S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/04/2017 - 01:18

న్యూఢిల్లీ, జనవరి 3: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలను ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేసి తీరాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తేల్చిచెప్పడంతో జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ పరిమాణం తగ్గనుంది.

01/04/2017 - 01:15

సిడ్నీ, జనవరి 3: పాకిస్తాన్‌తో మంగళవారం సిడ్నీలో ప్రారంభమైన మూడో టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మాథ్యూ రెన్షా పరుగుల వరద పారించారు. పాక్ బౌలర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వార్నర్ కేవలం 78 బంతుల్లోనే అత్యంత వేగవంతంగా శతకాన్ని పూర్తిచేసి అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో 18వ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

01/04/2017 - 01:14

న్యూఢిల్లీ, జనవరి 3: పదేళ్ల క్రితం దోహాలో జరిగిన ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని సాధించి, ఆ తర్వాత లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైనందుకు ఆ పతకాన్ని కోల్పోయిన మాజీ అథ్లెట్ శాంతి సౌందరాజన్ ఇప్పుడు ఈ వ్యవహారంలో భారత అథ్లెటిక్ సమాఖ్య, భారత ఒలింపిక్ సంఘంతో పాటు అధికారులపై మానవ హక్కుల ఉల్లంఘన కేసు దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.

01/04/2017 - 01:12

హైదరాబాద్, జనవరి 3: మోకాలి గాయంనుంచి కోలుకున్న తర్వాత తిరిగి మైదానంలోకి దిగిన ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఈ ఏడాది మార్చిలో జరిగే ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో పూర్తి ప్రతిభతో రాణించడానికి మంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు కావాలని అంటోంది. ‘నా మెరుగుదలపై నేను సంతోషంగా ఉన్నా. నా కదలికలు ఇప్పటికీ కాస్త తడబడుతున్నాయి.

01/04/2017 - 01:11

న్యూఢిల్లీ, జనవరి 3: శ్రీలంక రాజధాని కొలంబోలో వచ్చే నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న ఐసిసి మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో తలపడే 14 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టుకు స్టార్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ సారథ్యం వహించనుంది. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అజేయంగా టైటిల్‌ను నిలబెట్టుకున్న విషయం తెలిసిందే.

01/04/2017 - 01:10

న్యూఢిల్లీ, జనవరి 3: భారతీయ బాక్సింగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చీఫ్ కోచ్ పదవికి ఇద్దరిని ఎంపిక చేశారు. ద్రోణాచార్య పురస్కార గ్రహీత ఎస్‌ఆర్ సింగ్, మహిళల సబ్‌జూనియర్ మాజీ కోచ్ శివ్‌సింగ్‌లను పటియాల, ఔరంగాబాద్‌లలో విడివిడిగా నిర్వహించే శిబిరాలకు ఇన్‌చార్జిలుగా నియమించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు పురుషుల చీఫ్ కోచ్‌గా వ్యవహరించిన గురుబక్స్ సింగ్ సంధూ స్థానంలో ఈ ఇద్దరినీ నియమించారు.

01/04/2017 - 01:09

న్యూఢిల్లీ, జనవరి 3: కామనె్వల్త్ క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించిన మహిళా బాక్సర్ పింకీ జాంగ్రా ప్రపంచ మాజీ చాంపియన్ ఎల్.సరితా దేవి మాదిరిగా ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగు పెట్టాలని నిశ్చయించుకుంది. అయితే ఆమె అమెచ్యూర్ కెరీర్‌ను కూడా కొనసాగించాలని భావిస్తోంది. ‘ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి ప్రవేశించాలని నేను నిశ్చయించుకున్నా.

01/04/2017 - 01:07

సిలిగురి, జనవరి 3: శాఫ్ మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో వరుసగా నాలుగోసారి టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్ బుధవారం బంగ్లాదేశ్ జట్టుతో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. సిలిగురిలోని కాంచన్‌జంగా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

01/04/2017 - 01:06

చెన్నై, జనవరి 3: చాలా రోజుల తర్వాత మళ్లీ టెన్నిస్ బరిలోకి దిగిన భారత డేవిస్ కప్ జట్టు యువ ఆటగాడు యూకీ బాంబ్రీ తన పునరాగమనాన్ని ఘనంగా ప్రారంభించాడు. ఇక్కడ జరుగుతున్న చెన్నై ఓపెన్ ఎటిపి టోర్నమెంట్‌లో మంగళవారం అతను వరుస సెట్ల తేడాతో స్థానిక ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్‌ను మట్టికరిపించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ పోరులో బాంబ్రీ 6-1, 6-1 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు.

01/03/2017 - 00:47

న్యూఢిల్లీ, జనవరి 2: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు మొండికేసిన బిసిసిఐ పెద్దలపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొరడా ఝళిపించి పదవుల నుంచి ఉద్వాసన పలకడాన్ని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌ఎం.లోధా స్వాగతించారు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును క్రికెట్ సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.

Pages