S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/28/2016 - 00:30

మెల్బోర్న్, నవంబర్ 27: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది. మూడో స్థానానికి జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు మలేసియాను 4-1 తేడాతో చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ భారత్ ఆధిపత్యం కొనసాగితే, మలేసియా గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే బీరేంద్ర లాక్రా భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు.

11/28/2016 - 00:29

మొహాలీ, నవంబర్ 27: ఇంగ్లిండ్‌తో వచ్చేనెల ఎనిమిదో తేదీ నుంచి మొదలయ్యే నాలుగో టెస్టుకు ఓపెనర్ లోకేష్ రాహుల్ అందుబాటులో ఉంటాడని బిసిసిఐ ధీమా వ్యక్తం చేస్తున్నది. ఎడమ చేతికి గాయమైన కారణంగా అతను మూడో టెస్టులో ఆడడం లేదు. అయితే, వైద్య పరీక్షల అనంతరం అతను త్వరగానే కోలుకునే అవకాశాలున్నట్టు తెలిసిందని బిసిసిఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

11/28/2016 - 00:29

కౌలూన్, నవంబర్ 27: హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళలు, పురుషుల విభాగాల్లో జరిగిన ఫైనల్స్‌లో భారత స్టార్లు పివి సింధు, సమీర్ వర్మ తడబడ్డారు. ఆఖరి యుద్ధాన్ని జయించలేక, రజత పతకాలతో సంతృప్తి చెందారు. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు వరుస సెట్లలో ఓడితే, జాతీయ చాంపియన్ సమీర్ ఒక సెట్‌ను గెల్చుకొని, మ్యాచ్‌ని మూడు సెట్ల వరకు తీసుకెళ్లాడు.

11/28/2016 - 00:29

మెల్బోర్న్, నవంబర్ 27: ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన భారత మహిళల హాకీ జట్టు ఆదివారం జరిగిన చివరి, మూడో టెస్టులో 1-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ సిరీస్‌లో చెరొక విజయాన్ని సాధించిన భారత్, ఆస్ట్రేలియా మహిళలు చివరి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు బరిలోకి దిగారు. ఇరు జట్లు వ్యూహాత్మకంగా ఆడడంతో మొదటి క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

11/28/2016 - 00:28

అడెలైడ్, నవంబర్ 27: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి, మూడో టెస్టును ఏడు వికెట్ల తేడాతో గెలు కున్న ఆస్ట్రేలియా పరువు నిలబెట్టుకుంది. ప్రత్యర్థి చేతిలో వైట్‌వాష్ వేయంచుకునే దుస్థితి నుంచి బ యటపడింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 259 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు సాధించింది.

11/28/2016 - 00:28

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత బాక్సర్ వికాస్ క్రిష్ణకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) అవార్డు లభించనుంది. వచ్చేనెల 20న జరిగే వార్షిక సమావేశంలో ‘ఉత్తమ బాక్సర్’ అవార్డును బహూకరిస్తామని వికాస్‌కు రాసిన లేఖలో ఎఐబిఎ తెలిపింది.

11/28/2016 - 00:27

హామిల్టన్, నవంబర్ 27: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో బాబర్ ఆజమ్ ఆదుకోవడంతో పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 216 పరుగులు చేయగలిగింది. అయితే, న్యూజిలాండ్ కంటే 55 పరుగులు వెనుకంజలో నిలిచింది. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 76 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

11/27/2016 - 07:43

కౌలూన్, నవంబర్ 26: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో భారత యువ ఆటగాడు సమీర్ వర్మ సంచలనం సృష్టించాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి, ఒక్కో అడ్డంకిని సమర్థంగా అధిమిస్తూ ముందుకు సాగుతున్న అతనికి సెమీ ఫైనల్‌లో మూడోసీడ్ ఆటగాడు జాన్ ఒ జొర్గెనె్సన్ ఎదురయ్యాడు.

11/27/2016 - 07:40

బ్యాంకాక్, నవంబర్ 26: మహిళల ఆసియా కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఈ జట్టు 64 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. వనే్డ ఫార్మాట్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న మిథాలీ రాజ్ 49 పరుగులతో నాటౌట్‌గా నలవగా, స్మృతి మందానా 41 పరుగులు చేసి, భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించింది.

11/27/2016 - 07:40

మొహాలీ, నవంబర్ 26: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శనివారం ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజు ఆటలో సంకుల సమరం కొనసాగింది. భారత బౌలింగ్, ఇంగ్లాండ్ బ్యాటింగ్ మధ్య పోరు రసవత్తరంగా జరిగింది. ఇంగ్లాండ్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. బెన్ స్టోక్స్‌తో కలిసి ఐదో వికెట్‌కు 57, జొస్ బట్లర్‌తో కలిసి ఆరో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాలను అందించాడు.

Pages