S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/02/2016 - 02:11

మీర్పూర్, ఫిబ్రవరి 1: వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ విజృంభించి 24 బంతుల్లోనే 78 పరుగులు సాధించడంతో, అండర్-19 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తుచేసింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత్ చివరి లీగ్ పోటీని వామప్ మ్యాచ్‌గా స్వీకరించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 48 ఓవర్లలో 169 పరుగులు సాధించింది.

02/01/2016 - 06:58

సిడ్నీ, జనవరి 31: ఆస్ట్రేలియా చేతిలో వనే్డ సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయిన భారత క్రికెట్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని ఈ జట్టు టి-20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. చివరి క్షణం వరకూ విజయం కోసం ప్రయత్నించినప్పటికీ ఆస్ట్రేలియాకు వైట్‌వాష్ తప్పలేదు. చివరి బంతిని ఫోర్‌గా మలచిన సురేష్ రైనా విన్నింగ్ షాట్‌తో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.

02/01/2016 - 06:55

మెల్బోర్న్, జనవరి 31: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పరుషుల సింగిల్స్ ఫైనల్‌లో అతను బ్రిటిష్ ఆటగాడు, రెండో సీడ్ ఆండీ ముర్రేను 6-1, 7-5, 7-6 ఆధిక్యంతో ఓడించాడు. మొదటి సెట్‌ను సులభంగానే గెల్చుకున్న జొకోవిచ్‌కు తర్వాతి రెండు సెట్లలో ముర్రే నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది.

02/01/2016 - 06:52

చిట్టగాంగ్, జనవరి 31: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 262 పరుగుల భారీ స్కోరుతో ఫిజీని చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 340 పరుగులు సాధించింది. షమెర్ స్ప్రింగర్ 106 పరుగులతో కదంతొక్కగా, గిడ్రాన్ పోప్ 76, జైదీ గులీ (66) అర్ధ శతకాలతో రాణించారు. ఫిజీ బౌలర్లలో కొకాక తికోస్వా 59 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.

02/01/2016 - 06:51

లక్నో, జనవరి 31: మహిళల సింగిల్స్ టైటిల్‌ను రెండో సీడ్ సంగ్ జి హ్యున్ తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె ఐదో ర్యాంక్‌లో ఉన్న సయాకా సటోపై 12-21, 21-18, 21-18 ఆధిక్యంతో గెలుపొందింది. మొదటి సెట్‌ను కోల్పోయిన హ్యున్ ఆతర్వాత ఎదురుదాడికి దిగింది. సయాకా నుంచి తీవ్ర స్థాయిలో పోటీ ఎదురైనప్పటికీ సమర్థంగా ఎదురునిలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

02/01/2016 - 06:50

లక్నో, జనవరి 31: ప్రతిష్ఠాత్మక సయ్యద్ మోదీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను తెలుగు వీరుడు, టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. బాబూ బనారసీ దాస్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో అతను హుయాంగ్ యూజియాంగ్‌ను 21-13, 14-21, 21-14 తేడాతో ఓడించాడు. సుమారు గంట సేపు జరిగిన పోరులో మొదటి సెట్‌ను సులభంగానే గెల్చుకున్న శ్రీకాంత్‌కు రెండో సెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది.

01/31/2016 - 18:13

సిడ్ని : ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ-ట్వంటీ క్రికెట్ మ్యాచ్‌లో బారత్ విజయబావుటా ఎగరేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీ చివరి బంతికి భారత్ విజయాన్ని సాధించింది. తొలి రెండు పోటీల్లో నెగ్గిన భారత్ చివరి మ్యాచ్‌లోనూ ప్రతిభచూపింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 198 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది.

01/31/2016 - 07:34

ఈ రోజు కోసం నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. ఇది నా జీవితకాల స్వప్నం. ఇకపై నేను కూడా గ్రాండ్ శ్లామ్ విజేతనని గుర్వంగా చెప్పుకోగలుగుతాను. మాజీ చాంపియన్ స్ట్ఫె గ్రాఫ్‌ను ఆదర్శంగా తీసుకొని నేను చాలా కష్టపడ్డాను. ఇన్నాళ్లకు నా కల ఫలించింది. నా కెరీర్‌లో ఈ రెండు వారాలు అత్యుత్తమమైనవి. ఈ విజయం నాకు చిరస్మరణీయమైనది.
- ఏంజెలిక్ కెర్బర్

01/31/2016 - 07:32

విశాఖపట్నం (స్పోర్ట్స్), జనవరి 30: విశాఖలోని పోర్టు స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ప్రోకబడ్డీ టోర్నమెంట్ తొలిమ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టుపై యు ముంబా జట్టు ఘన విజయాన్ని సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ చివరి వరకూ పోరాడి ఓటమిని చవిచూసింది. ఆట సగభాగం పూర్తయ్యే సమయానికి తెలుగు టైటాన్స్ ఎనిమిది పాయింట్లతో, ముంబా జట్టు 18 పాయింట్లతో నిలిచాయి.

01/31/2016 - 07:31

మెల్బోర్న్, జనవరి 30: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ పురుషుల ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌ను ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నానని బ్రిటిష్ ఆటగాడు, రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే స్పష్టం చేశాడు. గతంలో ఎదుర్కొన్న పరాజయాలుగానీ, గణాంకాలుగానీ ముఖ్యంకాదని, ఎవరికైనా ప్రతి మ్యాచ్ కొత్త పోరాటమేనని అన్నాడు.

Pages