S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/06/2016 - 01:40

పారిస్, నవంబర్ 5: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌కు ఇక్కడ జరుగుతున్న పారిస్ మాస్టర్స్‌లో చుక్కెదురైంది. ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయి బాధపడుతున్న జొకోవిచ్‌పై క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిక్ క్వార్టర్ ఫైనల్‌ను 6-4, 7-6 తేడాతో గెల్చుకొని సంచలనం సృష్టించాడు. ఈ ఓటమి జొకోవిచ్‌ను టోర్నీ నుంచి దూరం చేయడమేగాక, నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడేసింది.

11/06/2016 - 01:38

సింగపూర్, నవంబర్ 5: కామనె్వల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత వీరుడు సందీప్ తోమర్ చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని సాధించాడు. పురుషుల 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో తోమర్ 6-0 తేడాతో పాక్ రెజ్లర్ మహమ్మద్ బిలాల్‌ను 6-0 తేడాతో చిత్తుచేసి స్వర్ణ పతకం సాధించాడు.

11/06/2016 - 01:37

కొజికోడ్, నవంబర్ 5: మలబార్ క్రిస్టియన్ కాలేజీలో చరిత్ర శాఖాధిపతి వశిష్ఠ్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న క్రికెట్ లైబ్రరీ ఆసక్తి రేపుతున్నది. అభిమానులను ఆకట్టుకుంటున్నది. దేశంలోనే ఒక క్రీడకు సంబంధించిన లైబ్రరీని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

11/06/2016 - 01:36

న్యూఢిల్లీ, నవంబర్ 5: సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, లోధా కమిటీకి భారత క్రికె ట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శనివారం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. లోధా కమిటీ చే సిన సిఫార్సుల అమలుపై అభ్యంతరాలను తెలపాలంటూ సుప్రీం కోర్టు ఇది వ రకే బోర్డుకు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే బిసిసిఐ అధ్యక్షడు అనురాగ్ ఠాకూర్, కార్య దర్శి అజయ్ షిర్కే తమ అభ్యంతరాలను తెలుపుతూ అఫిడవిట్ ఇచ్చారు.

11/06/2016 - 01:35

పెర్త్, నవంబర్ 5: డీన్ ఎల్గార్, జీన్‌పాల్ డుమినీ శతకాలతో రాణించడంతో, ఆస్ట్రేలియా తో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ద క్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 390 పరుగులు చేసింది. ఎల్గాల్ 127 ప రుగులు చేయగా, డుమినీ 141 పరుగులు సాధించాడు.

11/05/2016 - 07:41

న్యూఢిల్లీ, నవంబర్ 4: దేశంలో క్రికెట్ పాలనా వ్యవహారాలు పారదర్శంగా ఉండేందుకు లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ఏ మాత్రం ఇష్టపడని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కొత్త ఎత్తుగడతో ముందుకు సాగాలని నిర్ణయించినట్టు స్పష్టమవుతున్నది. ఇంగ్లాండ్‌తో ఈనెల తొమ్మిది నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుతం ఖర్చులు చెల్లించే పరిస్థితులో లేమంటూ చేతులెత్తేసింది.

11/05/2016 - 07:39

సిడ్నీ, నవంబర్ 4: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఫిల్ హ్యూస్ మృతికి షాట్ ఎంపికలో అతను చేసిన పొరపాటే కారణమని న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన విచారణ అధికారి మైఖేల్ బర్నెస్ తన నివేదికలో స్పష్టం చేశాడు. 2014 నవంబర్ 25న సౌత్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్‌వేల్స్ జట్ల మధ్య షీఫీల్డ్ షీల్డ్ టోర్నీ మ్యాచ్ ఆరంభమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆస్ట్రేలియా 48.2 ఓవర్లలో రెండు వికెట్లకు 136 పరుగులు చేసింది.

11/05/2016 - 07:38

ముంబయి, నవంబర్ 4: భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ వైద్య చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్నాడు. న్యూజిలాండ్‌తో విశాఖపట్నంలో జరిగిన చివరి, ఐదో వనే్డ ఇంటర్నేషనల్‌లో ఆడుతున్నప్పుడు అతని తొడ కండరాలు చిట్లాయి. మందులతో ఫలితం ఉండదన్న అభిప్రాయంతో, నిపుణుల సలహా కోసం అతను ఇంగ్లాండ్ వెళతాడు. అక్కడ జరిపే పరీక్షల ఫలితాలను బట్టి శస్త్ర చికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకుంటారు.

11/05/2016 - 07:38

లాస్ వెగాస్, నవంబర్ 4: ఫిలిప్పీన్స్ బాక్సింగ్ సూపర్ స్టార్ మానీ పాక్వియానో శనివారం జెస్సీ వర్గాస్‌తో జరిగే డబ్ల్యుబివో వెల్టర్‌వెయిట్ ఫైట్‌కు సిద్ధమయ్యాడు. బహుశా అతని కెరీర్‌లో ఇదే చివరి ఫైట్. ఫిలిప్పీన్స్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత పాక్వియానో బాక్సింగ్ రింగ్‌లోకి దిగడంతో ఈ బౌట్ అందరినీ ఆకట్టుకుంటున్నది.

11/05/2016 - 07:38

న్యూఢిల్లీ, నవంబర్ 4: భారత్ పర్యటనలో ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ స్పష్టం చేశాడు. క్రికెటర్‌గా, కోచ్‌గా తనకు ఉన్న అనుభవంతో ఈ విషయాన్ని చెప్తున్నానని ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు చాలాకాలంగా ఫీల్డింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న రోడ్స్ శుక్రవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. టీమిండియాను భారత్‌లోనే ఎదుర్కోవడం అనుకున్నంత సులభం కాదన్నాడు.

Pages