S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/30/2016 - 03:42

రాజీవ్ ఖేల్ రత్న: సింధు (బాడ్మింటన్), సాక్షి మాలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్).
ద్రోణాచార్య: కోచ్‌లు బిశే్వస్వర్ నంది (జిమ్నాస్టిక్స్), రాజ్ కుమార్ శర్మ (క్రికెట్), నాగపురి రమేష్ (అథ్లెటిక్స్), సాగర్ మల్ ధయాల్ (బాక్సింగ్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్/ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్), మహాబిర్ సింగ్ (రెజ్లింగ్/ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్).

08/30/2016 - 03:41

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రాజీల్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న రోజే సిం ధుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమెను కమాండెంట్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని సిఆర్‌పిఎఫ్ నిర్ణయంచింది. కేంద్ర ప్రభు త్వానికి ఈ ప్రతిపాదన పంపింది. అక్కడి నుంచి అనుమతి లభించిన వెం టనే సింధు నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.

08/30/2016 - 03:40

న్యూఢిల్లీ, ఆగస్టు 29: భారత రెజ్లర్ వినేష్ ఫొగట్ సోమవారం అర్జున అవార్డును స్వీకరించడానికి వీల్‌చైర్‌లో వచ్చింది. నలుగురు ఒలింపియన్లు రాజీవ్ ఖేల్ రత్న అవార్డును స్వీకరించగా, ఆ దృశ్యాన్ని చూస్తూ కన్నీరు పెట్టుకుంది. మోకాలికి గాయం కాకుండా ఉంటే, ఆమెకు రియో ఒలింపిక్స్‌లో పతకం తప్పక లభించేదని విశే్లషకుల అభిప్రాయం. కానీ, ఆమె గాయంతో బౌట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

08/30/2016 - 03:38

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించలేకపోయనా, తన అద్వితీయ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. అగర్తలా (త్రిపుర)లో 1993 ఆగస్టు 9న జన్మించిన దీప ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన తొలి భారత మహిళగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించింది. భారత దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించిన తర్వాత ఇప్పటి వరకూ 11 మంది జిమ్నాస్టులు మన దేశం తరఫున పాల్గొన్నారు.

08/30/2016 - 03:35

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రెజ్లర్ సాక్షి మాలిక్ ఎలాంటి అంచనాలు లేకుండానే ఒలింపిక్స్‌కు వెళ్లింది. అక్కడ కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడంతో ఆమె పేరు ఒక్కసారిగా దేశమంతా మారుమోగింది. రోహ్‌తక్ (హర్యానా)లో 1992 సెప్టెంబర్ 3న జన్మించిన సాక్షి రియో విజయంతోనే ఖేల్ రత్న అవార్డును సొంతం చేసుకుంది. 23 ఏళ్ల సాక్షి రియో ఒలింపిక్స్ కంటే ముందు, 2014 గ్లాస్గో కామనె్వల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

08/30/2016 - 03:33

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రియో ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక విఫలమైనప్పటికీ, జీతూ రాయ్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అతనికి ఖేల్ రత్న అవార్డు రావడాన్ని సమర్ధిస్తున్న వారి వాదన. నేపాల్‌లో 1982 ఆగస్టు 26న జన్మించిన జీతూ లక్నో (ఉత్తర ప్రదేశ్)లో స్థిరపడ్డాడు. గత రెండేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున మెరుగైన ప్రదర్శనలతో రాణిస్తున్నాడు.

08/29/2016 - 13:19

దిల్లీ: ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పీవీ సింధు, కాంస్య పతకం సాధించిన సాక్షి మలిక్‌, అద్భుత ప్రదర్శన చేసిన దీపా కర్మాకర్‌, జీతూరాయ్‌లకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేశారు. సత్తి గీత, సిల్వానస్‌ డంగ్‌ డంగ్‌, రాజేంద్ర ప్రహ్లాద్‌ షెల్కేలు ధ్యాన్‌చంద్‌ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.

,
08/29/2016 - 07:15

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ద్రోణాచార్య, అర్జున అవార్డులకు ఎంపికయనవారు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నప్పటి చిత్రాలు..

08/29/2016 - 07:15

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ‘హాకీ మాంత్రికుడు’ ధ్యాన్ చంద్‌ను ఎప్పుడో మరచిపోయన ప్రభుత్వాలకు ఆయన గురించి ఆలోచించే ఓపికగానీ, ఆయన చూపిన మార్గంలో నడవాలన్న ఆలోచనగానీ కనిపించడం లేదు. రియో ఒలింపిక్స్‌లో 118 మందితో కూడిన బృందం వెళితే, కేవలం రెండంటే రెండు పతకాలు దక్కాయంటే మన దేశంలో క్రీడల పతనాన్ని అంచనా వేయవచ్చు. ఇలాంటి పరిస్థితిని ధ్యాన్ చంద్ ఎన్నడూ ఊహించలేదు. భవిష్యత్ తరాలు ఇలా విఫలమవుతాయని అనుకోలేదు.

08/29/2016 - 07:16

* ధ్యాన్ చంద్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్నా, ఇప్పటికీ ఆ దిశగా సర్కారు అడుగు వేయడం లేదు. ఈ అవార్డుకు క్రీడాకారులు అర్హులు కాదన్న వాదన చాలాకాలం కొనసాగింది. పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా భారత రత్న అవార్డుకు క్రీడాకారులు కూడా అర్హులేనని అప్పటి యుపిఎ సర్కారు ప్రకటించింది.

Pages