S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/08/2017 - 07:59

సిడ్నీ, జనవరి 7: పాకిస్తాన్‌తో జరిగిన చివరి, మూడో టెస్టును 220 పరుగుల భారీ తేడాతో గెల్చుకున్న ఆస్ట్రేలియా, ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 465 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన పాక్‌ను 244 పరుగులకే ఆలౌట్ చేసి, వైట్‌వాష్ చేసింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 538 పరుగులు సాధించగా, పాకిస్తాన్ 315 పరుగులు చేసింది.

01/07/2017 - 00:29

మూడు ఫార్మాట్స్‌లోనూ భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. ఇప్పటికే టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతనికి ధోనీ వైదొలగడంతో వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లోనూ పగ్గాలు లభించాయ. ఈ ఎంపికలో ఏమాత్రం ఆశ్చర్యం లేదని, ఇంతకంటే మెరుగైన ఎంపిక ఏముంటుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు.

01/07/2017 - 00:27

వనే్డ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్‌కీపర్), లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, యువరాజ్ సింగ్, ఆజింక్య రహానే, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.

01/07/2017 - 00:25

న్యూఢిల్లీ, జనవరి 6: ధోనీ తీసుకున్న నిర్ణయం సరైదేనని, అందులో విచిత్రంగానీ, దిగ్భ్రాంతి చెందాల్సిన అవసరంగానీ ఏమీ కనిపించడం లేదని భారత మాజీ కెప్టెన్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. 2019లో జరిగే ప్రపంచ కప్‌లో ఆడకూడదని ధోనీ అనుకొని ఉంటే, ఇప్పుడే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడాన్ని మించిన మంచి నిర్ణయం మరొకటి ఉండదని శుక్రవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు.

01/07/2017 - 00:24

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కీపింగ్‌లో పాఠాలు నేర్చుకుంటానని భారత టి-20 జట్టుకు ఎంపికైన ఢిల్లీ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం ప్రకటించిన టి-20 జట్టులోవ తనకు చోటు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందని పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. కీపర్‌గా ధోనీ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసునని అన్నాడు.

01/07/2017 - 00:23

ముంబయి: చాలాకాలంగా మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు శ్రమిస్తున్న యువరాజ్ సింగ్‌కు ఊరట లభించింది. అతనిని అటు వనే్డ, ఇటు టి-20 సిరీస్‌కు కూడా తీసుకున్నారు. ఈ రంజీ సీజన్‌లో యువీ కనబరచిన అద్వితీయ ప్రతిభే అతని ఎంపికకు కారణమైంది. ఈసారి రంజీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన అతను 84 సగటుతో 672 పరుగులు చేశాడు. తన ఫామ్‌పై గతంలో వచ్చిన విమర్శలు, అనుమానాలకు అతను బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.

01/07/2017 - 00:21

సిడ్నీ, జనవరి 5: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి, మూడో టెస్టులో పాకిస్తాన్ భారీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టంగా కనిపిస్తుండగా, ఓటమి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. విజయానికి పాక్ ఇంకా 410 పరుగులు సాధించాల్సి ఉండగా, తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నాయి.

01/07/2017 - 00:20

న్యూఢిల్లీ, జనవరి 6: తనకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీనే కెప్టెన్‌నని, ఈ విషయంలో తన అభిప్రాయం మారబోదని టెస్టు జట్టుతోపాటు వనే్డ, టి-20 ఫార్మాట్స్‌కు కూడా భారత సారథిగా పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ అన్నాడు. టీమిండియాకు అతని అవసరం ఎంతో ఉందని కోహ్లీ ట్వీట్ చేశాడు. ‘యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.

01/07/2017 - 00:19

ముంబయి: ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వనే్డ, మరో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లకు భారత జట్లలో సమర్థులకే పట్టం కట్టామని భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. యువరాజ్ సింగ్‌ను అతను ప్రత్యేకించి ప్రశంసల్లో ముంచెత్తాడు. మంచి ఫామ్‌లో ఉన్నందుకే అతనిని ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కు ఎంపిక చేశామని అన్నాడు. రెండు ఫార్మాట్స్‌లోనూ అద్భుతంగా రాణించే శక్తి అతనికి ఉందన్నాడు.

01/07/2017 - 00:17

ముంబయి: జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుందా? లేదా? ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగే వనే్డ, టి-20 సిరీస్‌లకు జట్లను ఎంపిక చేయవచ్చా? ఒకవేళ జట్లను ప్రకటిస్తే, అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందా? అన్న ప్రశ్నలు వేధించిన నేపథ్యంలో, చివరి వరకూ ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.

Pages