S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/13/2016 - 00:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ముంబయిలో జరిగిన నాలుగో టెస్టులో డబుల్ సెంచరీ సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ప్రశంసల జల్లు కురిపించాడు.

12/13/2016 - 00:32

ముంబయి, డిసెంబర్ 12: ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా ముంబయిలో తమ జట్టు సాధించిన విజయం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ఇటీవలి కాలంలో తాము సాధించిన విజయాల్లో ఇదే ‘అత్యంత మధురమైన’ విజయమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హర్షాన్ని వ్యక్తం చేశాడు.

12/12/2016 - 02:07

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్, నాలుగో రోజు ఆటలో ఎనిమిదో వికెట్‌కు 241 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించిన జయంత్ యాదవ్, విరాట్ కోహ్లీ. ఇరవై ఏళ్ల క్రితం మహమ్మద్ అజరుద్దీన్, అనిల్ కుంబ్లే దక్షిణాఫ్రికాపై ఎనిమిదో వికెట్‌కు 161 పరుగులు చేయగా, జయంత్, కోహ్లీ ఆ రికార్డును అధిగమించారు.

12/12/2016 - 00:33

ముంబయి, డిసెంబర్ 11: విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో కదంతొక్కితే, జట్టులోకి కొత్తగా వచ్చిన ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్ శతకాన్ని నమోదు చేశాడు. అంతకు ముందు, మ్యాచ్ మూడోరోజు ఆటలో మురళీ విజయ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ముగ్గురు బ్యాట్స్‌మెన్ అద్వితీయ ప్రతిభ కనబరచడంతో, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగు రోజు ఆటలో భారత్ 631 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.

12/12/2016 - 00:31

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 130.1 ఓవర్లలో 400 ఆలౌట్ (అలస్టర్ కుక్ 46, కీటన్ జెన్నింగ్స్ 112, మోయిన్ అలీ 50, జొస్ బట్లర్ 76, అశ్విన్ 6/112, రవీంద్ర జడేజా 4/109).

12/12/2016 - 00:30

ముంబయి: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్, నాలుగో రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ నమోదు చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా అతనికి ఇది మూడో డబుల్ సెంచరీ. మూడు పర్యాయాలు డబుల్ సెంచరీలు చేసిన తొలి భారతీయ కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

12/12/2016 - 00:26

ముంబయ: ఈ మ్యాచ్‌తోనే తన టెస్టు క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, రెండో ఇన్నింగ్స్‌లో సున్నాకే వెనుదిరిగాడు. ఈ విధంగా తమతమ మొదటి ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, మరో ఇన్నింగ్స్‌లో డకౌటైన నాలుగో బ్యాట్స్‌మన్‌గా అతని పేరు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది.

12/12/2016 - 00:25

ముంబయి, డిసెంబర్ 11: భారత క్రికెట్ జట్టును గాయాల సమస్య వేధిస్తున్నది. ఆజింక్య రహానే ఇంగ్లాండ్‌తో జరుతున్న టెస్టు సిరీస్‌తోపాటు, ఆతర్వాత జరిగే వనే్డ, టి-20 సిరీస్‌లకు కూడా గాయం కారణంగా అందుబాటులో ఉండడం లేదు. తాజాగా ఈ జాబితాలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా చేరారు. గాయాలతో బాధపడుతున్న వీరిద్దరూ నాలుగో టెస్టులో ఆడలేకపోయిన విషయం తెలిసిందే.

12/12/2016 - 00:23

స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్‌ఎఫ్‌ఎ) ఆధ్వర్యంలో ఆదివారం ముంబయిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్న భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

12/12/2016 - 00:20

గౌహతిలో జరుగుతున్న జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్
60 కిలోల విభాగం క్వార్టర్ ఫైనల్లో అశోక్‌ను ఓడించి
సెమీస్ చేరడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకున్న ఒలింపియన్ శివ థాపా (ఎడమ)

Pages