S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/31/2016 - 00:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: తమ నిశ్చితార్థం జనవరి ఒకటోతేదీన ఉత్తరాఖండ్‌లో జరగనుందంటూ మీడియాలో వచ్చిన వార్తలను భారత స్టార్ క్రికెటర్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని వారు సోషల్ మీడియాలో తేల్చిచెప్పారు. ఎంగేజ్‌మెంట్ ఖాయమైతే, ఆ విషయాన్ని దాచుకోబోమని వారు స్పష్టం చేశారు.

12/31/2016 - 00:11

పోర్ట్ ఎలిజబెత్: పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ రిటైర్మెంట్ యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అతను కూడా ఈ విషయాన్ని సూచన ప్రాయంగా తెలపలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు, చివరి రోజున రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాక్ ఒక్క రోజులోనే పది వికెట్లను కోల్పోయి, అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కోగా, ఈ ఫలితాన్ని ఊహించలేదని మిస్బా ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు.

12/31/2016 - 00:10

మెల్బోర్న్, డిసెంబర్ 31: డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్న మ్యాచ్‌లో మెరుపు దెబ్బ తీసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 18 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ జరిగిన రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 443 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

12/31/2016 - 00:08

హైదరాబాద్, డిసెంబర్ 30: తన చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్‌తో పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని, ఆ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు అన్నది. ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) టోర్నీ ఆదివారం నుంచి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం కానుండగా, తొలి గేమ్‌లోనే సింధు (చెన్నై స్మాషర్స్), మారిన్ (హైదరాబాద్ హంటర్స్) ఢీ కొంటారు.

12/31/2016 - 00:07

సిడ్నీ, డిసెంబర్ 30: ఆస్ట్రేలియా టి-20 ఇంటర్నేషనల్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెస్పీ ఎంపికయ్యాడు. శ్రీలంకతో ఫిబ్రవరిలో జరిగే సిరీస్‌కు అతను సేవలు అందిస్తాడు. కోచ్ మరో మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఎంపిక చేసింది. అతనికి సహాయకుడిగా గిలెస్పీ ఉంటాడని ప్రకటించింది.

12/31/2016 - 00:05

పోర్ట్ ఎలిజబెత్, డిసెంబర్ 30: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టును దక్షిణాఫ్రికా 206 పరుగుల భారీ ఆధిక్యంతో సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆతర్వాత లంకను మొదటి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు కట్టడి చేసింది.

12/31/2016 - 00:05

వాషింగ్టన్, డిసెంబర్ 30: రెడిట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌తో నిశ్చితార్థంపై టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ వివరణ ఇచ్చింది. ఒహానియన్ తనకు ప్రపోజ్ చేశాడని, వెంటనే తాను అంగీకారం తెలిపానని ట్వీట్ చేసింది. ఒహానియన్ కూడా నిశ్చితార్థం వార్తను ధ్రువీకరించాడు. అయితే, వివాహం ఎప్పుడు జరుగుతుందనేది వీరిద్దరూ ప్రకటించలేదు.

12/30/2016 - 00:39

ఒకటిరెండు చేదు అనుభవాలను మినహాయిస్తే ఈ ఏడాది టీమిండియా ప్రస్థానం సంతృప్తికరంగానే సాగింది. స్వదేశంలో జరిగిన ఐసిసి టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను గెల్చుకోలేకపోవడం అభిమానులను నిరాశపరచినా, మొత్తం మీద అన్ని ఫార్మాట్స్‌లోనూ భారత్ మెరుగ్గానే ఆడింది. రికార్డులు సృష్టిస్తూ కొన్ని చిరస్మరణీయ విజయాలను నమోదు చేసింది.

12/30/2016 - 00:36

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: భారత స్టార్ క్రికెటర్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిశ్చితార్థం కొత్త సంవత్సరంలో జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని వీరిద్దరూ లేదా వీరి కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు. కోహ్లీ, అనుష్క ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో సెలవులను ఆస్వాదిస్తున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులుకూడా వారితోనే ఉన్నట్టు తెలుస్తోంది.

12/30/2016 - 00:35

మెల్బోర్న్, డిసెంబర్ 29: కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అజేయ శతకం చేయడంతో, పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 22 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాకిస్తాన్ 9 వికెట్లకు 443 పరుగుల భారీ స్కోరువద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.

Pages