S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/09/2016 - 07:17

ముంబయి, జూన్ 8: భారత క్రికెట్ జట్టు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో బుధవారం జింబాబ్వే టూర్‌కు బయలుదేరి వెళ్లింది. 2017లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌పై దృష్టి కేంద్రీకరించిన ధోనీ అప్పటి వరకూ వనే్డ, టి-20 ఫార్మెట్స్‌లో భారత్‌కు కెప్టెన్‌గా కొనసాగాలని ఆశిస్తున్నాడు.

06/08/2016 - 17:06

ముంబయి : మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ముంబయి నుంచి జింబాబ్వేకు బుధవారం బయల్దేరి వెళ్లింది. ఈ నెల 11న ప్రారంభం కానున్న సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరుగుతాయి. జింబాబ్వేతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ధోనీ సేన ఆడనుంది.

06/08/2016 - 07:33

న్యూఢిల్లీ, జూన్ 7: మన దేశం తరఫున రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన టింటు లూకా (27) చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో జరిగిన జోసెఫ్ ఓడ్లోజిల్ మెమోరియల్ అథ్లెటిక్ మీట్‌లో మహిళల 800 మీటర్ల రేసును 2:00.61 నిమిషాల్లో పూర్తిచేసి ఈ సీజన్‌లోనే అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేయడంతో పాటు రజత పతకాన్ని దక్కించుకుంది.

06/08/2016 - 07:29

ముంబయి, జూన్ 7: జింబాబ్వేలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లో పలువురు యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు నాయకత్వం వహించనున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆ సవాలును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు.

06/08/2016 - 07:28

ముంబయి, జూన్ 7: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు సారథిగా తన భవితవ్యంపై వస్తున్న ఊహాగానాలను ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ తోసిపుచ్చాడు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డేనని అతను మరోసారి స్పష్టం చేశాడు. ‘నేను ఆటను ఆస్వాదించడం లేదనడం సరికాదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు నేను నాయకత్వం వహించాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయించాల్సింది నేను కాదు.

06/08/2016 - 07:28

న్యూఢిల్లీ, జూన్ 7: వియత్నాంలోని హోచిమిన్ సిటీలో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ మొత్తం 17 పతకాలతో తన పోరాటాన్ని ముగించింది. వీటిలో ఏడు పసిడి పతకాలతో పాటు నాలుగు రజత పతకాలు, మరో ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. జపాన్ 14 స్వర్ణ పతకాలతో ఈ పోటీల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, 11 పసిడి పతకాలతో చైనా రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో భారత్‌కు మూడో స్థానం లభించింది.

06/08/2016 - 07:27

గౌహతి, జూన్ 7: మూడేళ్ల తర్వాత జరుగే ఎఎఫ్‌సి ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్-2019లో భారత జట్టుకు బెర్తు ఖరారైంది. రెండో లెగ్ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి ఇందిరా గాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 6-1 గోల్స్ తేడాతో లావోస్ జట్టును మట్టికరిపించి ఈ బెర్తును ఖరారు చేసుకుంది. ఇప్పటివరకూ భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి.

06/07/2016 - 06:22

న్యూఢిల్లీ, జూన్ 6: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ దాదాపుగా కోల్పోయాడు. నర్సింగ్ పంచమ్ యాదవ్‌తో ట్రయల్ బౌట్ కోసం డిమాండ్ చేస్తున్న సుశీల్ తనకు న్యాయం చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పురుషుల రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో ఒకరిని రియో ఒలింపిక్స్‌కు పంపే అవకాశం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ)కి ఉంది.

06/07/2016 - 06:21

చికాగో, జూన్ 6: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా జమైకాతో జరిగిన మ్యాచ్‌ని వెనెజులా 1-0 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. జోసెఫ్ మార్టినెజ్ కీలక గోల్ చేసి, వెనెజులాను విజయపథంలో నడిపాడు. లీగ్ దశలో సాధారణంగా ప్రతి జట్టూ అనుసరించే యుద్ధ నీతినే వెనెజులా అమలు చేసింది. మ్యాచ్ 15వ నిమిషంలోనే మార్టినెజ్ గోల్ సాధించడంతో 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన ఆ జట్టు రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది.

06/07/2016 - 06:20

న్యూఢిల్లీ, జూన్ 6: టీమిండియాకు డైరెక్టర్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ రవిశాస్ర్తీ ఇప్పుడు కోచ్ పదవికి దరఖాస్తు చేశా డు. జట్టు డైరెక్టర్‌గా అతని కాంట్రాక్టు ఇటీవలే పూర్తయంది. అదే విధంగా సపో ర్టింగ్ స్టాఫ్ సంజయ్ బంగార్, రామకృష్ణన్ శ్రీధర్, భరత్ అరుణ్ పదవీకాలం కూడా ముగిసింది.

Pages