S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/27/2016 - 06:04

దుబాయి, జూలై 26: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసిసి బౌలర్ల ర్యాకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో ఆంటిగ్వాలో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 83 పరుగులకు ఏడు వికెట్లు సాధించి భారత్ ఘన వజయంలో కీలపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అశ్విన్ 2015లో కూడా ఐసిసి బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

07/27/2016 - 06:03

న్యూఢిల్లీ, జూలై 27: డోపింగ్ పరీక్షలో విఫలమైన నర్సింగ్ యాదవ్‌కు అతని సహచర రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ బాసటగా నిలిచాడు. ఈ కుంభకోణంపై విస్తృతమైన దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని యోగేశ్వర్ దత్ మంగళవారం ఉద్ఘాటించాడు.

07/27/2016 - 06:02

జియాగ్జింగ్ (చైనా), జూలై 26: అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో గత రెండు నెలల నుంచి దుమ్మురేపుతున్న తెలుగు తేజం, గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ టాప్-10 ర్యాంకింగ్స్‌లో మరింత ఉన్నత స్థానానికి దూసుకెళ్లింది. ఇంతకుముందు ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచిన హారిక మంగళవారం తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఐదు స్థానాలను మెరుగుపర్చుకుని ఐదో ర్యాంకుకు ఎగబాకింది.

07/27/2016 - 06:00

న్యూఢిల్లీ, జూలై 26: రియో ఒలింపిక్స్‌కు వెళ్లాల్సిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడానికి తాము కుట్ర పన్నినట్లు వస్తున్న ఆరోపణలను ప్రముఖ రెజ్లింగ్ కోచ్ సత్పాల్ సింగ్ మంగళవారం తోసిపుచ్చాడు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని, ఎటువంటి ఆధారాల్లేకుండా తనవైపు, తన అల్లుడి వైపు వేలెత్తి చూపడం సరికాదని ఆయన పేర్కొన్నాడు.

07/27/2016 - 05:59

కోల్‌కతా, జూలై 26: తన రెండేళ్ల చీకటి రోజులను మరిచిపోయి, తనలాగే వివక్షను ఎదుర్కొనే వేలాది మంది అమాయకులకోసం రియోలో పతకం సాధించడమే తన లక్ష్యమని ఒలింపిక్స్‌లో వంద మీటర్ల స్ప్రింట్‌లో భారత్ తరఫున ఎంపికయిన రెండో మహిళ దుతీ చాంద్ అంటోంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పిటి ఉష వందమీటర్లు, 200 మీటర్ల స్ప్రింట్‌లో పోటీ పడిన తర్వాత మన దేశంనుంచి ఒలింపిక్స్‌కుఈ విభాగంలో ఎంపికయిన రెండో మహిళ దుతి కావడం గమనార్హం.

07/26/2016 - 05:48

న్యూఢిల్లీ, జూలై 25: రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా అడ్డుకుంటూ అతని భవిష్యత్తును దెబ్బతీస్తున్న డోపింగ్ కుంభకోణం సోమవారం సరికొత్త మలుపు తిరిగింది.

07/26/2016 - 05:41

న్యూఢిల్లీ, జూలై 25: డోపింగ్ వ్యవహారంలో రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు వ్యతిరేకంగా కుట్ర జరిగిందన్న అనుమానాలు క్రమేణా బలపడుతున్నాయి.

07/26/2016 - 05:39

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 25: కరీబియన్ దీవుల్లో ప్రారంభమైన నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో టీమిండియా అద్భుతమైన శుభారంభాన్ని అందుకుంది. నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో సోమవారం తెల్లవారు జామున (్భరత కాలమానం ప్రకారం) ఆతిథ్య వెస్టిండీస్ జట్టును ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో మట్టికరిపించి నాలుగు రోజులకే ఘన విజయాన్ని సాధించింది.

07/26/2016 - 05:38

న్యూఢిల్లీ, జూలై 25: డోపింగ్ కుంభకోణంలో చిక్కుకున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు లేనట్లేనని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంలో నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు వీలుగా నర్సింగ్‌కు సముచిత అవకాశాన్ని కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

07/26/2016 - 05:36

దుబాయ్, జూలై 25: ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా సోమవారం చాంపియన్‌షిప్ మేస్‌ను కైవసం చేసుకుంది. ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన వార్షిక ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానంలో నిలవడంతో ఆ జట్టుకు చాంపియన్‌షిప్ మేస్‌ను అందజేశారు.

Pages