S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/26/2016 - 04:21

నాగ్‌పూర్, మార్చి 25: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న వెస్టిండీస్ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించిన ఆ జట్టు తాజాగా శుక్రవారం నాగ్‌పూర్‌లో ఉత్కంఠ భరితంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించి ‘హ్యాట్రిక్’తో సత్తా చాటుకోవడంతో సెమీఫైనల్ బెర్తు ఖరారైంది.

03/26/2016 - 04:20

మియామీ, మార్చి 25: టెన్నిస్ రంగం పెద్దగా డోపింగ్ సమస్యను ఎదుర్కోవడం లేదని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ అభిప్రాయ పడరతూ, అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రగ్ పరీక్షల ప్రోటోకాల్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు.

03/26/2016 - 04:20

గోరఖ్‌పూర్, మార్చి 25: ఐసిసి ప్రపంచ టి-20 టోర్నమెంట్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించిన చివరి ఓవర్ ఓ భారత అభిమాని ప్రాణాలను బలిగొంది. అనూహ్య పరిణామాలతో నిండిన ఆ ఓవర్‌లో అందరూ ఓడిపోతుందని భావించిన భారత్ చివరికి ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

03/26/2016 - 04:19

మియామీ, మార్చి 25: అమెరికాలో జరుగుతున్న మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ బ్యూటీ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) శుభారంభాన్ని సాధించారు. ఈ టోర్నీలో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో లారా అరువాబరెనా (స్పెయిన్), రలుకా ఒలారు (రొమేనియా) జోడీని మట్టి కరిపించారు.

03/26/2016 - 04:18

మొహాలీ, మార్చి 25: ప్రస్తుతం జరుగుతున్న టీ-20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత క్రికెట్ నుంచి రిటైర్ కావడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ షహీద్ అఫ్రిదీ శుక్రవారం స్పష్టం చేశాడు.

03/26/2016 - 04:17

ఆక్లాండ్, మార్చి 25: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుక్రవారం భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. జ్వాలా గుత్త, అశ్వనీ పొన్నప్ప సహా భారత జంటలన్నీ తమతమ ప్రత్యర్థుల చేతిలో వరుస గేముల తేడాతో ఓటముల పాలవడమే ఇందుకు కారణం. దీంతో ఈ టోర్నీలో భారత్ పోరు ముగిసింది.

03/25/2016 - 03:21

చండీగఢ్, మార్చి 24: ఆస్ట్రేలియా సూపర్ స్టార్ బ్యాట్స్‌మన్ గ్లేన్ మాక్స్‌వెల్ గురువారం హోలీ సంబరంలో మునిగి తేలాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడుతున్న మాక్స్‌వెల్‌కు పంజాబ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. టి-20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో శుక్రవా రం మొహాలీలో ఆస్ట్రేలియా అత్యంత కీలక మ్యాచ్ ఆడనుంది.

03/25/2016 - 03:20

కెరీర్‌లో 59 టెస్టులు ఆడిన వాట్సన్ 3,731 పరుగులు చేశాడు. 75 వికెట్లు పడగొట్టాడు. 190 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 5,757 పరుగులు సాధించాడు. 168 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టి-20 ఇంటర్నేషనల్స్‌లో ఇప్పటి వరకూ 1,400 పరుగులు చేసి, 46 వికెట్లు కూల్చాడు. 2007, 2015 సంవత్సరాల్లో ప్రపంచ కప్‌ను సాధించిన ఆస్ట్రేలియా జట్టులో వాట్సన్ సభ్యుడు.

03/25/2016 - 03:19

మొహాలీ, మార్చి 24: టి-20 వరల్డ్ కప్ క్రికెట్ గ్రూప్-2లో అత్యంత కీలకమైన మ్యాచ్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సెమీ ఫైనల్‌లో స్థానానికి రేసులో ఉండే అవకాశం దక్కుతుంది. ఓడిన జట్టు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. పాకిస్తాన్ మూడు మ్యాచ్‌లు ఆడి రెండు పరాజయాలను చవిచూసింది.

03/25/2016 - 03:19

బెంగళూరు, మార్చి 24: బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద ఒక పరుగు తేడాతో విజయం సాధించి రేస్‌లోనే ఉన్నప్పటికీ టీమిండియా సెమీ ఫైనల్ చేరడం అనుకున్నంత సులభమేమీ కాదు. గ్రూప్-2 నుంచి పోటీపడుతున్న భారత్ మూడు మ్యాచ్‌లు ఆడి, రెండు విజయాలను నమోదు చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించగా, అంతకు ముందు న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది.

Pages