S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/09/2016 - 07:35

ఏప్రిల్ 9 ముంబయి ఇండియన్స్-పుణె సూపర్‌జెయింట్స్ ముంబయి
ఏప్రిల్ 10 కోల్‌కతా నైట్ రైడర్స్-్ఢల్లీ డేర్‌డెవిల్స్ కోల్‌కతా
ఏప్రిల్ 11 కింగ్స్ ఎలెవెన్ పంజాబ్-గుజరాత్ లయన్స్ మొహాలీ
ఏప్రిల్ 12 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ బెంగళూరు
ఏప్రిల్ 13 కోల్‌కతా నైట్ రైడర్స్-ముంబయి ఇండియన్స్ కోల్‌కతా
ఏప్రిల్ 14 గుజరాత్ లయన్స్-రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ రాజ్‌కోట్

04/09/2016 - 07:33

షా ఆలం (మలేసియా), ఏప్రిల్ 8: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ‘తెలుగు తేజం’ పివి.సింధు క్వార్టర్ ఫైనల్‌లో పరాజయాన్ని ఎదుర్కొని ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.

04/09/2016 - 07:32

హైదరాబాద్, ఏప్రిల్ 8: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడనున్న ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తొలి రెండు వారాలు ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇటీవల ముగిసిన టి-20 ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా కాలి మడమకు తగిలిన గాయం నుంచి యువరాజ్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోవడమే ఇందుకు కారణం. ‘యువరాజ్ రెండు వారాల పాటు మా జట్టుకు దూరమవడం విచారకరం.

04/09/2016 - 07:32

ముంబయి, ఏప్రిల్ 8: తీవ్రమైన వర్షాభావంతో అల్లాడుతున్న మహారాష్టల్రో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌ల నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. మహారాష్టల్రో నిర్వహించ తలపెట్టిన ఐపిఎల్ మ్యాచ్‌లను మరో చోటికి మార్చాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిఐఎల్) దాఖలవడమే ఇందుకు కారణం.

04/08/2016 - 06:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: తొమ్మిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సత్తా చాటేందుకు ఎనిమిది జట్లు
సన్నాహాలను ముమ్మరం చేశాయి. చాలా మంది క్రికెటర్లు ఇప్పటికే నెట్స్‌లో శ్రమిస్తున్నారు. డిఫెండింగ్ చాంపి

04/08/2016 - 06:51

ముంబయి, ఏప్రిల్ 7: ముంబయిలో ఈనెల 9న జరగాల్సిన తాజా ఐపిఎల్ సీజన్ తొలి మ్యాచ్‌కి లైన్ క్లియరైంది. ఈ మ్యాచ్‌ని నిర్వహించుకోవడానికి ముంబయి కోర్టు అంగీకరించింది. అయితే, మహారాష్టల్రో నెలకొన్న నీటి ఎద్దడి, ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసును 12వ తేదీకి వాయిదా వేసింది.

04/08/2016 - 06:50

* ప్రతి సీజన్‌లోనూ ఎక్కువ పరుగులు సాధించిన అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్, ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్‌లను బహూకరిస్తారు.

04/08/2016 - 06:48

షా ఆలం (మలేసియా), ఏప్రిల్ 7: మలేసియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్లు సైనా నెహ్వాల్, పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరారు. ప్రీ క్వార్టర్స్‌లో సైనా 21-10, 21-16 ఆధిక్యంతో బయె ఇయాన్ జూను ఓడించింది. మరో మ్యాచ్‌లో సింధు 22-20, 21-17 ఆధిక్యంతో సంగ్ జీ హ్యున్‌పై విజయం సాధించి క్వార్టర్స్ చేరింది.

04/08/2016 - 06:47

కౌలాలంపూర్, ఏప్రిల్ 7: సుల్తాన్ అజ్లన్ షా హాకీ టోర్నీలో భాగంగా గురువారం ఆస్ట్రేలియాను ఢీకొన్న భారత్ 1-5 తేడాతో చిత్తయింది. మొదటి మ్యాచ్‌లో తన స్థాయికి తగినట్టు ఆడలేకపోయినప్పటికీ, జపాన్‌ను 2-1 తేడాతో ఓడించిన సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు రెండో మ్యాచ్‌లో దారుణంగా ఓడింది. మ్యాచ్ ఐదో నిమిషంలోనే బ్లేక్ గోవర్స్ ద్వారా ఆసీస్‌కు తొలి గోల్ లభించింది.

04/07/2016 - 07:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే విషయంలో క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యమని మాజీ కెప్టెన్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఇప్పటి వరకూ కోచ్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న టీమిండియా డైరెక్టర్ రవి శాస్ర్తీ కాంట్రాక్టు టి-20 వరల్డ్ కప్‌తో ముగిసింది.

Pages