S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/02/2016 - 08:37

కొలంబో, జూన్ 1: శ్రీలంక వెటరన్ ఫాస్ట్ బౌలర్ నవాన్ కులశేఖర టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తాను టెస్టు ఫార్మెట్ నుంచి వైదొలగుతున్నానని అతను ఒక ప్రకటనలో తెలిపాడు. వనే్డ, టి-20 ఫార్మెట్స్‌పై దృష్టి కేంద్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. 2005లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన అతను కెరీర్‌లో 21 టెస్టులు ఆడాడు. 48 వికెట్లు పడగొట్టాడు.

06/02/2016 - 08:36

కోల్‌కతా, జూన్ 1: క్రికెట్ మైదానాల గురించి, అందులోనూ అత్యంత ప్రతిష్టాత్మకమైన కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ప్రబీర్ ముఖర్జీ పేరు సుపరచితం. వృత్తి ధర్మానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎవరి మాటనూ లెక్కచేయని విలక్షణ వ్యక్తిగా ముద్రపడిన ఈడెన్ గార్డెన్స్ మాజీ క్యూరేటర్ ప్రబీర్ మృతి చెందారు.

06/01/2016 - 01:04

న్యూఢిల్లీ, మే 31: టీమిండియా డైరెక్టర్ రవి శాస్ర్తీ, అసిస్టెంట్ కోచింగ్ స్ట్ఫా సంజయ్ బంగార్, భరత్ అరుణ్, ఆర్. శ్రీ్ధర్ తమతమ పదవులు నిలబెట్టుకోవడానికి మళ్లీ దరఖాస్తులు పెట్టుకున్నారు. భారత క్రికెట్ జట్టుకు డైరెక్టర్‌గా రవి శాస్ర్తీ పదవీకాలం ఇటీవలే ముగిసింది. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగార్, ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీ్ధర్ వ్యవహరిస్తున్నారు.

06/01/2016 - 01:00

జకార్తా, మే 31: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియం బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ హైదరాబాదీ మొదటి రౌండ్‌లో 23వ ర్యాంకర్ పాయ్ యూ పోను 21-11, 19-21, 21-15 తేడాతో ఓడించింది. గతంలో మూడు పర్యాయాలు ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ఆమె రెండో రౌండ్‌లో స్థానిక క్రీడాకారిణి ఫిట్రియానితో తలపడుతుంది.

06/01/2016 - 00:59

చెస్టర్ లీ స్ట్రీట్, మే 31: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ షామింద ఎరాంగ బౌలింగ్ యాక్షన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి ఫిర్యాదు అందింది. అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే అనుమానాన్ని ఫీల్డ్ అంపైర్లు వ్యక్తం చేశారని, లిఖిత పూర్వక ఫిర్యాదును అందించారని ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. ఐసిసి నిబంధనల ప్రకారం బౌలింగ్ చేసే సమయంలో బౌలర్ చేతి వంపు 15 డిగ్రీలకు మించి ఉండకూడదు.

06/01/2016 - 00:58

ముంబయి, మే 31: ఐ-లీగ్ చాంపియన్ బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ చీఫ్ కోచ్ ఆష్లే వెస్ట్‌వుడ్ గుడ్‌బై చెప్పాడు. సపర్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బెంగళూరు యాజమాన్యం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అతనితో క్లబ్ కుదుర్చుకున్న మూడేళ్ల కాంట్రాక్టు కాలం ముగిసిందని పేర్కొంది.

06/01/2016 - 00:56

లండన్, మే 31: బ్యాంకులకు చెల్లించాల్సిన సుమారు 9,000 కోట్ల రూపాయలు బకాయిలను ఎగ్గొట్టి, లండన్‌కు చెక్కేసిన ‘లిక్కర్ కింగ్’ విజయ్ మాల్యా ఐపిఎల్ ఫైనల్ చూస్తూ కేరింతలు కొట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలవాలంటూ అతను కేకలు పెడుతున్న దృశ్యాలను అతని కుమారుడు సిద్ధార్థ్ మాల్యా సోష ల్ నెట్‌వర్క్‌లో ఉంచాడు. లండన్‌లో తన తండ్రితో కలిసి ఐపిఎల్ ఫైనల్‌ను టీవీలో చూశానని అతను తెలిపాడు.

06/01/2016 - 00:54

అలీగఢ్, మే 31: నోబాల్ నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఒక బంతిని నోబాల్‌గా ప్రకటించినందుకు ఓ అంపైర్ తన సోదరిని కోల్పోయాడు. అలీగఢ్‌లో జరారా, బరికి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి రాజ్ కుమార్ అంపైర్‌గా వ్యవహరించాడు. ఒక బౌలర్ వేసిన బంతిని అతను నోబాల్‌గా ప్రకటించాడు. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా సందీప్ పాల్ అనే ఆటగాడు చేసిన విజ్ఞప్తిని రాజ్ కుమార్ తిరస్కరించాడు.

06/01/2016 - 00:54

పారిస్, మే 31: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను వర్షం వెంటాడుతునే ఉంది. సోమవారం వర్షం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. 16 ఏళ్ల కాలంలో ఈ విధంగా ఒక రోజు జరగాల్సిన మ్యాచ్‌లన్నీ రద్దు కావడం ఇదే మొదటిసారి. కాగా, మంగళవారం కూడా వర్షం బెడద కొనసాగింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధ రాత్రి వరకూ మ్యాచ్‌లు మొదలుకాలేదు.

05/31/2016 - 06:40

పారిస్, మే 30: బ్రిటన్ ఆశా కిరణం, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే ఫ్రెండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. 33 ఏళ్ల ముర్రే ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన జాన్ ఇస్నర్‌ను 7-6, 6-4, 6-3 తేడాతో ఓడించి, కెరీర్‌లో ఆరోసారి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. సెమీస్‌లో స్థానం కోసం అతను రిచర్డ్ గాస్క్వెట్‌తో తలపడతాడు.

Pages