S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/09/2016 - 02:05

రియో డి జెనీరో: చైనా వెయిట్‌లిఫ్టర్ లాంగ్ కిన్‌క్వాన్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పురుషుల 56 కిలోల విభాగంలో పోటీపడిన అతను ఉత్తర కొరియాకు చెందిన ఓమ్ యున్ చోల్ 16 ఏళ్ల క్రితం నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు చేశాడు. లాంగ్ మొత్తం 307 కిలోల బరువునెత్తి కొత్త రికార్డును సృష్టించాడు.

చిత్రం.. 16 సంవత్సరాల నాటి ప్రపంచ రికార్డును తిరగరాసిన లాంగ్ కిన్‌క్వాన్

08/09/2016 - 02:02

సెయింట్ లూయిస్, ఆగస్టు 8: వెస్టిండీస్‌తో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మూడో క్రికెట్ టెస్టులో విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది. మొదటి టెస్టును గెల్చుకున్న భారత్, రెండో టెస్టులో దాదాపుగా చేతికి అందిన విజయాన్ని చేజార్చుకుంది. బౌలింగ్ విభాగం విఫలం కావడంతో ఆ మ్యాచ్‌ని డ్రాగా ముగించింది.

08/08/2016 - 16:33

రియో డి జనీరో : రియో ఒలింపిక్స్‌లో ఆర్టిస్టిక్స్‌ జిమ్నాస్టిక్స్‌లో భారత జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఈ ఘనత సాధించిన భారత తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. దీపా క్వాలిఫికేషన్ రౌండ్‌లో సత్తా చాటింది. ఫైనల్‌కు అర్హత సాధించింది.

08/08/2016 - 16:15

జొహాన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా ): మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై నలుగురు క్రికెటర్లపై దక్షిణాఫ్రికా నిషేధం విధించింది. 2015లో దేశీయంగా జరిగిన ట్వంటీట్వంటీ మ్యాచుల్లో ఫిక్సింగ్‌కు నలుగురు పాల్పడినట్లు తేలింది. ఈ క్రికెటర్లను ఏడు నుంచి 12 ఏళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. మాజీ వికెట్ కీపర్ థామీ‌పై 12 ఏళ్ల నిషేధం విధించారు.

08/08/2016 - 11:37

రియో డీ జనీరో: పురుషుల టెన్నిస్ సింగిల్స్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ఒలింపిక్స్ రెండో రోజు గేమ్స్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన పోరులో జొకోవిచ్ 6-7(4/7), 6-7(2/7)తేడాతో డెల్ పాట్రో(అర్జెంటీనా) చేతిలో పరాజయం చవిచూశాడు. దీంతో గోల్డెన్ స్లామ్ సాధించే అవకాశాన్ని జొకోవిచ్ జారవిడుచుకున్నాడు.

08/08/2016 - 05:03

రియో డి జెనీరో, ఆగస్టు 7: రియో ఒలింపిక్స్‌లో మొదటి ప్రపంచ రికార్డు నమోదైంది. బ్రిటీష్ స్విమ్మర్ ఆడం పీటి పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ హీట్స్‌ను 57.55 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. మొట్టమొదటిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అతను స్వర్ణ పతకాన్ని సాధించే అవకాశాలను మెరుగుపరచుకున్నాడు. హీట్స్ పూర్తి చేసుకొన్న అతను సెమీ ఫైనల్స్‌లో లక్ష్యాన్ని 57.62 సెకన్లలో చేరాడు.

08/08/2016 - 04:59

రియో డి జెనీరో: వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కోవడమేగాక, రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన బృందంలో ఏకంగా 117 మంది డోప్ పరీక్షలో విఫలం కావడంతో పరువు కోల్పోయిన రష్యాకు బెస్లాన్ ముద్రానోవ్ ఊరటనిచ్చాడు. పురుషుల 60 కిలోల జూడోలో అతను విజేతగా నిలిచి, రష్యాకు ఈ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని అందించాడు. ఫైనల్‌లో అతను కజకస్థాన్‌కు చెందిన జూడోకాన్ యెల్డాస్ స్మెటోవ్‌ను ఓడించాడు.

08/08/2016 - 04:59

రియో డి జెనీరో, ఆగస్టు 7: ఒలింపిక్స్‌ను తిలకించేందుకు రియో వెళ్లిన భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ మొదటి రోజు తీరిక లేకుండా గడిపాడు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధ్యక్షుడు థామస్ బాచ్‌ని కలిసి కొద్దిసేపు ముచ్చటించాడు. ఒలింపిక్ క్రీడా పోటీలను తిలకించాడు. క్రీడా గ్రామానికి వెళ్లి, అక్కడ భారత బృందాన్ని కలిశాడు.

08/08/2016 - 04:58

మహిళల 400 మీటర్ల ఇండివిజువల్ మెడ్లే విభాగంలో హంగరీకి చెందిన కటిన్కా హోజూ సంచలనం సృష్టించిం ది. 4:26.36 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరి న ఆమె కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిం ది. 1993 డిసెంబర్ 2న చైనా స్విమ్మర్ డాయ్ గుహాంగ్ 4:29.00 నిమిషాలతో నెలకొల్పిన రికార్డును ఆమె బద్దలు చేసింది. స్పెయన్‌కు చెందిన మిరియా బెల్మోట్ 4:32.39 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకొని రజత పతకాన్ని అందుకుంది.

08/08/2016 - 04:58

రియో డి జెనీరో: ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు మొట్టమొదటిసారి బరిలోకి దిగితే, సిరియా శరణార్థి యస్రా మర్డీనీ మహిళల 100 మీటర్ల బటర్‌ఫ్లై హీట్స్‌ను సమర్థంగా పూర్తి చేసి అందరినీ ఆకట్టుకుంది. సుమారు ఏడాది క్రితం ప్రాణం కోసం సిరియాను విడిచిపెట్టిన ఆమె స్విమ్మింగ్‌పై దృష్టి కేంద్రీకరించింది. రియో ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) పతాకం కింద పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది.

Pages