S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/20/2017 - 02:13

మెల్బోర్న్, జనవరి 19: నిరుడు ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఏంజెలిక్ కెర్బర్ చేతిలో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్న ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఈసారి టైటిల్‌ను సాధించాలన్న పట్టుదలతో దూసుకెళుతున్నది. అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్న ఆమె రెండో రౌంఢ్‌లో లూసీ సఫరోవాను 6-3, 6-4 తేడాతో సులభంగా ఓడించి, మూడో రౌండ్ చేరింది. ఈసారి టైటిల్ రేసులో సెరెనా అందరి కంటే ముందున్నది.

01/20/2017 - 02:11

సరవాక్ (మలేసియా), జనవరి 19: ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో సైనా 21-17, 21-12 ఆధిక్యంతో హన్నా రమాదినీ (ఇండోనేషియా)ను చిత్తుచేసింది. ఆరోసీడ్ జయరామ్ 21-12, 15-21, 21-15 స్కోరుతో సూ సుయాన్ ఈని ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.

01/20/2017 - 02:11

మెల్బోర్న్: తొమ్మిదో ర్యాంక్ ఆటగాడు, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ చేరాడు. గాయాల కారణంగా చాలాకాలంగా అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్న అతను ఈ ఏడాది ఫిట్నెస్ సమస్యల నుంచి బయటపడుతున్నట్టు కనిపిస్తున్నది. రెండో రౌండ్‌లో అతను ‘జెయింట్ కిల్లర్’ మార్కొస్ బగ్దాటిస్ నుంచి ఎదురైన పోటీని తట్టుకొని, 6-3, 6-1, 6-3 తేడాతోవిజయభేరి మోగించాడు.
పేస్ అవుట్

01/20/2017 - 02:04

ఇంగ్లాండ్‌తో కటక్‌లో గురువారం జరిగిన రెండో వనే్డలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు యువీ, ధోనీ చెలరేగిపోయారు. ఆరేళ్ల స్తబ్ధత తర్వాత యువీ సెంచరీతో అదరగొట్టాడు. ధోనీ కూడా పోటాపోటీగా ఆడి భారత్‌కు సిరీస్‌ను అందించాడు.

01/19/2017 - 07:25

మెల్బోర్న్, జనవరి 18: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకొని, ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో చెమటోడ్చి నెగ్గాడు. క్వాలిఫయర్ నొవా రూబిన్‌తో తలపడిన అతను 7-5, 6-3, 7-6 ఆధిక్యంతో విజయం సాధించి మూడో రౌండ్ చేరాడు.

01/19/2017 - 07:23

సరావక్, జనవరి 18: భారత స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్ చేరింది. రెండో రౌండ్‌లో ఆమె 21-9, 21-8 తేడాతో థాయిలాండ్‌కు చెందిన చాసినీ కొరెపప్‌పై విజయం సాధించింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఇప్పటి వరకూ టైటిల్ సాధించలేకపోయినా ఆమె ఈ టోర్నీలో ఆ లోటును భర్తీ చేసుకునే ప్రయత్నంలో ఉంది.

01/19/2017 - 07:17

న్యూఢిల్లీ, జనవరి 18: ఈఏడాది తీరికలేని అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఈనెల 21 నుంచి మొదలయ్యే హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ప్రాక్టీస్ ఈవెంట్‌గా ఉపయోగపడుతుందని భారత డిఫెండర్ బీరేంద్ర లాక్రా అన్నాడు. కండరాలు బెణకడంతో రియో ఒలింపిక్స్‌లో ఆడలేకపోయిన అతను ఆతర్వాత కోలుకొని, నిరుడు అక్టోబర్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగాడు.

01/19/2017 - 07:10

చెన్నై, జనవరి 18: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఏ ఒక్క ప్రాంతానికో లేదా దేశానికో పరిమితం చేయడం తగదని ప్రముఖ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవ్ వాట్‌మోర్ ప్రశంసించాడు. ఇక్కడి శ్రీరామచంద్ర స్పోర్ట్స్ సైనె్సస్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ, అశ్విన్ అందరి వాడని అన్నాడు.

01/19/2017 - 07:09

కటక్, జనవరి 18: పరమిత ఓవర్ల ఫార్మాట్లకు కూడా రెగ్యులర్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత జరుగుతున్న మొదటి వనే్డ సిరీస్‌ను సొంతం చేసుకోవాలని విరాట్ కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు. మొదటి వనే్డలో ఇంగ్లాండ్ ఏడు వికెట్లకు 350 పరుగులు సాధించినప్పటికీ ఏమాత్రం తడబడకుండా అతను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, మరో సెంచరీ హీరో కేదార్ జాదవ్‌తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి విషయం తెలిసిందే.

01/18/2017 - 03:24

మెల్బోర్న్, జనవరి 17: సుదీర్ఘ కెరీర్‌లో 23వ గ్రాండ్‌శ్లామ్ టైటిల్ సాధించి ఓపెన్ ఎరా టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాలని తహతహలాడుతున్న అమెరికా ‘నల్లకలువ’ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్‌లో తన పోరాటాన్ని ఘనంగా ప్రారంభించింది.

Pages