S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/03/2016 - 07:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: లండన్ ఒలింపిక్స్‌లో మరో డోప్‌కేసు బయట పడడంతో, భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్‌ను అదృష్టం వరించి, స్వర్ణ పతకం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయ. 2012 లండన్ ఒ లింపిక్స్ పురుషుల రెజ్లింగ్ 60 కిలోల విభా గంలో యోగేశ్వర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

09/03/2016 - 07:55

కింగ్‌స్టన్, సెప్టెంబర్ 2: రియో ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొని, ఒకానొక దశలో ఆ మెగా ఈవెంట్‌లో పాల్గొనడమే అనుమానంగా కనిపించినప్పటికీ, మూడు స్వర్ణ పతకాలను సాధించి సత్తాచాటిన జమైకా స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్ ఎలాంటి చడీచప్పుడు లేకుండా కింగ్‌స్టన్ చేరాడు.

09/03/2016 - 07:55

ముంబయి, సెప్టెంబర్ 2: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన బాడ్మింటన్ స్టార్ పివి సింధును మహారాష్ట్ర బాడ్మింటన్ సంఘం (ఎంబిఎ) శుక్రవారం ఘనంగా సన్మానించింది. సింధును, జాతీయ బాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌ను సత్కరించిన అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింప చేసిన వారిని గౌరవించడం మన ధర్మమని అన్నారు.

09/03/2016 - 07:54

సిడ్నీ, సెప్టెంబర్ 2: ఆస్ట్రేలియా క్రికెట్‌లో కురువృద్ధుడు లెన్ మాడోక్స్ మృతి చెందాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌గా అతను 1954-56 మధ్యకాలంలో ఆస్ట్రేలియాకు ఏడు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. రిటైర్మెంట్ తర్వాత, 1977లో ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లిన ఆసీస్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించాడు.

09/03/2016 - 07:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: తన భర్తపై విమర్శలు గుప్పిస్తూ, వేధించడాన్ని మానుకోవాలని భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య మాయంతి లాంగర్ ట్వీట్ చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారు సంతోషిస్తారేమోగానీ, బాధితులు, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి దుర్భరంగా ఉంటుందని టీవీ ప్రెజెంటర్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆమె పేర్కొంది. పనిలేని వారు ఉద్దేశపూర్వకంగా స్టువర్ట్‌ను వేధిస్తున్నారని ఆరోపించింది.

09/03/2016 - 07:53

మెండోజా (అర్జెంటీనా), సెప్టెంబర్ 2: ప్రపంచ కప్ సాకర్ క్వాలిఫయర్స్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ఉరుగ్వేపై తన జట్టుకు విజయాన్ని అందించాడు. అతను కీలక గోల్ చేయడంతో ఉరుగ్వేను అర్జెంటీనా 1-0 తేడాతో ఓడించింది. అర్జెంటీనా జాతీయ సాకర్ జట్టుకు ఇకపై ప్రాతినిథ్యం వహించబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మనసు మార్చుకొని మళ్లీ జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

09/02/2016 - 04:30

న్యూయార్క్, సెప్టెంబర్ 1: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న గార్బెన్ ముగురుజా యుఎస్ ఓపెన్ రెండో రౌండ్ నుంచే నిష్క్రమించింది. రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించాలన్న ఆమె కల సాకారం కాలేదు.

09/02/2016 - 02:03

న్యూయార్క్, సెప్టెంబర్ 1: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్ మ్యాచ్ ఆడకుండానే అతను ముందంజ వేశాడు. జొకోవిచ్‌తో తలపడాల్సిన జిరి వెసెలీ గాయం కారణంగా వైదొలిగాడు.

09/02/2016 - 02:01

న్యూయార్క్, సెప్టెంబర్ 1: యుఎస్ ఓపెన్‌లో ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్లు రోహన్ బొపన్న, లియాండర్ పేస్, సానియా మీర్జా తమతమ విభాగాల్లో శుభారంభం చేశారు. డెన్మార్క్‌కు చెందిన ఫ్రెడెరిక్ నీల్సన్‌తో కలిసి పురుషుల డబుల్స్ ఆడుతున్న బొపన్న 6-3, 6-7, 6-3 స్కోరుతో రాడెక్ స్టెపానెక్, నెనాద్ జిమోజిక్ జోడీని ఓడించాడు.

09/02/2016 - 01:59

న్యూయార్క్, సెప్టెంబర్ 1: ‘జెయింట్ కిల్లర్’ మిలోస్ రోనిక్ యుఎస్ ఓపెన్ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న అతను క్వాలిఫయర్ ర్యాన్ బారిసన్‌ను ఢీకొని, 7-6, 5-7, 5-7, 1-6 తేడాతో ఓటమిపాలయ్యాడు.

Pages