S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/16/2016 - 05:57

టెస్టులు: నవంబర్ 9 నుంచి 13వ తేదీ వరకు రాజ్‌కోట్‌లో మొదటి టెస్టు, నవంబర్ 17 నుంచి 21వ తేదీ వరకు విశాఖపట్నంలో రెండో టెస్టు, నవంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు మొహాలీలో మూడో టెస్టు, డిసెంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు ముంబయిలో నాలుగో టెస్టు, డిసెంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు చెన్నైలో ఐదో టెస్టు. (ఈ మ్యాచ్‌లన్నీ ఉదయం 9.30 గంటలకు ఆరంభమవుతాయి)

07/16/2016 - 05:56

న్యూఢిల్లీ, జూలై 15: భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా నవంబర్ 9వ తేదీ నుంచి ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో రాజ్‌కోట్, విశాఖపట్నం తొలిసారి టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ పర్యటన సందర్భంగా ఇంగ్లాండ్ జట్టు టీమిండియాతో మొత్తం ఐదు టెస్టులు, మూడు అంతర్జాతీయ వనే్డలు, మరో మూడు ట్వంటీ-20 మ్యాచ్‌లలో తలపడుతుంది.

07/16/2016 - 05:56

స్టాడ్ (స్విట్జర్లాండ్), జూలై 15: స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న స్టాడ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో 16 ఏళ్ల స్థానిక యువ క్రీడాకారిణి రెబెకా మసరోవా సత్తా చాటుకుంది. తొలిసారి డబ్ల్యుటిఎ టోర్నమెంట్ బరిలోకి దిగిన ఆమె సింగిల్స్ తొలి రౌండ్ పోరులో ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి జెలెనా జాంకోవిచ్‌పై సంచలన విజయం సాధించింది.

07/16/2016 - 05:55

జొహానె్నస్‌బర్గ్, జూలై 15: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా క్రీడా బృందంలో వివాదాస్పద అథ్లెట్ కాస్టర్ సెమెన్యాకు స్థానం లభించింది. మొత్తం 137 మంది సభ్యులతో కూడిన దక్షిణాఫ్రికా ఒలింపిక్ బృందంలో సెమెన్యాతో పాటు వేడ్ వాన్ నీకెర్క్‌కు కూడా చోటు కల్పించారు.

07/16/2016 - 05:55

న్యూపోర్ట్, జూలై 15: న్యూపోర్ట్‌లో జరుగుతున్న హాల్ ఆఫ్ ఫేమ్ ఎటిపి టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో సైప్రస్ ఆటగాడు మార్కోస్ బగ్దాటిస్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన బగ్దాటిస్ గురువారం అర్థరాత్రి జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన ఏడో సీడ్ ఆటగాడు డుడీ సెలాపై విజయం సాధించాడు.

07/16/2016 - 05:54

న్యూఢిల్లీ, జూలై 15: బ్రెజిల్‌లోని రియోడిజనిరోలో ఆగస్టు 5న ప్రారంభమయ్యే ఒలింపిక్ గేమ్స్‌లో మన దేశానికి చెందిన ముగ్గురు బాక్సర్లు శివ్ థాపా, మనోజ్ కుమార్, వికాస్ కృష్ణన్‌లు భారత జాతీయ పతాకం కింద పాల్గొనడానికి అనుమతించారు. ప్రపంచ బాక్సింగ్ సంస్థ ఏఐబిఏ భారత బృందాన్ని జాతీయ పతాకం కింద పాల్గొనడానికి అనుమతించింది.

07/16/2016 - 05:54

న్యూఢిల్లీ, జూలై 15: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తర్వాత ఇప్పటివరకు ఓటమి ఎరుగని భారత బాక్సింగ్ స్టార్ విజేందర్ సింగ్ శనివారం ఇక్కడ డబ్ల్యుటిఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్ కోసం ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్‌ను ఢీకొంటున్నాడు.హోప్‌ను సులువుగా ఓడించగలనన్న ధీమాతో అతను ఉన్నాడు.

07/15/2016 - 17:54

దిల్లీ: భారత్‌ పర్యటనలో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు నవంబర్‌ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం విడుదల చేసింది. భారత్‌ - ఇంగ్లాండ్‌ సిరీస్‌లో మొదటి టెస్టు నవంబర్‌ 9న రాజ్‌కోట్‌లో ప్రారంభం కానుంది.

07/15/2016 - 05:01

చెంగ్డూ (చైనా), జూలై 14: చైనాలోని చెంగ్డూలో జరిగిన మహిళల ఫైడ్ గ్రాండ్ ప్రీ చెస్ టోర్నమెంట్‌లో ‘తెలుగు తేజం’ ద్రోణవల్లి హారిక విజేతగా నిలిచింది. గురువారం ఆమె రష్యాకు చెందిన ఓల్గా గిర్యాతో ఉత్కంఠ భరితంగా జరిగిన చివరి రౌండ్ గేమ్‌ను డ్రాగా ముగించి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్ ప్రీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

,
07/15/2016 - 04:59

ముంబయి, జూలై 14: భారత మాజీ టెస్టు క్రికెటర్ ప్రవీణ్ అమ్రే, కర్నాటక మాజీ స్పిన్నర్ రఘురామ్ భట్‌లకు ద్వంద్వ ప్రయోజనాలున్నట్లు క్రికెట్‌బోర్డు నియమించిన అంబుడ్స్‌మన్ గుర్తించారు. అయితే భారత జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌పై వచ్చిన ఇలాంటి ఆరోపణల్లో నిజం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

Pages