S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/07/2017 - 00:17

న్యూఢిల్లీ, జనవరి 6: రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ రాణించినప్పటికీ, ప్రో రెజ్లింగ్‌లో భాగంగా జైపూర్ నింజాస్‌తో తలపడిన ఢిల్లీ సుల్తాన్స్ జట్టు 3-4 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 58 కిలోల విభాగంలో పోటీపడిన సాక్షి మన దేశానికే చెందిన పూజా దండాను సునాయాసంగా ఓడించింది.

01/07/2017 - 00:16

వౌంట్ మాంగునుయ్, జనవరి 6: కొలిన్ మున్రో సెంచరీతో రాణించడంతో, బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన రెండో టి-20 మ్యాచ్‌ని 47 పరుగుల తేడాతో గెల్చుకున్న న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 195 పరుగులు సాధించింది.

01/07/2017 - 00:16

సిడ్నీ, జనవరి 6: ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ మాట్ రెన్షాకు ఒకదాని తర్వాత మరొకటిగా బలమైన గాయాలు తగులుతున్నాయి. పాకిస్తాన్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మహమ్మద్ ఆమీర్ వేసిన బౌన్సర్ మెరుపు వేగంతో వచ్చి రెన్షా హెల్మెట్‌కు తగిలింది. తలకు గాయం కాకపోయినా, బంతి వేగం దెబ్బకు తలదిమెత్తిపోయింది. బ్యాటింగ్‌లోనేకాదు..

01/06/2017 - 02:36

రాజ్‌కోట్, జనవరి 5: రంజీ ట్రోఫీ కెరీర్‌లో పృథ్వీరాజ్ తొలి సెంచరీని నమోదు చేయగా, తమిళనాడుతో జరిగిన సెమీ ఫైనల్‌ను ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న ముంబయ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేయగా, ముంబయి 411 పరుగులు సాధించి, 106 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది.

01/06/2017 - 00:17

న్యూఢిల్లీ, జనవరి 5: వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న ధోనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు భారత జాతీయ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని ధోనీని ప్రశంసించాడు. ఈ నెల 15 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే వనే్డ సిరీస్‌ను ప్రస్తావిస్తూ, దీని ప్రారంభానికి ముందే ధోనీ తన నిర్ణయాన్ని ప్రకటించడాన్ని అతను సమర్థించాడు.

01/06/2017 - 00:16

న్యూఢిల్లీ, జనవరి 5: అత్యంత అవమానకరమైన రీతిలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన ఎన్. శ్రీనివాసన్ చాలాకాలం తర్వాత మళ్లీ తెరపై ప్రత్యక్షమయ్యాడు. లోధా కమిటీ సిఫార్సుల నేపథ్యంలో, బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలపై సుప్రీం కోర్టు వేటు వేసిన నేపథ్యంలో, శనివారం బెంగళూరులో ఒక అనధికార సమావేశాన్ని శ్రీనివాసన్ ఏర్పాటు చేశాడు.

01/06/2017 - 00:14

న్యూఢిల్లీ, జనవరి 5: భారత వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో భారత జట్టుకు నాయకత్వ బాధ్యతల నుంచి మాత్రమే ధోనీ వైదొలిగాడని, ఈ రెండు విభాగాల్లోనూ ఆటగాడిగా కొనసాగాలని అతను నిర్ణయించుకోవడం హర్షణీయమని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ఒకవేళ ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించివుంటే, రోడ్డుపైకి వచ్చి ధర్నాచేసి ఉండేవాడినని వ్యాఖ్యానించాడు.

01/06/2017 - 00:12

ముంబయి, జనవరి 5: ఇంగ్లాండ్‌తో జరిగే వనే్డ, టి-20 సిరీస్‌లకు భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ శుక్రవారం ఎంపిక చేస్తుంది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో సెలక్షన్ ప్యానెల్‌నుంచి గగన్ ఖోడా, జతిన్ పరఅంజపే తమ స్థానాలను కోల్పోయిన విషయం తెలిసిందే. దీనితో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన మిగతా సెలక్టర్లు సమావేశమై టీమిండియాను ఎంపిక చేస్తారు.

01/06/2017 - 00:11

చెన్నై, జనవరి 5: రిటైర్మెంట్ ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ స్పష్టం చేశాడు. ఇక్కడ జరుగుతున్న చెన్నై ఓపెన్ పురుషుల డబుల్స్‌లో అతను బ్రెజిల్ ఆటగాడు ఆండ్రె సాతో కలిసి ఆడుతున్నాడు. మొదటి రౌండ్‌లో భారత్‌కు చెందిన పురవ్ రాజా, దివిజ్ శరణ్ జోడీని ఓడించిన 43 ఏళ్ల పేస్ పిటిఐతో మాట్లాడుతూ వచ్చే ఏడాది కూడా తాను చెన్నై ఓపెన్‌లో ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు.

01/06/2017 - 00:10

న్యూఢిల్లీ, జనవరి 5: రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్‌కు శుక్రవారం స్వదేశంలో తొలి సవాలు ఎదురుకానుంది. ప్రో రెజ్లింగ్‌లో సాక్షి ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ ఏసర్స్‌కు శుక్రవారం నాటి పోరులో పటిష్టమైన జైపూర్ నింజాస్ నుంచి గట్టిపోటీ తప్పదని విశే్లషకులు సైతం అంటున్నారు.

Pages