S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/10/2017 - 01:26

ఇండోర్, జనవరి 9: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి, ఆరున్నద దశాబ్దాల సుదీర్ఘ విరామానికి తెరదించాలని గుజరాత్ భావిస్తున్నది. అయితే, ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో 41 పర్యాయాలు టైటిల్ సాధించిన ముంబయికి ఆ జట్టు ఏ స్థాయిలో పోటీనిస్తుందో చూడాలి.

01/10/2017 - 01:25

సిడ్నీ, జనవరి 9: ప్రతిష్ఠాత్మకమైన బిగ్ బాష్ టోర్నీలో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడాల్సిన ఆస్ట్రేలియా స్పిన్నర్ స్టీఫెన్ ఒకీఫ్ హఠాత్తుగా వైదొలిగాడు. అతనికి విశ్రాంతినివ్వాలని నిర్ణయించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ప్రకటించింది. కాగా, భారత్‌తో ఫిబ్రవరి, మార్చి మాసాల్లో జరిగే సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని, సిఎ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

01/10/2017 - 01:24

పారిస్, డిసెంబర్ 9: ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీ సుమారు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఫార్ములా వన్ రేస్ క్యాలండర్‌లో చోటు దక్కించుకోనుంది. 2018లో ఈ రేసును నిర్వహించడానికి అనుమతి లభించిందని, ఇకపై నిరంతరాయంగా ఈ రేస్ ఉంటుందని ఫ్రాన్స్ ఫార్ములా వన్ సంఘం (ఎసిఎఫ్) ప్రకటించింది. 2008లో చివరిసారి ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీని మాగ్నీ ఫార్ములా వన్ సర్క్యూట్‌పై నిర్వహించారు.

01/10/2017 - 01:23

చెన్నై, జనవరి 9: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ‘టాప్-10’లో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని ఇక్కడ జరిగిన చెన్నై ఓపెన్ టైటిల్‌ను సాధించిన స్పెయిన్ టెన్నిస్ ఆటగాడు రాబర్టో బటిస్టా అగుట్ స్పష్టం చేశాడు. అయితే, అది అనుకున్నంత సులభం కాదని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. చెన్నై ఓపెన్‌ను గెల్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పాడు.

01/10/2017 - 01:23

న్యూఢిల్లీ, జనవరి 9: క్రికెట్‌పై తన పట్టును కొనసాగించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కొత్త ఎత్తులు వేస్తున్నది. అందులో భాగంగానే, మ్యాచ్‌లను నిర్వహించే స్థితిలో లేమంటూ కొన్ని సభ్య సంఘాలతో చెప్పిస్తున్నది. సుప్రీం కోర్టు ఆదేశాలతో బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనురాగ్ ఠాకూర్, ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కారణంగా పరువు కోల్పోయిన మాజీ అధ్యక్షుడు ఎన్.

01/10/2017 - 01:21

ముంబయ, జనవరి 9: అంతర్జాతీయ టెస్టులు, వనే్డ క్రికెట్ మ్యాచ్‌లలో ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ సృష్టించిన రికార్డులను అధిగమించే సామర్ధ్యం యువ ఆటగాడు, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. చాలా మంది వాదన ప్రకారం, ఇటీవలి కాలంలో కోహ్లీ భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదగడమేగాక, చాలా సందర్భాల్లో స్థిరమైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు.

01/10/2017 - 01:20

ముంబయి, జనవరి 9: భారత బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే డేంజర్ జోన్‌లోకి వెళ్లినట్టు స్పష్టమవుతున్నది. యువరాజ్ సింగ్‌కు మరో అవకాశం, వృషభ్ సింగ్ ఎంపిక వంటి అంశాలు రహానే భవిష్యత్తుపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అతనికి టెస్టు క్రికెటర్‌గా ఇప్పటికే ముద్ర పడింది. గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టులకు రహానే దూరమైన విషయం తెలిసిందే.

01/09/2017 - 00:38

ముంబయి, జనవరి 8: పరమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో యుద్ధానికి భారత్, ఇంగ్లాండ్ క్రికెటర్లు సిద్ధమవుతున్నాయి. ఇక్కడి బ్రబౌర్న్ స్టేడియంలో ఆదివారం ఇరు దేశాలకు చెందిన క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ఈనెల 10వ తేదీన మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ ‘ఎ’ జట్టు మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడుతుంది.

01/09/2017 - 00:34

ముంబయి: తన ముందు చాలా పెద్ద సవాలు ఉందని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు. పటిష్టమైన టీమిండియాతో భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడక తప్పదని వ్యాఖ్యానించాడు. ఆదివారం ఉదయం నెట్స్‌కు హాజరైన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ భారత జట్టు శక్తిసామర్థ్యాలు తనకు తెలుసునని, తమ ముందు పెద్ద సవాలు ఉందని అన్నాడు. ఉప ఖండంలో సిరీస్‌లు ఎప్పుడూ ఉత్కంఠ రేపుతాయని చెప్పాడు.

01/09/2017 - 00:32

న్యూఢిల్లీ, జనవరి 8: ఎడమచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, పార్ట్‌టైమ్ స్పిన్నర్ యువరాజ్ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచడం, ఇంగ్లాండ్‌తో జరిగే వనే్డతోపాటు టి-20 సిరీస్‌కు కూడా అతనిని ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెలక్టర్ల నిర్ణయం సరైనదేనా అన్న ప్రశ్న వినిపిస్తున్నది.

Pages