్ పోరుకు సిద్ధమైంది. తప్పక గెలవాల్సిన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భారత్ శుక్రవారం ఇక్కడ ఆతిథ్య మలేసియా జట్టును 6-1 గోల్స్ తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు చేరడం ఇది ఏడోసారి.

04/16/2016 - 06:53

మాంటే కార్లో, ఏప్రిల్ 15: మాంటే-కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్, ఫ్రాన్స్‌కు చెందిన జో-విల్‌ఫ్రెడ్ సోంగా, గేల్ మోన్‌ఫిల్స్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. అయితే స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు క్వార్టర్ ఫైనల్స్‌లోనే చుక్కెదురైంది.

04/16/2016 - 06:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు బోణీ చేసింది. ఇంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు శుక్రవారం న్యూఢిల్లీలోని సొంత మైదానం ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించి తొలి విజయాన్ని అందుకుంది.

Pages