S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/17/2017 - 01:04

విజయవాడ (స్పోర్ట్స్), జనవరి 16: సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ ఆదేశాల ప్రకారం ఈ నెల 18లోపు బిసిసిఐ అనుబంధ రాష్ట్ర క్రీడా సంఘాల కార్యవర్గాల మార్పుల్లో భాగంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) సోమవారం విజయవాడలో తాత్కాలిక కార్యవర్గాన్ని ఎన్నుకుంది. నరసాపురం పార్లమెంట్ సభ్యుడు, బిసిసిఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఎసిఎ కార్యదర్శిగా ఇప్పటివరకు కొనసాగారు.

01/17/2017 - 01:03

న్యూఢిల్లీ, జనవరి 16: సచిన్ తెండూల్కర్ స్థాయిలో ఆడడం, అతని మాదిరి మారథాన్ కెరీర్‌ను అందుకోవడం సులభసాధ్యం కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. 24 సంవత్సరాలు భారత క్రికెట్‌కు అత్యుత్తమ సేవలు అందించిన సచిన్ 2013 నవంబర్‌లో, కెరీర్‌లో 200వ టెస్టు ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.

01/17/2017 - 01:01

సరవాక్ (మలేసియా), జనవరి 16: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఫిట్నెస్‌కు క్వాలిఫయర్స్‌తో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మలేసియా మాస్టర్స్ బాడ్మింటన్ టోర్నీ పరీక్ష పెట్టనుంది. నిరుడు పాదానికి గాయం, ఆతర్వాత మోకాలికి శస్త్ర చికిత్స సైనా ఫామ్‌ను దారుణంగా దెబ్బతీసిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఆమె పలు టోర్నీలకు దూరమైంది. పాల్గొన్న టోర్నీల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

01/17/2017 - 00:59

వెల్లింగ్టన్, జనవరి 16: కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ సూపర్ సెంచరీతో చెలరేగిపోవడంతో, బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. చివరి రోజు రెండో సెషన్ తర్వాత 217 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కివీస్ ఈ మ్యాచ్‌ని డ్రాగా ముగిస్తుందని అంతా అనుకున్నారు.

01/17/2017 - 00:57

పుణే, జనవరి 16: టీమిండియా కెప్టెన్ ఎవరు? ఎవరైనా వెంటనే విరాట్ కోహ్లీ పేరు చెప్తారు. అయితే, ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మొదటి వనే్డ మ్యాచ్‌ని తిలకించిన వారు మరో సమాధానం వినిపించే అవకాశం ఉంది. కోహ్లీ అనుమతి కోసం ఎదురు చూడకుండా మహేంద్ర సింగ్ ధోనీ డిఆర్‌ఎస్ అప్పీల్ చేయడమే ఇందుకు కారణం.

01/16/2017 - 02:19

పుణే, జనవరి 15: టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసిన టీమిండియా వనే్డల్లోనూ బోణీ చేసింది. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌ని మూడు వికెట్ల తేడాతో గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విరాట్ కోహ్లీ ఈ విజయంతో శుభారంభం చేశాడు. అంతేగాక, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, కెరీర్‌లో 27వ సెంచరీ సాధించాడు.

01/15/2017 - 23:58

ఇండోర్, జనవరి 15: రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకున్న పార్థీవ్ పటేల్ నాయకత్వంలోని గుజరాత్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో పటిష్టమైన డిఫెండింగ్ చాంపియన్ ముంబయిని 5 వికెట్ల తేడాతో ఓడించి, మొట్టమొదటిసారి రంజీ విజేతగా నిలిచింది. 41 పర్యాయాలు రంజీ ట్రోఫీని సాధించి, మరో టైటిల్‌పై కనే్నసిన ముంబయిని ఓడించడంలో పార్థీవ్ పటేల్ కీలక పాత్ర పోషించడం విశేషం.

01/15/2017 - 23:57

మెల్బోర్న్, జనవరి 15: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌ను పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. 2005 జనవరి తర్వాత ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను పాక్ ఇప్పటి వరకూ ఏ ఫార్మాట్‌లోనూ ఓడించలేకపోయింది. సుమారు 11 సంవత్సరాల విరామం తర్వాత పాక్ తొలిసారి ఆసీస్ గడ్డపై ఓ విజయాన్ని నమోదు చేసింది.

01/15/2017 - 23:57

పుణే, జనవరి 15: కోహ్లీ, జాదవ్ ఐదో వికెట్‌కు 200 పరుగులు జోడించి, వనే్డల్లో ఐదో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని అందించారు. జింబాబ్వేపై జెపి డుమినీ, డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) అజేయంగా 256 పరుగులు పార్ట్‌నర్‌షిప్‌ను అందించి, ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు.

01/16/2017 - 02:14

మెల్బోర్న్, జనవరి 15: ఈ ఏడాది మొదటి టెన్నిస్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆధిపత్య పోరాటానికి పేరొందిన స్టార్లు సిద్ధంగా ఉన్నారు. సోమవారం నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో నొవాక్ జొకోవిచ్, ఏంజెలిక్ కెర్బర్ డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగుతుండగా, ఆండీ ముర్రే, సెరెనా విలియమ్స్ వంటి మేటి స్టార్లు టైటిల్‌పై కనే్నశారు.

Pages