S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/22/2016 - 01:37

లాసానే, జూలై 21: అందరూ అనుకున్నట్లుగానే డోపింగ్ కుంభకోణంలో రష్యాకు అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎస్‌ఎ)లో చుక్కెదురైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కుంభకోణం జరిగిందన్న అభియోగాల నేపథ్యంలో తమ క్రీడాకారులు రియో లింపిక్స్‌లో పాల్గొనకుండా అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ సమాఖ్య (ఐఎఎఎఫ్) నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ రష్యా చేసుకున్న అప్పీలును సిఎస్‌ఎ గురువారం డిస్మిస్ చేసింది.

07/22/2016 - 01:35

ముంబయి, జూలై 21: పుణెకు చెందిన మిషెల్లీ కాకడే కాలి నడకన పరుగెత్తి భారత స్వర్ణ చతుర్భుజిని అధిగమించిన తొలి వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలోకి ఎక్కింది. ఈ మేరకు గిన్నిస్‌నుంచి గుర్తింపు, సర్ట్ఫికెట్‌ను వ్యాపార వేత్త అనిల్ కాకడే భార్య, ఇద్దరు పిల్లల తల్లి అయిన 47 ఏళ్ల మిషెల్లీ అందుకున్నట్లు గురువారం ఒక పత్రికా ప్రకటన తెలిపింది.

07/22/2016 - 01:34

న్యూఢిల్లీ, జూలై 21: అమెరికా పర్యటనలో భారత మహిళా హాకీ జట్టు రెండవ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సాధించింది. పెన్సిల్వేనియాలోని మనె్హయిమ్‌లో భారత జట్టు అద్భుత పోరాట పటిమతో విజృంభించి 2-1 గోల్స్ తేడాతో ఆతిథ్య అమెరికాను మట్టికరిపించింది. ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ పోరులో ఇరు జట్లు తొలి 15 నిమిషాల్లో ఒక్క గోల్ కూడా సాధించలేదు.

07/22/2016 - 01:32

న్యూఢిల్లీ, జూలై 21: ఆస్ట్రేలియాలోని ప్రముఖ ప్రైవేట్ క్రికెట్ అకాడమీల్లో ఒకటైన క్రైగ్ మెక్‌డెర్మాట్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ(సిఎంఐసిఏ)కి టీమిండియా వన్‌డే, టి-20 కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాడు. ముఖ్యంగా క్రికెట్‌కు ప్రాధాన్యతతో స్పోర్ట్స్ సైన్స్, మేనేజిమెంట్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీని ఈ అకాడమీ అందిస్తుంది.

07/22/2016 - 01:32

మాంచెస్టర్ (బ్రిటన్), జూలై 21: పాకిస్తాన్‌తో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభం కానున్న రెండో మ్యాచ్ కోసం ఇంతకుముందు 14 మందితో ఎంపిక చేసిన జట్టు నుంచి ఫాస్ట్ బౌలర్లు స్టీవ్ ఫిన్, జాక్ బాల్‌ను తొలగించి సభ్యుల సంఖ్యను 12కు కుదించినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఆలిస్టర్ కుక్ గురువారం వెల్లడించాడు.

07/22/2016 - 01:31

లండన్, జూలై 21: తొడ కండరాల గాయం కారణంగా చాలారోజులుగా పోటీలకు దూరంగా ఉన్న జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌ఒలింపిక్స్‌కు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడమే కాకుండా రియో ఒలిపింక్స్‌కు ముందు శుక్రవారం ఇక్కడ జరిగే వార్షిక గేమ్స్‌లో ఈ సీజన్‌లో తొలిసారిగా 200 మీటర్ల పరుగుపందెంలో తన ఫిట్నెస్‌ను పరీక్షించుబోతున్నాడు.

07/22/2016 - 01:31

న్యూఢిల్లీ, జూలై 21: క్రీడా రంగంలో దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించిన హాకీ లెజెండ్ మహమ్మద్ షాహిద్ మరణంతో విషాదంలో మునిగిపోయిన ఆయన కుటుంబానికి సాధ్యమైనంత సాయం అందించాలని పార్లమెంట్‌లో గురువారం పలువురు సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

07/21/2016 - 08:20

ఆంటిగ్వా, జూలై 20: కరీబియన్ దీవుల్లో పర్యటిస్తున్న టీమిండియా ఇక అసలు సిసలైన పోరాటాన్ని ఆరంభించనుంది. వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు గురువారం ఆంటిగ్వాలో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.

07/21/2016 - 08:18

న్యూఢిల్లీ, జూలై 20: వారణాసి ముద్దుబిడ్డగా ఖ్యాతి పొందిన భారత హాకీ లెజెండ్ మహమ్మద్ షాహిద్ ఇక లేరు. ఆటలో కొనసాగినంత కాలం అద్భుతమైన స్టిక్ వర్క్‌తో ప్రత్యర్థులకు సింహస్వప్నంగా నిలిచిన షాహిద్ గుర్గావ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం కన్నుమూశారు.

07/21/2016 - 08:17

లాసానే, జూలై 20: డోపింగ్ కుంభకోణంలో పీకల్లోతున కూరుకుపోయిన రష్యా క్రీడాకారులను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అనుమతించాలా? లేక వారిపై నిషేధం విధించాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు కనీసం ఇంకో వారం రోజుల సమయం పడుతుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) బుధవారం స్పష్టం చేసింది.

Pages