S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/28/2016 - 04:21

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రాల జాబితాలో ఉన్న క్రీడలను ఉమ్మడి జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ అన్నారు. జాతీయ క్రీడా సమాఖ్యల (ఎన్‌ఎస్‌ఎఫ్) ప్రతినిధులతో గురువారం ఇక్కడ సమావేశమైన గోయల్ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రాల పరిధి నుంచి క్రీడలను తప్పించి, ఉమ్మడి జాబితాలోకి చేర్చడం మంచిదని అభిప్రాయపడ్డారు.

10/28/2016 - 04:19

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 27: ఈనెల 29 విశాఖ వేదికగా జరిగే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో తలపడేందుకు భారత్, న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు గురువారం నగరానికి చేరుకున్నారు. చార్టర్ ఫ్లయిట్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు వచ్చిన ఇరు జట్లకు ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రతినిధులు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి వసతి ఏర్పాటు చేసిన నోవాటెల్ హోటల్‌కు చేర్చారు.

10/28/2016 - 04:17

రాంచీ, అక్టోబర్ 27: క్రీజ్‌లో నిలబడి, వేగంగా పరుగులు రాబట్టి, లక్ష్యాన్ని ఛేదించడం అనుకున్నంత సులభం కాదని భారత వనే్డ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. ఎన్నో కీలక సమయాల్లో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలను అందించిన ధోనీకి ‘బెస్ట్ ఫినిషర్’ అన్న పేరు ఉంది. కానీ, కొంతకాలంగా అతను విఫలం కావడం విమర్శలకు తావిస్తున్నది.

10/28/2016 - 04:16

కువాంటన్, అక్టోబర్ 27: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ సెమీ ఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ మరోసారి తలపడే అవకాశానికి తెరపడింది. చైనాతో గురువారం జరిగిన మ్యాచ్‌ని పాకిస్తాన్ గెల్చుకోగా, కొరియా, మలేసియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.

10/28/2016 - 04:15

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 27: భారత డిఫెండర్ సురేందర్ కుమార్‌పై రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ వేటు పడింది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో ఆడుతున్న సురేందర్ మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని, అందుకే అతనిని రెండు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఆసియా హాకీ సమాఖ్య సాంకేతిక విభాగం పరిశీలకుడు రమేష్ అప్పూ ఒక ప్రకటనలో తెలిపాడు.

10/28/2016 - 04:13

లాసనే్న, అక్టోబర్ 27: లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను సాధించిన ముగ్గురు కజకిస్థాన్ మహిళా వెయట్‌లిఫ్టర్లు డోప్ పరీక్షలో పట్టుబడ్డారు. వారు సాధించిన పతకాలను వాపసు తీసుకుంటున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) ప్రకటించింది.

10/28/2016 - 04:13

వలెన్షియా, అక్టోబర్ 27: ఇక్కడ జరుగుతున్న నాలుగు దేశాల జూనియర్ ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు తన రెండో మ్యాచ్‌ని చేజార్చుకుంది. మొదటి మ్యాచ్‌లో బలమైన జర్మనీని 3-1 తేడాతో ఓడించిన భారత యువ జట్టు రెండో మ్యాచ్‌లో బెల్జియం చేతిలో పరాజయాన్ని చవిచూసింది. భారత్ రెండు గోల్స్ చేయగా, బెల్జియం నాలుగు గోల్స్ సాధించి విజయభేరి మోగించింది.

10/28/2016 - 04:12

కరాచీ, అక్టోబర్ 27: భారత్‌కు జూనియర్ హాకీ జట్టును పంపాలా? వద్దా? అన్నది తేల్చాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పిహెచ్‌ఎఫ్) లేఖ రాసింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) జూనియర్ ప్రపంచ కప్ పోటీలు ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 18వ తేదీ వరకు లక్నోలో జరగనున్నాయి.

10/28/2016 - 04:12

పారిస్, అక్టోబర్ 27: ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు సాయి ప్రణీత్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. అయితే, అతను కనబరచిన పోరాటపటిమ అభిమానులను ఆకట్టుకుంది. కొరియాకు చెందిన లీ హ్యున్ ఈతో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ శ్రమించి అతను 21-15, 8-21, 19-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.

10/27/2016 - 07:25

రాంచీ, అక్టోబర్ 26: సొంత గడ్డపై భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన నాలుగో వనే్డలో భారత్ 19 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 261 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా బ్యాట్స్‌మెన్ నిలకడలేమి కారణంగానే విఫలమయ్యారు.

Pages