S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/24/2016 - 06:59

న్యూఢిల్లీ, ఆగస్టు 23: విరాట్ కోహ్లీ భారత అండర్-19 స్థాయి నుంచి టెస్టు జట్టు కెప్టెన్ వరకూ ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించాడు. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు పొందాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మైదానంలో ఎప్పుడూ చురుగ్గా ఉండే కోహ్లీని చాలా మంది కోపిష్టి అంటారు. అతనిది చంచల స్వభావన్న విమర్శలు కూడా ఉన్నాయి.

08/24/2016 - 06:58

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ఆగస్టు 23: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ రద్దుకావడంపై ట్రినిడాడ్ అండ్ టొబాగో క్రికెట్ బోర్డు (టి అండ్ టిసిబి) విచారణకు ఆదేశించింది. మొదటి రోజు వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడగా, కేవలం 22 ఓవర్లు బౌల్ అయ్యాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ రెండు వికెట్లకు 62 పరుగులు సాధించింది.

08/24/2016 - 06:57

బెంగళూరు, ఆగస్టు 23: రియో ఒలింపిక్స్‌లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చిన మహిళల స్టీపుల్‌చేజ్ అథ్లెట్ సుధా సింగ్ జ్వరంతో ఇక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమె స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నదని పరీక్షల అనంతరం వైద్యులు ప్రకటించారు. రియో నుంచి రావడంతో జికా వైరస్ సోకిందన్న అనుమానంతో వైద్య పరీక్షలను నిర్వహించారు. బ్రెజిల్‌లో ప్రాణాంతకమైన జికా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే.

08/24/2016 - 04:52

విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 23: రియో ఒలింపిక్స్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన తెలుగుతేజం పివి సింధు తొలిసారి విజయవాడలో అడుగుపెట్టడంతో సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుండి విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్ ప్రత్యేక విమానంలో సింధు, ఆమె కుటుంబ సభ్యులతోపాటు కోచ్ గోపీచంద్‌ను తీసుకువచ్చారు.

08/24/2016 - 04:47

విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 23: భారతదేశంలో ఒలింపిక్స్ జరగాలని ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు కేంద్రంలో బిడ్స్ వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇండియాలో ఒలింపిక్స్ జరగటం ద్వారా క్రీడాకారులు స్ఫూర్తి పొందుతారని అన్నారు. ఇతర దేశాల కంటే బాగా ఆడేవారు మన దగ్గర చాలా మంది వున్నారని చెప్పారు.

,
08/23/2016 - 03:43

హైదరాబాద్, ఆగస్టు 22: త్వరలోనే రాష్ట్రంలో కొత్త క్రీడా విధానాన్ని ప్రవేశపెడతామని తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి, తెలంగాణ బాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కె. తారక రామారావు వెల్లడించారు. సింధు విజయోత్సవ ర్యాలీ అనంతరం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆమె సన్మాన కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘బేటీ బచావో..

08/23/2016 - 03:29

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకాన్ని సాధించి దేశానికే ఖ్యాతితెచ్చిన పివి సింధు విజయోత్సాహంలో ప్రతి ఒక్కరూ తలమునకలైన సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ మహ్మూద్ అలీ ఓ దిగ్భ్రాంతికర ప్రకటన చేశారు. సింధూకు శిక్షణ ఇచ్చిన పుల్లెల గోపీచంద్‌పైనా ప్రశంసల వెల్లువెత్తుతున్న తరుణంలోనే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

08/23/2016 - 03:28

హైదరాబాద్, ఆగస్టు 22: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి, కోచ్ గోపీచంద్‌తో కలిసి సోమవారం హైదరాబాద్ చేరుకున్న తెలుగు అమ్మాయి, స్టార్ షట్లర్ పివి సింధుకు కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వ స్వాగతం లభించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన భారీ ర్యాలీని తిలకించడానికి వేలాదిగా అభిమానులు కదలివచ్చారు. నినాదాలు చేస్తూ, పూల వర్షం కురిపిస్తూ సింధుకు నీరాజనాలు పలికారు.

08/23/2016 - 03:26

హైదరాబాద్, ఆగస్టు 22: ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన చిరకాల స్వప్నం సాకారమైందని రియోలో రజత పతకాన్ని కైవసం చేసుకొని, సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్న బాడ్మింటన్ స్టార్ పివి సింధు అన్నది. గోపీచంద్ అకాడెమీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒలింపిక్స్‌కు వెళ్లడం, పతకం సాధించడం తనకు చాలాకాలంగా ఉన్న లక్ష్యాలని చెప్పింది. రియోలో తన కల నెరవేరిందని చెప్పింది.

08/23/2016 - 03:17

హైదరాబాద్, ఆగస్టు 22: సింధు సాధించాల్సింది ఎంతో ఉందని, నిజానికి ఆమె తన సామర్థ్యాన్ని ఇప్పటికీ సంపూర్ణంగా వినియోగించుకోవడం లేదని జాతీయ బాడ్మింటన్ కోచ్ గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. గచ్చిబౌలిలోని తన అకాడెమీలో సింధుతో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ సింధు వయసు కేవలం 21 సంవత్సరాలేనని, కనీసం మరో పదేళ్ల కెరీర్ ఆమె ముందు ఉన్నదని చెప్పాడు.

Pages