S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/07/2016 - 07:51

మార్సెల్లే, జూలై 6: ప్రపంచ సాకర్ చాంపియన్ జర్మనీకి ఫ్రాన్స్ సవాళ్లు విసురుతోంది. గురువారం జరిగే యూరో 2016 చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో ఫ్రెంచ్ ఆటగాళ్లు స్వదేశంలో, వేలాది మంది అభిమానుల మద్దతు లభిస్తున్న నేపథ్యంలో పోరాటానికి సిద్ధమవుతున్నారు. హోం గ్రౌండ్‌లో విజయం సాధించాలన్న పట్టుదల వారిలో కనిపిస్తున్నది.

07/07/2016 - 07:50

లండన్, జూలై 6: చాలా ఎత్తు నుంచి వచ్చిన బంతిని క్యాచ్ పట్టిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ గిన్నిస్ రికార్డును సృష్టించాడు. పాకిస్తాన్‌తో నాలుగు టెస్టులు, ఐదు వనే్డలు, ఒక టి-20 మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో లార్డ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో బంతిని ఆకాశంలోకి ఎగరేసి, దానిని క్యాచ్ పట్టే పోటీని నిర్వహించాడు.

07/07/2016 - 07:49

సౌతాంప్టన్, జూలై 6: జొస్ బట్లర్ విజృంభణతో శ్రీలంకతో జరిగిన ఏకైక టి-20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు మరో 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌటైంది. దనుష్క గుణతిలక 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దినేష్ చండీమల్ 23, కుశాల్ మేండిస్ 21 పరుగులు చేశారు.

07/07/2016 - 07:48

హైదరాబాద్, జూలై 6: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో బుధవారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 51-26 తేడాతో దబాంగ్ ఢిల్లీని చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ ఆధిపత్యాన్ని కనబరచిన జైపూర్ 25 పాయింట్ల తేడాతో గెలిచి, ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 20 పాయింట్లను సంపాదించి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. రాజేష్ నర్వాల్ 16 పాయింట్లు సాధించి జైపూర్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.

07/06/2016 - 16:46

మ్యాడ్రిడ్: అర్జెంటైనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి 21 నెలల జైలుశిక్ష, రెండు మిలియన్ యూరోల ఫైన్ విధించారు. మూడు సార్లు పన్నుకు సంబంధించిన నేరాలకు పాల్పడినందుకు ఈ శిక్షలు విధించారు. మెస్సీ తండ్రికి కూడా జైలుశిక్ష , 1.5 మిలియన్ యూరోల ఫైన్ విధించారు. మెస్సీ ఇటీవలే రిటైర్‌మెంట్ ప్రకటించారు. తండ్రీ కొడుకులిద్దరూ ఫైన్ కట్టి శిక్ష తప్పించుకోవచ్చని తెలుస్తోంది.

07/06/2016 - 01:55

లండన్, జూలై 5: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అమెరికా టాప్ సీడ్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌తో పాటు ఆమె సోదరి వీనస్ విలియమ్స్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. దీంతో వీరిద్దరి మధ్య ఫైనల్ పోరు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

07/06/2016 - 01:53

లండన్, జూలై 5: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

07/06/2016 - 01:51

న్యూఢిల్లీ, జూలై 5: టెస్టు క్రికెట్ మ్యాచ్‌ల పట్ల అభిమానుల్లో ఆసక్తిని నిలబెట్టేందుకు మున్ముందు పింక్ బాల్స్‌తో డే/నైట్ టెస్టులు నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉందని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే అంగీకరించాడు. అయితే పింక్ బాల్ టెస్టుల కోసం భారత అభిమానులు ఇంకా చాలా కాలం ఆగాల్సిందేనని అతను మంగళవారం స్పష్టం చేశాడు.

07/06/2016 - 01:49

మాస్కో, జూలై 5: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అనుమతించాలని కోరుతూ అభ్యర్థించిన 68 మంది అథ్లెట్ల జాబితాను రష్యా మంగళవారం ప్రచురించింది. ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌ను ప్రోత్సహించారన్న ఆరోపణలపై అంతర్జాతీయ అథ్లెటిక్ ఫెడరేషన్ రష్యా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్సపై రెండేళ్ల పాటు నిషేధం విదించిన విషయం తెలిసిందే.

07/06/2016 - 01:48

న్యూఢిల్లీ, జూలై 5: రియో ఒలింపిక్స్‌లో బెర్తును ఖరారు చేసుకునేందుకు భారత బాక్సర్, డబ్ల్యుబిసి ఆసియా చాంపియన్ నీరజ్ గోయత్ మరో అడుగు దూరంలో నిలిచాడు.

Pages