S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/12/2016 - 03:54

రియో డి జెనీరో, ఆగస్టు 11: రియో ఒలింపిక్స్ మహిళల ఆర్చరీలో భారత్ పోరు ముగిసింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ ఎలిమినేషన్స్ వరకూ చేరుకొని, పతకాలపై ఆశలు రేపిన లైష్రామ్ బొంబాల్యా దేవి, దీపికా కుమారి కీలక పోరులో చేతులెత్తేశారు. మెక్సికో ఆర్చర్ అలెజాండ్రా వలెన్షియాను ఢీకొన్న బొంబాల్యా దేవి కొంత వరకూ పోరాడి 2-6 తేడాతో ఓటమిపాలైంది. సెమీస్ చేరేందుకు ఆమె చేసిన ప్రయత్నంలో దీపిక పదో వంతు కూడా శ్రమించలేదు.

08/12/2016 - 03:53

రియో డి జెనీరో, ఆగస్టు 11: సాకర్‌కు మారుపేరైనప్పటికీ, ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్నప్పటికీ, ఆరంభంలో తడబడి ముందంజ వేయడాన్ని సంక్లిష్టం చేసుకున్న బ్రెజిల్‌ను యువ ఆటగాడు గాబ్రియెల్ బార్బోసా ఆదుకున్నాడు. డెన్మార్క్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అతను రెండు గోల్స్ సాధించాడు. గాబ్రియెల్ విజృంభణతో డెన్మార్క్‌ను 4-0 తేడాతో ఓడించిన బ్రెజిల్ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరచుకుంది.

08/12/2016 - 03:52

రియో డి జెనీరో, ఆగస్టు 11: రియో ఒలింపిక్స్ కీలక దశకు చేరుకున్నాయి. ఈ మెగా పోటీలకు ప్రాణమైన అథ్లెటిక్స్ విభాగంలో పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వరుసగా రెండుసార్లు 100, 200 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ ‘ట్రిపుల్ ట్రిపుల్’ను సాధించేందుకు బరిలోకి దిగుతున్నాడు.

08/12/2016 - 03:50

గ్రాస్ ఐస్లెట్, ఆగస్టు 11: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 353 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (118), వృద్ధిమాన్ సాహా (104) శతకాలతో రాణించడంతో టీమిండియాకు ఈ స్కోరు సాధ్యమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ రెండో రోజు భోజన విరామ సమయానికి లియోన్ జాన్సన్ (23 రనౌట్) వికెట్ కోల్పోయి 107 పరుగులు చేసింది.

08/12/2016 - 03:50

కరాచీ, ఆగస్టు 11: పాకిస్తాన్ క్రికెట్ కురువృద్ధుడు హనీఫ్ మహమ్మద్ కన్నుమూశాడు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతను తన 81వ ఏట కన్నుమూశాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. తొలుత హనీఫ్ మృతి చెందాడని వార్త వెలువడింది. ఆ వెంటనే అతని గుండె మళ్లీ కొట్టుకోవడం ఆరంభించిందని, కోలుకునే అవకాశాలున్నాయని పాక్ మీడియా పేర్కొంది.

08/11/2016 - 07:42

ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ ఈవెంట్స్‌లో ఫెల్ప్స్ మొత్తం 79 పతకాలను సాధించాడు. వీటిలో 64 స్వర్ణాలు. 13 రజతాలు, మూడు కాంస్యాలు కూడా అతను గెల్చుకున్న పతకాల జాబితాలో ఉన్నాయి. ఎన్నో ఒలింపిక్, ప్రపంచ రికార్డులు అతని సరసన చేరి మురిసిపోతున్నాయి. ప్రపంచ స్విమ్మింగ్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరూ సాధించనన్ని రికార్డులు, పతకాలు సొంతం చేసుకున్న ఫెల్ప్స్‌ను అధిగమించడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాదన్నది వాస్తవం.

08/11/2016 - 07:37

రియో డి జెనీరో: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు రియో ఒలింపిక్స్‌లో అనూహ్య పరాజయం ఎదురైంది. సోదరి వీనస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగి ఓటమిపాలైన సెరెనాకు సింగిల్స్‌లోనూ అదే పరిస్థితి తప్పలేదు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆమెను ఉక్రెయిన్‌కు చెందిన ఎలినా స్విటోలినా 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి సంచలనం సృష్టించింది.

08/11/2016 - 07:37

గ్రాస్ ఇస్లెట్, ఆగస్టు 10: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌లోనూ రాణించి అద్భుత శతకాన్ని నమోదు చేశాడు. వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా సెంచరీ సాధించాడు. అశ్విన్‌కు ఇది కెరీర్‌లో నాలుగో సెంచరీ. సాహా ఖాతాలో ఇదే తొలి టెస్టు సెంచరీ.

08/11/2016 - 07:36

రియో డి జెనీరో, ఆగస్టు 10: రియో ఒలింపిక్స్‌లో రోజుకో అపశృతి దొర్లుతోంది. నిరసన ప్రదర్శనలు, సౌకర్యాల లేమి వంటివి సాధారణమైతే, తాజాగా పాత్రికేయులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు బులెట్ల వర్షం కురిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

08/11/2016 - 07:36

రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ఫ్లాప్ షో కొనసాగుతున్న నేపథ్యంలో, గురువారం నుంచి మొదలయ్యే బాడ్మింటన్‌పై అందరు దృష్టి కేంద్రీకరించారు. మహిళల సింగిల్స్‌లో పోటీపడుతున్న హైదరాబాదీ సైనా నెహ్వాల్‌పైనే అభిమానులు ఆశపెట్టుకున్నారు. తెలుగు తేజం పివి సింధు కూడా బరిలోకి దిగనుంది.

Pages