S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/25/2016 - 03:32

న్యూఢిల్లీ, జనవరి 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో వేలానికి వచ్చే ఆటగాళ్ల జాబితాలో నిర్వహణ కమిటీ సోమవారం ప్రకటించనుంది. వివిధ ఫ్రాంచైజీలు వేలం కోసం విడుదల చేసిన 714 మంది ఆటగాళ్లకు బేస్ ప్రైస్‌ను నిర్ధారిస్తారు. వీరిలో 12 మంది క్రికెటర్లను ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం. వారిలో యువరాజ్ సింగ్‌కు భారీగా రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ ఉంటుందని అంటున్నారు.

01/25/2016 - 03:31

దుబాయ్, జనవరి 24: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన వనే్డ ఇంటర్నేషనల్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు రోహిత్ శర్మకు ఐదో స్థానం దక్కింది. అతనికి కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-4 తేడాతో కోల్పోయినప్పటికీ, అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ ఏకంగా ఐదు స్థానాలు మెరుగు పరచుకోవడం గమనార్హం.

01/25/2016 - 03:30

చండీగఢ్, జనవరి 24: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టోర్నమెంట్‌లో దబాంగ్ ముంబయ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. జెపి పంజాబ్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జ ట్టు 1-3 తేడాతో ఓడింది. మ్యాచ్ ఆరంభమైన తొ మ్మిదో నిమిషంలోనే అర్మాన్ ఖురేషీ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేశాడు. దీనితో పంజాబ్‌కు బోనస్ గోల్ కూడా లభించి, 2-0 ఆధిక్యం దక్కింది.

01/25/2016 - 03:29

న్యూఢిల్లీ, జనవరి 24: తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేస్తున్న పివి సింధుకు భారత బాడ్మింటన్ సమాఖ్య (బాయ్) ఆదివారం ఐదు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రీ మహిళల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన ఆమెకు ప్రోత్సాహకరంగా ఈ మొత్తాన్ని ఇస్తామని బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపాడు.

01/25/2016 - 03:29

వెల్లింగ్టన్, జనవరి 24: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కారణంగా జైలు శిక్షను, ఐదేళ్ల సస్పెన్షన్‌ను పూర్తి చేసుకొని మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్‌తో తనకు ఎలాంటి విభేదాల్లేవని పాకిస్తాన్ కెప్టెన్ అజర్ అలీ స్పష్టం చేశాడు.

01/24/2016 - 03:04

సిడ్నీ: భారత ఆటగాడు మనీష్ పాండే, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్ శనివారం తమతమ కెరీర్‌లలో మొట్టమొదటి వనే్డ ఇంటర్నేషనల్ శతకాలను నమోదు చేశారు. ఇందులో వింత లేకపోయినప్పటికీ, వారి మధ్య వైదుధ్యమే ఆసక్తిని కలిగిస్తున్నది. మిచెల్ మార్ష్‌కు కెరీర్‌లో ఇది 27వ వనే్డ.

01/24/2016 - 02:58

మెల్బోర్న్, జనవరి 23: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో మూడోసీడ్ గార్బినె ముగురుజాకు అన్‌సీడెడ్ బార్బొరా స్ట్రయికోవా షాకిచ్చింది. శనివారం మూడో రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆమె 6-3, 6-2 తేడాతో వరుస సెట్లలో గెలిచి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

01/24/2016 - 02:57

వెల్లింగ్టన్, జనవరి 23: పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లతో జరిగే వనే్డ సిరీస్‌లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ పాల్గొనడం లేదు. పాకిస్తాన్‌తో జరిగిన చివరి, మూడో టి-20 మ్యాచ్ ఆడుతున్నప్పుడు గాయపడిన టేలర్ కోలుకోలేదు. అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కోవడంతో, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లతో జరిగే వనే్డ సిరీస్‌లకు సెలక్టర్లు అతని పేరును పరిగణలోకి తీసుకోలేదు.

01/24/2016 - 02:57

సెయింట్ జాన్స్, జనవరి 23: వెస్టిండీస్ వెటరన్ ఆటగాడు శివనారైన్ చందర్‌పాల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు. 41 ఏళ్ల చందర్‌పాల్ 22 ఏళ్ల కెరీర్‌లో 164 టెస్టులు ఆడాడు. 280 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి 11,867 పరుగులు సాధించాడు. విండీస్ తరఫున ఇది రెండో అత్యధిక స్కోరు. బ్రియాన్ లారా 11,953 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

01/24/2016 - 02:56

పెనాంగ్, జనవరి 23: భారత ఏస్ షట్లర్ పివి సింధు ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సెమీ ఫైనల్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాస్ సీడఇ జీ హ్యున్ సంగ్ (కొరియా)ను ఆమె 21-19, 12-21, 21-10 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న సింధు 2013లో మలేసియా గ్రాండ్ ప్రీని గెల్చుకుంది.

Pages