S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/03/2016 - 04:54

బెంగళూరు, జూలై 2: భారత క్రికెటర్లు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే భారత జట్టు ఇక్కడ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నాడు. తాను స్వయంగా నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ, యువ బౌలర్లకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నాడు.

07/03/2016 - 04:52

లండన్, జూలై 2: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సిం గిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకో విచ్ పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించాడు. శామ్ క్వెర్రీతో తలపడిన జొకోవిచ్ మొదటి రెండు సెట్లను 6-7, 1-6 తేడాతో చేజార్చుకున్నాడు. అదే సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గిన తర్వాత తిరిగి ఆ మ్యాచ్‌ని కొనసాగించగా, మూడో సెట్‌ను జొకోవిచ్ 6-3 తేడాతో గెల్చుకున్నాడు.

07/03/2016 - 04:51

లిల్లే, జూలై 2: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో వేల్స్ జట్టు సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా అనామక జట్టుగా బరిలోకి దిగిన వేల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో బెల్జియంపై 3-1 తేడాతో విజయం సాధించి, తొలిసారి ఒక మేజర్ టోర్నీ సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

07/03/2016 - 04:45

న్యూఢిల్లీ, జూలై 2: మాటకు మాట అనడమే స్లెడ్జింగ్‌కు తన సమాధానమని భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు. తనను హేళన చేసిన వారిని ఎవరినీ ఉపేక్షించనని అంటూ, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డారెన్ లీమన్‌ను ఒకసారి ‘నువ్వు గర్భిణివా’ అని అడిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. త్వరలోనే ప్రసారం కానున్న ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్న భజ్జీ స్లెడ్జింగ్‌పై పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

07/03/2016 - 04:49

కాల్గరీ (కెనడా), జూలై 2: భారత యువ ఆటగాడు అజయ్ జయరామ్ ఇక్కడ జరుగుతున్న కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ పురుషుల సింగిల్స్‌లో సెమీ ఫైనల్స్ చేరాడు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అతను క్వార్టర్ ఫైనల్‌లో భారత్‌కే చెందిన హర్షీల్ డానీని 21-18, 19-21, 21-8 తేడాతో ఓడించాడు. కాగా, నాలుగో సీడ్ సాయి ప్రణీత్ కూడా సెమీస్‌లోకి అడుగుపెట్టాడు.

07/03/2016 - 04:42

జైపూర్, జూలై 2: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో ఢిల్లీ దబాంగ్, పునేరీ పల్టన్ జట్లు విజయాలను నమో దు చేశాయ. బెంగళూరు బుల్స్‌తో తలపడిన ఢిల్లీ 32-24 తేడాతో గెలి చింది. మిరాజ్ షేక్ ఎనిమిది పాయంట్లు చేశాడు. సచిన్ షిగాడే ఏడు పాయంట్లతో రాణించాడు. బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ ఎని మిది పాయంట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మోహిత్ చిల్లార్ ఏడు పాయంట్లు సాధించాడు.

07/03/2016 - 04:41

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూలై 2: షహీం ఆమ్లా, డ్వెయిన్ బ్రేవో టి-20 ఫార్మెట్‌లో ఐదో వికెట్‌కు కొత్త రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బార్బడాస్ ట్రైడెంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడిన వీరు ఐదో వికెట్‌కు 92 బంతుల్లో 150 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆమ్లా 54 బంతులు ఎదుర్కొని 81 పరుగులు చేయగా, బ్రేవో అజేయంగా 66 పరుగులు సాధించాడు.

07/02/2016 - 07:44

న్యూఢిల్లీ, జూలై 1: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలోని క్రికెట్ కమిటీలో తన పదవికి భారత మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ డైరెక్టర్ రవి శాస్ర్తీ రాజీనామా చేశాడు. ఎంతో కీలకమైన మీడియా ప్రతినిధిగా అతను కొనసాగుతున్నాడు. తాను పూర్తి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని, క్రికెట్ కమిటీలో కొనసాగడం కష్టమవుతుందని అతను ఒక ప్రకటనలో తెలిపాడు.

07/02/2016 - 07:42

న్యూఢిల్లీ, జూలై 1: న్యూజిలాండ్‌తో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఒక దానిని డే/నైట్ మ్యాచ్‌గా ఆడతామని ఇంతకు ముందు ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) యుటర్న్ తీసుకుంది. ఆ సిరీస్‌లో డే/నైట్ టెస్టు ఉండే అవకాశం లేదని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించాడు.

07/02/2016 - 07:41

బెంగళూరు, జూలై 1: టెస్టు క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోనీ గుడ్‌బై చెప్పడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడం అనుకున్నంత సులభం కాదని వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే టీమిండియాకు ఎంపికైన వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. అతని స్థానం భర్తీ కావడం కష్టమని అన్నాడు.

Pages