S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/09/2016 - 00:44

న్యూఢిల్లీ, నవంబర్ 8: భారత బాక్సింగ్ స్టార్ విజేందర్ సింగ్ తన డబ్ల్యుఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు డిసెంబర్ 17న ఇక్కడ పోటీ పడనున్నాడు. అయితే అతని ప్రత్యర్థి ఎవరనేది ఆ తర్వాత నిర్ణయిస్తారు.

11/09/2016 - 00:44

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పదో ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి వచ్చే నెల బెంగళూరులో ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 10 సంవత్సరాల కాంట్రాక్టులో ఇదే చిట్టచివరి ఎడిషన్.

11/08/2016 - 00:40

న్యూఢిల్లీ, నవంబర్ 7: ద్వైపాక్షిక అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇక్కడ బ్రిటిష్ ప్రధాని థెరిస్సా మేతో చర్చలు జరిపారు. టీమిండియాతో బుధవారం నుంచి టెస్టు సిరీస్‌లో తలపడబోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు మోదీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 9వ తేదీ నుంచి భారత జట్టుతో తొలి టెస్టు ఆడబోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

11/08/2016 - 00:38

న్యూఢిల్లీ, నవంబర్ 7: భారత పేస్ బౌలర్ ఇశాంత్ శర్మ ప్రతిభావంతుడైన ఆటగాడే అయినప్పటికీ వికెట్లు సాధించేలా మరింత నిలకడగా బంతులు వేయడం ఎలాగో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

11/08/2016 - 00:35

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 7: విశాఖలో తొలిసారిగా నిర్వహించే క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌ను అద్వితీయమైన రీతిలో నిర్వహించాలని ఆంధ్రా క్రికెట్ సంఘం తీర్మానించింది. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ నెల 17 నుంచి జరిగే సిరీస్‌లోని రెండవ టెస్ట్‌మ్యాచ్‌కు వరకు ఏసిఏ-విడిసిఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

11/08/2016 - 00:33

పెర్త్, నవంబర్ 7: ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లోని డబ్ల్యుఎసిఎ (వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్) మైదానంలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా వర్థమాన పేస్ బౌలర్ కిగాసో రబాడా చక్కగా రాణించి 5 వికెట్లను కైవసం చేసుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 177 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఈ సిరీస్‌లో బోణీ చేసింది.

11/08/2016 - 00:31

న్యూఢిల్లీ, నవంబర్ 7: కామనె్వల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఆదివారం ఇక్కడ భారత్ ఎనిమిది పసిడి పతకాలతో పాటు మరో ఎనిమిది రజత పతకాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఫ్రీస్టయిల్ విభాగంలో హర్ఫుల్, బజరంగ్, జితేందర్, సందీప్, దీపక్, అరుణ్, గ్రీకో-రోమన్ విభాగంలో రవీందర్, క్రిషన్, సచిన్ భారత్‌కు పసిడి పతకాలను అందించారు.
ఫలితాలు

11/08/2016 - 00:30

న్యూఢిల్లీ, నవంబర్ 7: చైనాలోని జియాన్‌లో ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు జరిగిన సాండా ప్రపంచ కప్ ఎనిమిదో ఎడిషన్‌లో భారత ఉషు జట్టు ఐదు పతకాలను కైవసం చేసుకుంది. వీటిలో నాలుగు రజత పతకాలు, మరో కాంస్య పతకం ఉన్నాయి. గత ఏడాది ప్రపంచ ఉషు చాంపియన్‌షిప్ 13వ ఎడిషన్‌లో సత్తా చాటుకున్న 80 మంది ఉత్తమ సాండా ప్లేయర్లు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో భారత్‌కు ఐదుగురు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు.

11/08/2016 - 00:29

న్యూఢిల్లీ, నవంబర్ 7: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన అంశాల గురించి చర్చించేందుకు ఐపిఎల్ పాలక మండలి మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం కానుంది.

11/08/2016 - 00:29

చిత్రం.. ముంబయలో సోమవారం ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ ‘ప్యూమా’ నిర్వహించిన ఒక కార్య క్రమంలో సందడి చేస్తున్న రెజ్లర్ సాక్షి మాలిక్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Pages