S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/07/2016 - 06:16

పోవి డెన్స్ (గయానా), జూన్ 6: ముక్కోణపు వనే్డ క్రికెట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెల్చుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అజేయ అర్ధ శతకంతో రాణించి ఆసీస్‌ను విజయపథంలో నడిపాడు. అతని విజృంభణతో, 117 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 25.4 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 32.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది.

06/06/2016 - 06:27

పారిస్, జూన్ 5: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలన్న ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ కల నెరవేరింది. గతంలో 11 పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ కోసం విఫలయత్నం చేసిన జొకోవిచ్ పనె్నండో ప్రయత్నంలో సఫలమయ్యాడు. బ్రిటిష్ ఆటగాడు, రెండో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండీ ముర్రేను ఆదివారం జరిగిన ఫైనల్‌లో 3-6, 6-1, 6-2, 6-4 తేడాతో ఓడించి, కెరీర్‌లో 12వ టైటిల్‌ను సాధించాడు.

06/06/2016 - 06:23

లాస్ ఏంజిలిస్, జూన్ 5: కోపా అమెరికా సాకర్ చాంపియన్‌షిప్ టైటిల్‌పై అర్జెంటీనా జట్టు కనే్నసింది. చిలీతో సోమవారం జరిగే మ్యాచ్‌తో టైటిల్ వేటను అర్జెంటీనా మొదలుపెట్టనుంది. వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి కోపా అమెరికా ప్రాధాన్యతను సంతరించకుంది. గత 23 సంవత్సరాలుగా ఈ టోర్నీలో టైటిల్ సాధించేందుకు అర్జెంటీనా చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి.

06/06/2016 - 06:22

జకార్తా, జూన్ 5: ఇండోనేషియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను మలేసియా ఆటగాడు లీ చాంగ్ వెయ్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అతను డెన్మార్క్ క్రీడాకారుడు జాన్ జొర్గెనె్సన్‌ను 17-21, 21-19, 21-17 తేడాతో ఓడించాడు. ఈ ఏడాది అతనికి ఇది నాలుగో టైటిల్. కాగా, మహిళల సింగిల్స్‌లో తాయ్ జూ ఇంగ్ టైటిల్‌ను సాధించింది.

06/06/2016 - 06:22

పారిస్, జూన్ 5: ఏకాగ్రతతో మ్యాచ్ ఆడడం వల్లే శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో విజయం సాధ్యమైందని తొలిసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్ సాధించిన స్పెయిన్ క్రీడాకారిణి గార్బినే ముగురుజా అన్నది. ట్రోఫీతో ఆదివారం ఫొటో షూట్‌కు హాజరైన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించడం సులభం కాదని వ్యాఖ్యానించింది.

06/06/2016 - 06:21

లూయిస్‌విల్లే, జూన్ 5: ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మహమ్మద్ అలీ మృతితో అతని స్వస్థలమైన లూయిస్‌విల్లే దిగ్బ్రాంతికి గురైంది. అభిమానులతో పోటెత్తిపోయింది. అలీ భౌతిక కాయాన్ని చివరిసారి దర్శించుకోవడానికి ప్రముఖల నుంచి సామాన్యుల వరకూ అందరూ క్యూ కట్టడంతో లూయిస్‌విల్లే జన సంద్రమైంది. సొంత తండ్రిని కోల్పోయినట్టు కొంత మంది విలపిస్తే, మత ప్రవక్త తమను విడిచి వెళ్లాడంటూ మరికొందరు రోదించారు.

06/06/2016 - 06:20

న్యూఢిల్లీ, జూన్ 5: రియో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున రెజ్లింగ్ పురుషుల 74 కిలోల విభాగంలో ఎవరు పోటీపడాలన్న విషయంపై సోమవారం స్పష్టత రానుంది. తనకే అవకాశం కల్పించాలని లేదా నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్స్‌ను నిర్వహించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో సుశీల్ కుమార్ వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

06/05/2016 - 06:20

న్యూఢిల్లీ, జూన్ 4: మహమ్మద్ అలీకి భారత్‌తో ఎంతో అనుబంధం ఉంది. 1980 జనవరి 31న అతను మద్రాసు (నేటి చెన్నై)లో మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ జిమీ ఎలిస్‌తో కలిసి ఎగ్జిబిషన్ ఫైట్‌లో పాల్గొన్నాడు. ఆ పోటీకి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్‌లో తనకు లభించిన ఆదరణను అలీ చాలా సందర్భాల్లో గుర్తుచేసుకున్నాడు.

06/05/2016 - 06:19

లాస్ ఏంజిలిస్, జూన్ 4: బాక్సింగ్ రంగంలో అసలుసిసలైన ఆణిముత్యం ప్రపంచ హెవీవెయిట్ మాజీ చాంపియన్ మహమ్మద్ అలీ. అతని మృతితో బాక్సింగ్ మాత్రమే కాదు.. యావత్ క్రీడాలోకం ఒక అసాధారణ ప్రతిభావంతుడిని కోల్పోయింది. సుమారు మూడు దశాబ్దాల క్రితం పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడిన అలీ కొంత కాలం నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.

06/05/2016 - 06:16

ప్రావిడెన్స్ (గయానా), జూన్ 4: మూడు దేశాల అంతర్జాతీయ వనే్డ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి డే/నైట్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు బోణీ చేసింది. 27 పరుగులకే 6 వికెట్లు కూల్చి కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు.

Pages